కరోనావైరస్: లక్షకు చేరువలో రోజువారీ కేసులు.. ఇలాగైతే మళ్లీ లాక్‌డౌన్ తప్పదేమో!- Newsreel

ఫొటో సోర్స్, Getty Images
గడిచిన 24 గంటలలో భారత్‌లో 89,129 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 6,58,909 యాక్టివ్ కేసులున్నట్లు పేర్కొంది.
తాజా పెరుగుదలతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,30,54,295కు చేరుకుంది.
గత కొద్ది రోజులుగా కరోనా కేసు సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఈ ఏడాది జనవరి నాటికి 15 వేలుగా ఉన్న రోజువారీ కేసుల సంఖ్య మార్చి 30 నాటికి 53వేలకు, ఏప్రిల్ 2వ తేదీనాటికి 89వేలకు చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్?
ఇక దేశవ్యాప్తంగా దాదాపు సగం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.
శుక్రవారంనాడు అక్కడ 47,828 కేసులు నమోదయ్యాయి.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ విధించక తప్పదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు.
రాష్ట్రంలో వ్యాక్సీన్ తీసుకున్న వారికి కూడా కోవిడ్ వ్యాపిస్తోందని, మాస్క్ ధరించకపోవడమే దీనికి కారణమని సీఎం అన్నారు.
లాక్‌డౌన్ విధింపుపై కార్యాచరణ సిద్ధం చేయాలని గత ఆదివారమే ఉద్ధవ్ ఠాక్రే అధికారులకు సూచించారు.
అయితే చాలాచోట్ల ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రజలు పాటించడం లేదు.
పుణేలో ఇప్పటికే కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రార్ధనాలయాలు, హోటళ్లు, బార్లు షాపింగ్ కాంప్లెక్స్‌లను మూసేశారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























