కోవిడ్: నాసిక్‌లోని ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 22 మంది మృతి... ట్యాంకర్ భారీగా లీక్ అవడమే కారణం

ఫొటో సోర్స్, ANI
మహారాష్ట్రలోని నాసిక్‌లో జాకిర్ హుసేన్ ఆసుపత్రిలో ఓ ట్యాంకర్‌లో ఉన్న ఆక్సిజన్ భారీ ఎత్తున లీకైందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఘటన తర్వాత ఆక్సిజన్ అందక 22 మంది మరణించారని నాసిక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ ప్రమాదంలో 11 మరణించినట్లు తమకు సమాచారం అందిందని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రాజేశ్ శింగానే చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇది దురదృష్టకర ఘటన అని, అయితే ఇంకా దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉందని, అలాగే ఘటనపై విచారణకు కూడా ఆదేశించామని మంత్రి వెల్లడించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాద ఘటనతో ఏం జరిగింది?

ఆక్సిజన్ ట్యాంకులో లీకేజ్ వల్ల... సుమారు అర గంటకు పైగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. ఆక్సిజన్ తీసుకుంటున్న రోగుల్లో తక్కువ ఆక్సిజన్‌తో ఉన్న సరఫరా నిలిచిపోతే బతకడం సాధ్యమేనని, కానీ వెంటిలేటర్ మీద ఉన్న రోగులు మాత్రం ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతే బతకడం కష్టమని వైద్యాధికారులు చెప్తున్నారు.
‘‘మా నాయనమ్మకు ఆక్సిజన్ అందిస్తున్నారు. అది ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమయిందని నేను వైద్యులను అడిగితే, ఆక్సిజన్ అయిపోందని చెప్పారు.’’ అని విక్కీ జాదవ్ అనే యువకుడు మీడియాతో అన్నారు.
ఈ ఘటనలో విక్కీ జాదవ్ నాయనమ్మ మరణించారు.
టెక్నికల్ ఇంజినీర్ల సాయంతో లీకేజీని అరికట్టామని, ప్రస్తుతం ట్యాంకుల్లో 25 శాతం మాత్రమే ఆక్సిజన్ మిగిలి ఉందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నాసిక్ మున్సిపల్ కమిషనర్ కైలాష్ జాదవ్ అన్నారు.
ఆసుపత్రిలో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు?
ఆసుపత్రిలో 131 మంది పేషెంట్లు ఆక్సిజన్ మీద ఉండగా, 15మంది వెంటిలేటర్ మీదున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ నితిన్ రౌతే తెలిపారు.
నాసిక్ లో 139 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా, ప్రస్తుతం 84 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.
ప్రధాని తీవ్ర విచారం
నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకేజ్ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
'' ఈ ఘటన హృదయ విదారకమైంది. ఈ మరణాలు కలచి వేస్తున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను'' అంటూ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
నాసిక్ ఘటన ఆందోళనకరమని, ఆ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను వెంటనే ఇతర ఆసుపత్రులకు తరలించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు మృతుల సంఖ్య 30 నుంచి 35కు పెరిగే అవకాశం ఉందని స్థానిక శివసేన నేత సుధాకర్ బడ్గూజర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- విశ్వ రహస్యాలు శోధించే ప్రయోగశాలలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)