దిల్లీ: రోహిణి కోర్టు ఆవరణలో కాల్పులు, నలుగురు మృతి

ఫొటో సోర్స్, Getty Images
దేశ రాజధాని దిల్లీలోని రోహిణిలో ఉన్న కోర్టు ఆవరణలో కాల్పులు జరిగాయి.
గ్యాంగ్‌స్టర్ అఖిల్ గోగి అలియాస్ జితేంద్ర లక్ష్యంగా జరిగిన ఈ కాల్పులలో గోగి సహా నలుగురు మరణించారు.
దుండగులు కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్న ‘దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్’ సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు.
దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గార్డులు జరిపిన కాల్పులలో దుండగులు ఇద్దరూ మరణించారు.
రోహిణి కోర్టు నంబర్ 207 బయట ఈ ఘటన చోటుచేసుకుంది.
మొత్తం 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరగడంతో కోర్టు ఆవరణలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది.
ఈ కాల్పులలో ఒక మహిళా న్యాయవాది సహా ముగ్గురు గాయపడ్డారు.
కాల్పులు జరిపిన దుండగులు న్యాయవాదుల్లా దుస్తులు ధరించి వచ్చారని అక్కడున్నవారు తెలిపారు.
కాగా రెండేళ్ల కిందట దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గోగిని గుర్‌గావ్‌లో అరెస్ట్ చేసింది.
గోగి ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులు ఈ దాడి చేసినట్లు భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
స్పెషల్ ఎన్డీపీఎస్ జడ్జి గగన్‌దీప్ సింగ్ ఉన్న రోహిణి కోర్ట్ నంబర్ 207లో ఈ దారుణ ఘటన జరిగింది.
నిందితులు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడ్డారని రోహిణి కోర్ట్ వర్గాలు బీబీసీకి చెప్పాయి.
ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకోడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్లకు చిప్ లేదా నకిలీ తయారు చేయలేని విధంగా ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలి. దానిని కోర్టులోకి ప్రవేశించే ముందు చెక్ చేయాలి. ఆ కార్డులు అన్ని కోర్టుల్లో చెల్లేలా చూడాలి అని కోర్టు ఉద్యోగుల్లో ఒకరైన అతుల్ బీబీసీతో అన్నారు.
"రెండేళ్ల క్రితం లాయర్లు ఆందోళనలు చేసిన తర్వాత, కోర్టు ప్రాంగణంలోకి వస్తున్న లాయర్లను సరిగా తనిఖీ చేయడం లేదు. ఫలితంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి" అని న్యాయవాది అమిత్ కుమార్ అన్నారు.
లాయర్లైనా, వేరే ఎవరైనా పురుషులు, మహిళలు అనేదానితో సంబంధం లేకుండా లోపలికి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ రోజు జరిగిన ఘటనకు నిరసనగా రేపు తాము కోర్టులకు దూరంగా ఉంటామని దిల్లీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ నసియార్ బీబీసీకి చెప్పారు.
"ఈ ఘటన చాలా విషాదం. ఈరోజు జరిగిన ఈ దారుణ ఘటనకు నిరసనగా మేం రేపు ఏడు జిల్లాల్లో కోర్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటాం" అని ఆయన తెలిపారు.
దిల్లీలోని అన్ని జిల్లా కోర్టుల్లో భద్రత, తనిఖీలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని ఆయన చెప్పారు.
"ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోడానికి నిందితులు కచ్చితంగా బెయిల్ మీద వచ్చుంటారు. లాయర్లలా వస్తే తమను పెద్దగా తనిఖీ చేయరనే అలా వచ్చుంటారు" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో లాయర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, పొందడం ఎలా?
- విశాఖలో కుక్కల పార్కుపై వివాదమేంటి? వద్దంటున్నదెవరు, కావాలనేదెవరు
- 'కన్యాదానం' అమ్మాయిలకే ఎందుకు? భారతీయ సంప్రదాయాలను సవాలు చేస్తున్న ప్రకటనలు
- మోదీ ఈ అంశంపై బైడెన్‌తో చర్చించాలనుకుంటున్నారు, ఏం జరగబోతోంది?
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లకు ఇప్పుడు ఐఎస్ శత్రువుగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)



























