ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఫొటో సోర్స్, Getty Images
ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు ఇవి చదవకపోతే వెంటనే చదవండి.
విశాఖపట్నం: బీచ్‌లో ఇసుక నల్లగా మారడానికి కారణం ఏంటి?
ఇటీవల విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఇసుక నల్లగా మారింది.
సందర్శకులు ఎక్కువ ఉండే ఈ స్పాట్ లో ఇసుక నల్లగా మారడంతో కొందరు అందోళనకు గురయ్యారు.
ఆర్కే బీచ్ నుంచి ఉడా పార్కు వరకు ఉన్న తీర ప్రాంతంలో తరుచూ ఇసుక నల్లగా మారుతూ ఉంటుంది.
అయితే ఏ తీరంలోనైనా ఇసుక నల్లగా మారుతుందా? దానికి కారణలేంటి?
ఇతర రంగుల్లోకి కూడా తీరంలోని ఇసుక మారుతుందా?
రంగు మారడం దేనికి సంకేతం? ఇటువంటి అంశాలపై సముద్రగర్భ, జియాలజీ, వాతావరణ నిపుణులతో బీబీసీ మాట్లాడింది.
ఇవి కూడా చదవండి

అఫ్గానిస్తాన్‌లో హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గిపోతోందా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో వచ్చి ఏడాది పూర్తయింది.
ఇప్పటికీ, రాజధాని కాబూల్ సహా ఇతర ప్రాంతాల్లో తీవ్రవాదుల దాడులు, పేలుళ్ల భయం ఉంది.
ఆ దేశంలో పోరాటం ముగిసినట్టే ఉంది కానీ, శాంతి లేదనిపిస్తోంది.
ఒక సర్వే ప్రకారం, 1992కు ముందు అఫ్గానిస్తాన్‌లో రెండు లక్షలకు పైగా హిందువులు, సిక్కులు ఉండేవారు.
ఇప్పుడు అక్కడున్న మైనార్టీల పరిస్థితి ఏంటి.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, COURTESY DR PRONOY BAIDYA
ఎల్లో క్రేజీ యాంట్: ఈ చీమలు పాములు, కుందేళ్లు, పశువులనూ చంపేస్తాయి
చీమల దండు దండయాత్రతో తమిళనాడులోని కొన్ని గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు.
ఎల్లో క్రేజీ యాంట్ అని పిలిచే ఈ చీమలు తమ పంటలను తినేస్తున్నాయని, తమ పశువుల మీద దాడి చేస్తున్నాయని, తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
ఈ చీమలు కుట్టవు. కరవవు. అయినా ఈ గ్రామాల ప్రజలు ఎందుకు భయపడుతున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
కోళ్ల కోసం వెతుకుతుంటే,భూగర్భ నగరం కనిపించింది
కపడోషియా భూగర్భంలో ఒక భారీ అద్భుతం దాగి ఉంది.
భూగర్భంలో దాగి ఉన్న ఈ నగరం ఒకే సారి 20,000 మందిని బాహ్య ప్రపంచానికి కనిపించకుండా చేయగలదు.
ప్రాచీన నగరం ఎలెన్‌గుబు (ప్రస్తుత డెరిన్‌కుయు) భూమికి 85 మీటర్ల అడుగున నిక్షిప్తమై ఉంది. ఇందులో 18 అంతస్తుల్లో సొరంగాలు ఉన్నాయి.
ప్రపంచంలోనే భూగర్భంలో ఉన్న అతి పెద్ద నగరం ఇది.
ఇదే ప్రాంతంలో కనిపెట్టిన 200కు పైగా చిన్న చిన్న భూగర్భ నగరాలు ఈ సొరంగంతో అనుసంధానమై ఉండవచ్చని చెబుతారు. ఈ నిర్మాణం పెద్ద భూగర్భ నెట్‌వర్క్ సృష్టించిందని అంటారు.
డెరిన్‌కుయు ను 1963లో ఒక స్థానికుడు కనిపెట్టారు. ఆయన పెంపుడు కోళ్లు ప్రతిరోజు కనిపించకుండా మాయమవుతూ ఉండటం, వాటిని ఆయన వెతడకం ఈ భూగర్భ నగరాన్ని కనిపెట్టేందుకు దారి తీసింది.

ఫొటో సోర్స్, NASA
చంద్రుడి మీదకు వెళ్లేందుకు భారీ రాకెట్ రెడీ చేసిన నాసా
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. చంద్రుడి మీదకు పంపించటానికి భారీ రాకెట్‌ను సిద్ధం చేస్తోంది.
ఆగస్టు 29న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న ఈ రాకెట్‌ను స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) అని పిలుస్తున్నారు.
దాదాపు 100 మీటర్ల పొడవున్న ఈ రాకెట్‌ను.. కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని తయారీ భవనం నుంచి భారీ ట్రక్ మీద పెట్టి లాంచ్ పాడ్ 39బికి తరలించారు.
ఇవి కూడా చదవండి:
- దువ్వూరి సుబ్బమ్మ: స్వాతంత్ర్య పోరాటంలో జైలు పాలయిన తొలి తెలుగు నాయకురాలు
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు ఎందుకు కోరుతున్నారు?
- విశాఖపట్నం: “ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెస్ అయ్యా”
- కార్తికేయ 2 రివ్యూ: శ్రీకృష్ణుడి కాలి కడియం కథను నమ్ముకున్న నిఖిల్ సీక్వెల్ సినిమా హిట్టవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























