వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 ఫైనల్‌కు టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ- Newsreel

ఇంగ్లాండ్ లోని సౌథాంప్టన్ ‌లో భారత్ న్యూజీలాండ్‌ల మధ్య టైటిల్ పోరు జరుగుతుంది.

ఫొటో సోర్స్, BCCI TV

ఫొటో క్యాప్షన్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 ఫైనల్ కు బీసీసీఐ జట్టును ప్రకటించింది.
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 ఫైనల్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో ఇండియా టీమ్‌ను ప్రకటించింది.

జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, అజింక్య రహనే వైస్ కెప్టెన్‌, రిషబ్ పంత్, వర్ధమాన్ సాహాలు వికెట్ కీపర్‌లు.

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజార, హనుమ విహారీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఎండీ సిరాజ్‌లు జట్టులోని మిగిలిన సభ్యులు

ఈ నెల 18న ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్‌లో భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

డెల్టా ప్లస్: కోవిడ్-19లో కొత్త వేరియంట్.. కాక్‌టెయిల్ చికిత్స దీనిపై పనిచేయట్లేదు

‘‘కరోనావైరస్ సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ (బి 1.617.2) ప్రధాన పాత్ర పోషించింది. ఈ వేరియంట్‌లో మ్యుటేషన్లు జరగడంతో కొత్తగా వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్‌ (బి.1.617.2.1 - ఏవై 1) ఇక్కడ వ్యాపిస్తున్నట్లు గుర్తించాం’’ అని నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మంగళవారం వెల్లడించారు.

‘‘మార్చి నుంచే ఈ వేరియంట్ ఐరోపాలో విజృంభిస్తోంది. ఇక్కడ జూన్ 13న ఈ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు గుర్తించాం. కాక్‌టెయిల్ యాంటీబాడీల చికిత్సలు కూడా ఈ కొత్త వేరియంట్‌పై పనిచేయడం లేదు’’ అని ఆయన చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కరోనా రోగులకు కాక్‌టెయిల్ ఔషధాన్ని వినియోగించేందుకు ఇటీవల భారత ఔషధ ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. ఈ యాంటీబాడీ ఔషధం ఒక డోసుకు రూ.59,750గా ధర నిర్ణయించారు.

‘‘ఈ వేరియంట్‌ వ్యాప్తిపై ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని కేసులు ప్రస్తుతానికి తక్కువే ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మేం అధ్యయనం చేపడుతున్నాం’’ అని వీకే పాల్ చెప్పారు.

మరోవైపు డెల్టా వేరియంట్‌పై మిగతా వ్యాక్సీన్ల కంటే స్పుత్నిక్ వి మెరుగ్గా పనిచేస్తోందని రష్యాకు చెందిన ద గమలేయ సెంటర్ ఫర్ స్టడీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఏప్రిల్, మే నెలల్లో భారత్‌లో కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు రోజుకు నాలుగు లక్షలకుపైనే కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)