మియన్మార్ సైనిక కుట్ర: ఆంగ్ సాన్ సూచీపై అత్యంత తీవ్రమైన అవినీతి ఆరోపణలు - Newsreel

ఆంగ్ సాన్ సూచీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఆంగ్ సాన్ సూచీ పై మిలటరీ అధికారులు అవినీతి అభియోగాలను నమోదు చేశారు
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

నిర్బంధంలో ఉన్న మియన్మార్ మాజీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ పై మిలటరీ అధికారులు అవినీతి అభియోగాలను నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆమెపై నమోదు చేసిన అభియోగాల్లో ఇదే అత్యంత తీవ్రమైనది.

సూచీ బంగారం, నగదు రూపంలో లంచాలు స్వీకరించినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు రుజువైతే, ఆమెకు 15 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

చట్ట వ్యతిరేకంగా ఆమె వాకీ, టాకీలను కూడా దిగుమతి చేసుకుని, శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రేరేపించారనే అభియోగాన్ని కూడా ఆమె ఎదుర్కొంటున్నారు.

మియన్మార్‌ సైన్యం పాలక ప్రభుత్వం పై తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత ఫిబ్రవరి 1న సూచీని అరెస్టు చేశారు.

అప్పటి నుంచి ఆమె హౌస్ అరెస్టులోనే ఉన్నారు. అప్పటి నుంచి ఆమె అప్పుడప్పుడూ కోర్టులో కనిపించడం తప్ప ఎక్కడా కనిపించడం గాని, మాట్లాడటం గాని, చేయలేదు.

సూచీ 6,00,000 డాలర్ల సొమ్మును, బంగారాన్ని లంచంగా తీసుకున్నట్లు గురువారం మిలటరీ కౌన్సిల్ విడుదల చేసిన పత్రికా ప్రకటన తెలిపింది.

మియన్మార్‌ను అంతకు ముందు పాలించిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ప్రభుత్వం కూడా భూవివాదాల్లో చాలా డబ్బును కోల్పోయినట్లు ఆరోపించింది.

సూచీతో పాటు అనేక మంది అధికారులు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు, సూచీ పై అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లఘించినట్లు అభియోగం నమోదైంది. ఈ నేరం నిరూపణ అయితే 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

గత సంవత్సరం మియన్మార్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్నిస్వాధీనం చేసుకుంది.

సూచీ పై నమోదైన ప్రధాన అభియోగాలు

  • అవినీతి - నిరూపణ అయితే, 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
  • అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన - నిరూపణ అయితే, 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
  • ఎగుమతులు - దిగుమతుల చట్టం ఉల్లంఘన - నిరూపణ అయితే, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది
  • టెలి కమ్యూనికేషన్స్ చట్టం ఉల్లంఘన - నిరూపణ అయితే1 సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
  • సహజ విపత్తుల చట్టం ఉల్లంఘన పై రెండు అభియోగాలు - నిరూపితమైతే, ఒక్కొక్క నేరానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
  • శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రేరేపణ - నిరూపితమైతే, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు.నిర్బంధంలో ఉన్న మియన్మార్ మాజీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ పై మిలటరీ అధికారులు అవినీతి అభియోగాలను నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆమె పై నమోదు చేసిన అభియోగాల్లో ఇదే అత్యంత తీవ్రమైనది.
83 ఏళ్ల ఆసియా ఏనుగు రాణి

ఫొటో సోర్స్, Hyd zoo PRO

ఫొటో క్యాప్షన్, 83 ఏళ్ల ఆసియా ఏనుగు రాణి(ఫైల్ ఫొటో)

హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో 'రాణి' ఏనుగు మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో 83 ఏళ్ల రాణి అనే ఏనుగు మంగళవారం మరణించింది.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాణి వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యలతో మరణించినట్లు జూ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ జూలో ఉన్న అన్ని జంతువులకంటే రాణి వయసులో పెద్దది. ఇది 1938 అక్టోబర్ 7న పుట్టింది.

1963లో ఈ ఏనుగును నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి నెహ్రూ జూ కి తీసుకువచ్చారు. హైదరాబాద్ లో జరిగే బోనాల వేడుకలు, మొహర్రం ఊరేగింపుల్లో రాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది.

83 ఏళ్ల ఆసియా ఏనుగు రాణి

ఫొటో సోర్స్, Hyd zoo pro

ఫొటో క్యాప్షన్, రాణి(ఫైల్ ఫొటో)

ఆసియాలో ఎక్కువ కాలం జీవించిన ఏనుగుల్లో రాణి మూడోది.

ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు దగ్గరున్న 88 ఏళ్ల చెంగళ్లూర్ దాక్షాయణి అనే ఆడ ఏనుగు ఎక్కువ కాలం జీవించగా, లిన్ వ్యంగ అనే 86 ఏళ్ల మగ ఏనుగు దాని తర్వాత స్థానంలో నిలిచింది.

ఇప్పుడు రాణి చనిపోవడంతో హైదరాబాద్ జూలో నాలుగు ఆసియా ఏనుగులే మిగిలాయి.

బుధవారం హైదరాబాద్ జూలో 21 ఏళ్ల చిరుతపులి కూడా చనిపోయింది. దీనిని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శన శాల నుంచి 2000 సంవత్సరంలో హైదరాబాద్ జూకు తీసుకువచ్చారు.

ముంబయిలో కూలిన ఇల్లు

ఫొటో సోర్స్, Ani

ముంబయిలో కూలిన మూడంతస్తుల భవనం, 11 మంది మృతి

ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ మలాడ్‌లోరద్దీగా ఉండే ఒక ప్రాంతంలో ఒక మూడంతస్తుల భవనం కుప్పకూలింది.

బుధవారం రాత్రి 11 గంటలకు జరిగిన ఈ ఘటనలో 11 మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

భవనం కూలిపోవడంతో, దాని చుట్టుపక్కల మరో మూడు ఇళ్లను ఖాళీ చేయించినట్లు బీఎంసీ చెప్పింది. అవి కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయని తెలిపింది.

ఈ ఘటనలో గాయపడినవారిని బీడీబీఏ మునిసిపల్ ఆస్పత్రికి తరలించారు. భవనం కూలిన సమయంలో లోపల పిల్లలుసహా చాలామంది ఉన్నారు.

అర్థరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సాయంతో సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. అవి ఉదయం కూడా కొనసాగాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"మూడంతస్తుల భవనం పక్కనే ఉన్న మరో భవనం మీద కూలిపోయింది. శిథిలాల నుంచి 18 మందిని బయటకు తీసుకొచ్చాం. వారిలో 11 మంది చనిపోయారు. పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు" అని అదనపు పోలీస్ కమిషనర్ దిలీప్ సావంత్ ఏఎన్ఐకు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)