ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ప్రచురణ

ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు ఇవి చదవకపోతే వెంటనే చదవండి.

1. రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపడా డబ్బు రావాలంటే ఏం చేయాలి?

మనకంటే ముందు తరాలకు, మన తరానికి మధ్య అతిపెద్ద తేడా ''రిటైర్మెంట్ జీవితం'' అంటే అతిశయోక్తి కాదు. పింఛను గ్యారంటీ లేని మొదటి తరం మనదే. కాబట్టి మన రిటైర్మెంట్ జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయం మీద అన్నీ ఊహాగానాలు, సిద్ధాంతాలే తప్ప సరైన అవగాహన లేదు.

ఇలాంటి తరుణంలో రిటైర్మెంట్ జీవితం ఒడిదొడుకులకు గురయ్యే అవకాశం ఎక్కువ.

ఇవి కూడా చదవండి

2.మనీ లాండరింగ్ అంటే ఏంటి? అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధం ఎలా చేస్తారు?

బ్లాక్ మనీని (చట్ట వ్యతిరేకంగా, అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు)ను వైట్ మనీగా (చట్టబద్ధంగా) మార్చే ప్రక్రియనే మనీ లాండరింగ్ అని అంటారు. అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన లేదా ఆదాయానికి మించి సమకూరిన సంపాదనను బ్లాక్ మనీ అని అంటారు.

మనీ లాండరింగ్‌లో వివిధ దశలను, చోటు చేసుకునే విధానాన్ని బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ సంస్థలో యాంటీ మనీ లాండరింగ్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న బిపిన్ నాయిర్ బీబీసీకి వివరించారు.

మనీ లాండరింగ్ ఎలా జరుగుతుంది?పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

3. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను ఎలా గుర్తించాలి? మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి

మీరేదో పనిలో ఉండగా మీ ఫేస్‍బుక్ మెసెంజర్‍లో ఒక పింగ్ వస్తుంది. తెరిచి చూస్తే, మీకు పరిచయం ఉన్న పేరు, ఫోటో నుంచి ఒక పలకరింపు. మీరు సమాధానమిస్తారు. మీరు హలో అనగానే, వాళ్లు, "హలో.. నేను ఆస్పత్రి దగ్గర ఉన్నాను. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది. వెంటనే డబ్బు పంపండి. వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేస్తాను" అని మెసేజ్ పెడతారు.

మీరు అది నమ్మి, ఎప్పుడు జరిగింది, ఏం జరిగిందనే వివరాలు కనుక్కుంటారు. వెంటనే వాళ్లు "డబ్బు పంపండి త్వరగా, ఈ నెంబర్‍కు గూగుల్ పే చేయండి" అంటూ ఒక ఫోన్ నంబర్ ఇస్తారు.

ఇలాంటి మెసేజులను నమ్మి మీరు వెంటనే డబ్బులు వేశారంటే, అంతే సంగతులు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

4. హిమాలయాల్లోని 'రహస్య స్వర్గపు లోయల' మర్మమేంటి? ఈ 'బీయూల్‌'ల గురించి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టారా?

''హిమాలయాల్లోని బీయూల్ ఒక పవిత్ర స్థలం, ఆశ్రయం అందించే స్థానం. ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను లామాలు (టిబెట్ బౌద్ధ టీచర్లు) నడిపిస్తారు'' అని 'గెయటీ ఆఫ్ స్పిరిట్- ద షెర్పస్ ఆఫ్ ఎవరెస్ట్' అనే పుస్తక రచయిత ఫ్రాన్సిస్ క్లాజెల్ వివరించారు. హిమాలయాలు, బౌద్ధుల సంస్కృతి గురించి ఆమె అనేక పుస్తకాలు రాశారు.

కానీ, బీయుల్‌లోకి ఎవరు పడితే వారు ప్రవేశించలేరని ఆమె చెప్పారు. జీవితంలో అనేక పరీక్షలను, కష్టాలను ఎదుర్కొని స్వచ్ఛమైన హృదయం ఉన్న నిజమైన బౌద్ధుడు మాత్రమే బీయూల్‌కి ప్రవేశించగలరని పేర్కొన్నారు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

5. ఏ.కోడూరు MPPS: ఒకే పాఠశాలకు తండ్రి, కొడుకు, మనవడు.. మూడు తరాల ప్రభుత్వ స్కూల్ ఇదీ

60ఏళ్ల మల్లేశ్వరరావు కుమారుడు 33 ఏళ్ల ప్రవీణ్, అతడి కుమారుడు 7ఏళ్ల అనిరుధ్. మూడు తరాలకు ప్రతినిధులైన ఈ ముగ్గురు రోజూ అనకాపల్లి జిల్లా ఏ.కోడూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి వస్తుంటారు.

ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వరరావు. ప్రవీణ్ ఆ పాఠశాలలోనే టీచర్. అనిరుధ్ అదే పాఠశాలలో స్టూడెంట్.

ఇలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల ప్రతినిధులైన తాత, కొడుకు, మనవడు ఒకే పాఠశాలకు వెళ్లడం చాలా అరుదు.

పూర్తి కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)