IND Vs ENG 2nd ODI: భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం

ఇంగ్లండ్‌ను గెలిపించిన జానీ బెయిర్ స్టో(124)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్‌ను గెలిపించిన ఓపెనర్ జానీ బెయిర్ స్టో(124)
ప్రచురణ

పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారత్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

43.3 ఓవర్లలో 337 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఇంకా 39 బంతులు ఉండగానే విజయం అందుకుంది.

దీంతో, మూడు వన్డేల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ 1-1తో సమంగా నిలిచాయి.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో జానీ బెయిర్ స్టో సెంచరీ చేయగా, బెన్ స్టోక్స్ ఒక్క పరుగుతో సెంచరీ మిస్ అయ్యాడు.

బెయిర్ స్టో 112 బంతుల్లో 7 సిక్సర్లు, 11 ఫోర్లతో 124 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.

సిక్సర్ల మోత మోగించిన బెన్ స్టోక్స్ 52 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లతో 99 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఓపెనర్ జాసన్ రాయ్ 52 బంతుల్లో 55 పరుగులు చేసి రోహిత్ విసిరిన బంతికి రనౌట్ అయ్యాడు.

ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో జాస్ బట్లర్ డకౌట్ కాగా, డేవిడ్ మలన్(16), లియామ్ లివింగ్‌స్టన్(27) చివరి వరకూ నిలిచి జట్టుకు విజయం అందించారు.

జేసన్ రాయ్‌తో కలిసి 110 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అందించిన జానీ బెయిర్ స్టో, తొలి వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో కలిసి 175 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

37వ ఓవర్లో 287 పరుగుల దగ్గర జానీ బెయిర్ స్టో, జాస్ బట్లర్ అవుటయ్యే సమయానికే ఇంగ్లండ్ విజయం ఖాయమైపోయింది.

భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు 2, భువనేశ్వర్ కుమార్‌కు 1 వికెట్ దక్కింది.

కే.ఎల్.రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కే.ఎల్.రాహుల్ సెంచరీ

కేఎల్ రాహుల్ సెంచరీ, పంత్ మెరుపులు

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.

కేఎల్ రాహుల్ సెంచరీ, రిషబ్ పంత్ సిక్సర్ల మెరుపులతో భారత్.. ఇంగ్లండ్ జట్టు ముందు 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 10 ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా, మిగతా ఆటగాళ్లు రాణించడంతో 336 పరుగులు భారీ స్కోరు చేయగలిగింది.

టీమిండియా 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.

ఓపెనర్ శిఖర్ ధవన్ 4 పరుగులకే రీస్ టోప్లీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

జట్టు స్కోరు 37 పరుగుల దగ్గర మరో ఓపెనర్ రోహిత్ శర్మ(25) ఔట్ అయ్యాడు.

తర్వాత రోహిత్ స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు.

ఆలోపు కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇద్దరూ కలిసి 121 పరుగుల భాగస్వామ్యం అందించారు.

రాహుల్, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ

158 పరుగుల దగ్గర కోహ్లీ అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

విరాట్ 79 బంతుల్లో 66 పరుగులు చేశాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌తో కలిసి కేఎల్ రాహుల్ 113 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

వన్డేల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ 45వ ఓవర్లో జట్టు స్కోరు 271 పరుగుల దగ్గర ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు.

114 బంతులు ఆడిన రాహుల్ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 108 పరుగులు చేశాడు.

రిషబ్ పంత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిషబ్ పంత్

సిక్సర్లతో విరుచుకుపడిన రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వేగంగా పరుగులు పెంచే క్రమంలో పంత్ టామ్ కరన్ బౌలింగ్‌‌లో జేసన్ రాయ్‌కు కాచ్ ఇచ్చాడు.

కేవలం 40 బంతులే ఆడిన రిషబ్ 7 సిక్సర్లు, 3 ఫోర్లతో 77 పరుగులు చేశాడు.

హార్దిక్ పాండ్య 16 బంతుల్లో 4 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఔట్ కాగా, కృణాల్ పాండ్య 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టోప్లీ, టామ్ కరన్ చెరి రెండు వికెట్లు, శామ్ కరన్, అదిల్ రషీద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)