పాకిస్తాన్‌లో భూకంపం.. 22మంది మృతి, 300 మందికి గాయాలు

పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 22 మంది మరణించారని, 300కు పైగా ప్రజలు గాయపడ్డారని పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని మీర్పూర్ డీఐజీ ప్రకటించారు.
భూకంప కేంద్రం మీర్పూర్ నగరానికి సమీపంలోనే ఉందని ఆయన అన్నారు.
"10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది మీర్పూర్ నగరమే" అని పాకిస్తాన్ వాతావరణ శాఖ ముఖ్య అధికారి ముహమ్మద్ రియాజ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.

చనిపోయినవారిలో పిల్లలు కూడా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.
వైద్యసహాయం అందించడానికి బృందాలను పంపించామని పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది.

ఫొటో సోర్స్, EPA
మీర్పూర్‌లోని అనేక కార్యాలయాల్లోని ప్రజలు భూకంపం సంభవించడంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
గోర్సియాన్, జాట్లాన్, భీంభర్ వంటి అనేక ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ఈ భూకంప తీవ్రతకు జాట్లాన్ సమీపంలో రెండు బ్రిడ్జిలు కుప్పకూలాయి. విద్యుత్ వ్యవస్థ స్తంభించింది.

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని మీర్పూర్‌కు వెళ్లే రహదారి అనేక చోట్ల భారీ పగుళ్లిచ్చింది.
2005లో పాకిస్తాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో వేలాదిమంది చనిపోయారు.
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి.
- ‘అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకారం
- ఇండోనేసియా: సునామీ హెచ్చరిక వ్యవస్థ నమ్మదగినదేనా?
- BBC Ground Report - ఇండోనేసియా సునామీ: 'మా అమ్మ ఏది? ఎక్కడికి వెళ్ళింది?'
- మధ్యాహ్న భోజన పథకం: దక్షిణ భారత్‌లో అమలవుతోంది, ఉత్తరాదిలో ఎందుకు కావడం లేదు
- కశ్మీర్‌పై భారత్-పాకిస్తాన్ల హెచ్చరిక ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవచ్చు
- ‘POK భారత్‌లో భాగమే. ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం’ - భారత విదేశాంగ మంత్రి
- కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన
- కమలీ: ఆస్కార్ 2020 బరిలో నిలిచిన ఈ అమ్మాయి జీవిత కథేంటంటే..
ఈ వీడియో చూశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























