India Vs England T20: చివరి టీ20లో 36 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లీ సేన, సిరీస్ భారత్ వశం

ఫొటో సోర్స్, Surjeet Yadav/getty
భారత్-ఇంగ్లండ్ ఐదు టీ20ల సిరీస్‌లో చివరిది రెండు జట్లకు కీలకం అయిన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.
225 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ సున్నా పరుగులకే ఔట్ అయినా, మరో ఓపెనర్ జాస్ బట్లర్, డేవిడ్ మలన్ 130 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్ విజయం దిశగానే సాగుతున్నట్టు కనిపించింది.
కానీ, భువనేశ్వర్ కుమార్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకుని పెద్ద భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయారు.
డేవిడ్ మలన్(68), జాస్ బట్లర్(52) జట్టులో టాప్ స్కోరర్లుగా నిలిచారు.
మిగతా ఆటగాళ్లలో బెన్ స్టోక్స్(14), క్రిస్ జోర్డాన్(11), శామ్ కరన్(14 నాటౌట్) రెండంకెల స్కోరు చేశారు.
చివరి 10 బంతుల్లో 60 పరుగులు అవసరమైన సమయంలో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది.
చివరి ఆరు బంతుల్లో ఇంగ్లండ్ విజయం కోసం 57 పరుగులు చేయాల్సి వచ్చింది.
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు చివరి ఓవర్లో 3 సిక్సర్లు కొట్టినా, అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, భువనేశ్వర్ కుమార్ 2, హార్దిక్ పాండ్య, టి.నటరాజన్ చెరో వికెట్ పడగొట్టారు.
చివరి టీ20లో విజయంతో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది.
భువనేశ్వర్ కుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, పెర్ఫామర్ ఆఫ్ ది సిరీస్‌గా కారు గెలుచుకున్నాడు.
అంతకు ముందు...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ జట్టు ముందు 225 పరుగుల లక్ష్యం ఉంచింది.
బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది.
ఓపెనర్ జేసన్ రాయ్ భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్, రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
10వ ఓవర్లో ఇంగ్లండ్ 100 పరుగుల మైలురాయిని చేరుకుంది.
డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీ చేశాడు. 33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.
మరో ఓపెనర్ జాస్ బట్లర్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసున్నాడు. 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.
52 పరుగుల దగ్గర జాస్ బట్లర్ ఔట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యకు కాచ్ ఇచ్చాడు.
ఇంగ్లండ్ 140 పరుగుల దగ్గర మూడో వికెట్ కోల్పోయింది.
పరుగుల వేగం పెంచే క్రమంలో జానీ బెయిర్ స్టో(7) కూడా ఔట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు కాచ్ ఇచ్చాడు.
142 పరుగుల దగ్గర ఇంగ్లండ్ డేవిడ్ మలన్ వికెట్ కోల్పోయింది.
68 పరుగులు చేసిన మలన్ 15 ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు.
మలన్ 46 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లతో 68 పరుగులు చేశాడు.
142 పరుగుల దగ్గరే ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది.
1 పరుగు చేసిన ఇయాన్ మోర్గాన్ హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కే.ఎల్.రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు.
165 పరుగుల దగ్గర బెన్ స్టోక్స్(14) ఆరో వికెట్‌గా ఔట్ అయ్యాడు. టి.నటరాజన్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు.
అదే ఓవర్ చివరి బంతికి జోఫ్రా ఆర్చర్ సూర్యకుమార్ యాదవ్ త్రోకు రనౌట్ అయ్యాడు.
శార్దూల్ ఠాకూర్ వేసిన చివరి ఓవర్‌లో క్రిస్ జోర్డాన్(11) ఔట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ...
కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య నాటౌట్‌గా నిలిచారు.
కోహ్లీ 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేయగా, పాండ్య 17 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 39 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ(64), సూర్య కుమార్ యాదవ్(32) పరుగులు చేసి ఔటయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచిన ఇంగ్లండ్...
ఈ మ్యాచ్‌లో కూడా టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది.
రోహిత్ శర్మతోపాటూ, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వచ్చాడు.
మొదటి నుంచి ధాటిగా ఆడిన రోహిత్ శర్మ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రోహిత్ 50 పరుగుల్లో 4 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి.
34 బంతుల్లో 64 పరుగులు చేసిన రోహిత్ శర్మ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హిట్ మాన్ మొత్తం 4 ఫోర్లు, 5 సిక్సులు కొట్టాడు.
10వ ఓవర్లో భారత్ వంద పరుగుల మైలురాయిని అందుకుంది.
144 పరుగుల దగ్గర భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
ఫస్ట్ డౌన్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు.
17 బంతులు ఆడిన యాదవ్, రెండు సిక్సులు, మూడు ఫోర్లతో 32 పరుగులు చేశాడు.
ఓపెనర్‌గా దిగిన విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
19వ ఓవర్లో భారత్ 200 పరుగుల మైలురాయిని అందుకుంది.

ఫొటో సోర్స్, SURJEET YADAV/GETTY IMAGES
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కోసం నాలుగో టీ20లో వరసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్ స్థానంలో అదనపు బౌలర్‌గా టి.నటరాజన్‌కు చోటు కల్పించాడు.
ఇంగ్లండ్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
ఇప్పటివరకూ జరిగిన నాలుకు టీ20ల్లో రెండేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రెండు జట్లు 2-2తో సమానంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: మొదటి టీ20 మ్యాచ్‌లో ఇండియా ఓటమికి ఐదు కారణాలు ఇవీ...
- India vs England: రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం.. ఇషాన్, కోహ్లీ హాఫ్ సెంచరీలు
- అక్షర్ పటేల్: ఒకప్పటి ఫాస్ట్‌బౌలర్ ఇప్పుడు సంచలన స్పిన్నర్‌గా ఎలా మారాడు
- అహ్మదాబాద్ టెస్ట్: భారత్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గెలుచుకున్న కోహ్లీ సేన
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- చెన్నై సూపర్ కింగ్స్‌లో సీమ కుర్రాడు: ‘ధోనీతో ఒక్క ఫొటో దిగితే చాలనుకున్నా... ఇప్పుడు కలిసి క్రికెట్ ఆడబోతున్నా’’
- కడక్‌నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు: ఎంఎస్ ధోనీ ఎలా వ్యవసాయం చేస్తున్నారో చూశారా?
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- అజింక్య రహానె: భారత్ క్రికెట్‌కు కెప్టెన్‌ను చేయాలంటూ డిమాండ్లు. కోహ్లీపై ఒత్తిడి పెరుగుతోందా ?
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఏంటి గొడవ? ఆ అడ్డుగోడలు కూలేదెలా?
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)























