You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు - Newsreel
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
రాష్ట్రాలతో పాటు ఈ పరీక్షలతో సంబంధం అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాత రద్దుకు మొగ్గు చూపినట్లు కేంద్రం తెలిపింది.
విద్యార్ధులు, ఉపాధ్యాయులలో ఈ పరీక్షలకు సంబంధించిన ఆందోళన ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదని ప్రధాన మంత్రి మోదీ ఈ సందర్భంగా అన్నట్లు పీటీఐ పేర్కొంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్ధులతో బలవంతంగా పరీక్షలు రాయించాల్సిన అవసరం లేదని, విద్యార్ధుల సంక్షేమం దృష్ట్యా సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రధానమంత్రి ఈ సమావేశం సందర్భంగా అన్నారు.
నిర్ధారిత ఫార్మాట్‌లో మదింపు చేసి, సరైన సమయంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
గతంలో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న ఈ తరుణంలో పరీక్షల నిర్వహణ మంచిది కాదంటూ వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
మేఘాలయ బొగ్గు గనిలో మూడు రోజులుగా చిక్కుకుపోయిన ఐదుగురు కార్మికులు
ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని బొగ్గు గనులు మరోసారి వార్తల్లో నిలిచాయి. తాజాగా ఇక్కడి తూర్పు జైంతియా జిల్లాలోని ఓ బొగ్గు గనిలో ఐదుగురు కార్మికులు మూడు రోజులుగా చిక్కుకుపోయారు.
డైనమైట్ పేలడంతో ఈ బొగ్గు గని ప్రవేశ మార్గంలోకి వరద నీరు ప్రవేశించింది. ఆదివారం ఈ ఘటన జరిగింది.
లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పీటీఐ తెలిపింది.
లోపల చిక్కుకున్న వారిలో నలుగురు అసోం, ఒకరు త్రిపురలకు చెందిన వలస కార్మికులు ఉన్నారు.
అయితే, లోపల ఆరుగురు చిక్కుకుపోయారని కొంతమంది చెబుతున్నారు.
ఇలాంటి ఘటనలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష నాయకుడు ముకుల్ సంగ్మా ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‍పై విచారణ 14కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కోర్టే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోరింది. ఈ మేరుకు న్యాయస్థానంలో సీబీఐ మెమో దాఖలు చేసింది.
దీంతో, జగన్ బెయిల్ రద్దు పిటిషన్‍పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 14కి వాయిదా వేసింది.
అంతకు ముందు బెయిల్ రద్దు పిటిషన్‍పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ తరఫు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు.
బెయిల్ షరతులను జగన్ ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని లాయర్లు తమ కౌంటర్‌లో తెలిపారు.
సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని, పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు.
ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని లాయర్లు తెలిపారు.
రఘరామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని స్పీకర్‍కు లేఖ కూడా రాశారని చెప్పారు.
రఘురామరాజుపై ఏపీలో ఎన్నో కేసులున్నాయని చెప్పిన జగన్ తరఫు లాయర్లు, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన కోర్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నారని కోర్టు ముందు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- చైనా: సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారీ రాకెట్ ప్రయోగం
- అంగారక గ్రహం మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్
- మార్స్ మీద మొదటిసారిగా శ్వాసించదగిన ఆక్సిజన్ తయారు చేసిన నాసా రోవర్
- మేడ మీదే విమానం తయారీ
- చైనా రాకెట్ భూమ్మీదకు దూసుకొచ్చింది... ముక్కలు ముక్కలై హిందూ మహాసముద్రంలో పడిపోయింది
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)