సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు - Newsreel

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

రాష్ట్రాలతో పాటు ఈ పరీక్షలతో సంబంధం అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాత రద్దుకు మొగ్గు చూపినట్లు కేంద్రం తెలిపింది.

విద్యార్ధులు, ఉపాధ్యాయులలో ఈ పరీక్షలకు సంబంధించిన ఆందోళన ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదని ప్రధాన మంత్రి మోదీ ఈ సందర్భంగా అన్నట్లు పీటీఐ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్ధులతో బలవంతంగా పరీక్షలు రాయించాల్సిన అవసరం లేదని, విద్యార్ధుల సంక్షేమం దృష్ట్యా సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రధానమంత్రి ఈ సమావేశం సందర్భంగా అన్నారు.

నిర్ధారిత ఫార్మాట్‌లో మదింపు చేసి, సరైన సమయంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

గతంలో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న ఈ తరుణంలో పరీక్షల నిర్వహణ మంచిది కాదంటూ వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

మేఘాలయ రేట్ హోల్ మైన్స్

ఫొటో సోర్స్, Getty Images

మేఘాలయ బొగ్గు గనిలో మూడు రోజులుగా చిక్కుకుపోయిన ఐదుగురు కార్మికులు

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని బొగ్గు గనులు మరోసారి వార్తల్లో నిలిచాయి. తాజాగా ఇక్కడి తూర్పు జైంతియా జిల్లాలోని ఓ బొగ్గు గనిలో ఐదుగురు కార్మికులు మూడు రోజులుగా చిక్కుకుపోయారు.

డైనమైట్ పేలడంతో ఈ బొగ్గు గని ప్రవేశ మార్గంలోకి వరద నీరు ప్రవేశించింది. ఆదివారం ఈ ఘటన జరిగింది.

లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పీటీఐ తెలిపింది.

లోపల చిక్కుకున్న వారిలో నలుగురు అసోం, ఒకరు త్రిపురలకు చెందిన వలస కార్మికులు ఉన్నారు.

అయితే, లోపల ఆరుగురు చిక్కుకుపోయారని కొంతమంది చెబుతున్నారు.

ఇలాంటి ఘటనలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష నాయకుడు ముకుల్ సంగ్మా ఆరోపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

వై.ఎస్.జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‍పై విచారణ 14కి వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ విషయంలో కోర్టే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోరింది. ఈ మేరుకు న్యాయస్థానంలో సీబీఐ మెమో దాఖలు చేసింది.

దీంతో, జగన్ బెయిల్ రద్దు పిటిషన్‍పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 14కి వాయిదా వేసింది.

అంతకు ముందు బెయిల్ రద్దు పిటిషన్‍పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ తరఫు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు.

బెయిల్ షరతులను జగన్ ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని లాయర్లు తమ కౌంటర్‌లో తెలిపారు.

సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని, పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు.

ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని లాయర్లు తెలిపారు.

రఘరామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని స్పీకర్‍కు లేఖ కూడా రాశారని చెప్పారు.

రఘురామరాజుపై ఏపీలో ఎన్నో కేసులున్నాయని చెప్పిన జగన్ తరఫు లాయర్లు, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన కోర్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నారని కోర్టు ముందు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)