You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏసీ పేలడంతో ఆస్పత్రి ఐసీయూలో మంటలు.. 13 మంది కోవిడ్ రోగులు మృతి
మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా విరార్‌లోని ఒక కోవిడ్ ఆసుపత్రిలో మంటలు వ్యాపించడంతో 13 మంది రోగులు మరణించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ప్రమాదం జరిగిన ఆసుపత్రిలోని మిగతా రోగులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు చెప్పారు.
ఏసీ పేలడంతో ఐసీయూలో మంటలు
ఐసీయూలోని ఏసీ పేలడంతో మంటలు వ్యాపించినట్లు ఆసుపత్రి వద్ద ఉన్న ఒక పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.
వేకువజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగేటప్పటికి ఐసీయూలో 17 మంది కోవిడ్ పేషెంట్లు ఉన్నారని తెలిపారు.
వారిలో నలుగురు సిబ్బంది వెంటనే బయటకు రాగా మిగతా 13 మంది మరణించారని చెప్పారు.
ప్రమాద సమయానికి ఆసుపత్రిలో మరో 80 మంది రోగులున్నారని.. వారంతా సురక్షితంగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తెలిపాయి.
ఇది చాలా పెద్ద ప్రమాదమని, దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని మహారాష్ట్ర మంత్రి ఒకరు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
ఈ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది)
ఇవి కూడా చదవండి:
- విశ్వ రహస్యాలు శోధించే ప్రయోగశాలలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)