You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: జనవరి 16 నుంచి భారత్‌లో కోవిడ్ వ్యాక్సీనేషన్.. మొదట ఎవరెవరికంటే - BBC Newsreel
భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నవారు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు మొదటి ప్రాధాన్యంగా వ్యాక్సీన్ వేస్తారు.
మొదటి విడతలో సుమారు 3 కోట్ల మందికి వ్యాక్సీన్ వేస్తారు.
ఆ తరువాత 50 ఏళ్లు దాటినవారు.. 50 ఏళ్ల లోపు వయసున్నా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి టీకా వేస్తారు. ఇలాంటివారు సుమారు 27 కోట్ల మంది ఉంటారని అంచనా.
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి స్థితిగతులు, వ్యాక్సీనేషన్ కోసం సన్నద్ధత తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
డోనల్డ్ ట్రంప్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించిన ట్విటర్
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ట్విటర్ వెల్లడించింది. ఆయన మళ్లీ హింసను ప్రేరేపించే ముప్పున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ట్రంప్ ట్విటర్ ఖాతా ''రియల్‌డోనల్డ్‌ట్రంప్'' నుంచి చేసిన వరుస ట్వీట్లను సమీక్షించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు ట్విటర్ పేర్కొంది.
ట్రంప్‌పై పూర్తిగా నిషేధం విధించాలని ఏళ్ల నుంచీ కొందరు సెలబ్రిటీలు, శాసనకర్తలు కోరుతున్నారు. అమెరికా ఇదివరకటి అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ కూడా ట్రంప్‌పై శాశ్వతంగా నిషేధం విధించాలని రెండు రోజుల క్రితం కోరారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్ బుధవారం భేటీ అయ్యింది. అయితే ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వందల మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించారు. ఈ ఉద్రిక్తతల్లో నలుగురు పౌరులు, ఓ పోలీసు అధికారి మరణించారు.
క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన వారిని దేశ భక్తులుగా ట్రంప్ అభివర్ణించారు. దీంతో మరోసారి తమ నిబంధనలను ఉల్లంఘిస్తే శాశ్వతంగా ఖాతాను తొలగిస్తామని ట్విటర్ హెచ్చరించింది.
హింసను రెచ్చగొట్టేలా శుక్రవారం మరో రెండు ట్వీట్లను ట్రంప్ చేశారని, అందుకే ఆయన ఖాతాను తొలగిస్తున్నామని ట్విటర్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)