రైతులను కలవడానికి విపక్ష ఎంపీల ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు - Newsreel

విపక్ష ఎంపీలు

ఫొటో సోర్స్, Twitter/harsimratkaur

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

ఉత్తర్‌ప్రదేశ్‌-దిల్లీ సరిహద్దుల్లో ఘాజీపూర్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతులను కలవడానికి వెళ్లిన 10 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 15మంది ఎంపీలను పోలీసులు అడ్డుకున్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

రైతులతో చర్చించడానికి ప్రయత్నించిన ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగారని ఆ వార్తాసంస్థ చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

“పార్లమెంటులో మాట్లాటానికి స్పీకర్‌ మాకు అనుమతి ఇవ్వడం లేదు. రాజకీయ పార్టీలు ఇక్కడి పరిస్థితులు స్వయంగా చూసి పార్లమెంటులో ప్రభుత్వానికి వివరించాలని భావించారు’’ అని అకాలీదళ్‌ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

భావసారూప్యం ఉన్న పార్టీలకు చెందిన ఎంపీలు కొందరం ఘాజీపూర్‌కు చేరుకున్నామని, కానీ రైతులతో చర్చలు జరిపేందుకు పోలీసులు అనుమతించ లేదని, ఇది ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని హర్ సిమ్రత్ కౌర్‌ అన్నారు.

ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కనీసం అంబులెన్స్‌ లు వెళ్లడానికి కూడా వీలు లేకుండా ఉందని కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు కలవడానికి వెళ్లినవారిలో అకాలీదళ్ ఎంపీ‌ హర్‌ సిమ్రత్‌ కౌర్‌తోపాటు డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీ సౌగతారాయ్‌ తదితరులు ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

రోడ్డు మీద ఇనుప మేకుల తొలగింపు

మరోవైపు ఘాజీపూర్‌ వద్ద రోడ్డుపై ఏర్పాటు చేసిన మేకులను అధికారులు తొలగించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ విడుదల చేసింది.

రోడ్డు మీద ఈ మేకులను ఏర్పాటు చేసే సమయంలో అధికారులు ఎలాంటి కారణం చెప్పలేదు. అయితే తాము దిల్లీ నగరంలోకి ప్రవేశించకుండానే అధికారులు ఈ ఏర్పాటు చేశారని బీబీసీ ప్రతినిధి సమీరాత్మజ్‌ మిశ్రాతో రైతులు అన్నారు. '' ఇలాంటి అడ్డంకులు పాకిస్తాన్‌, చైనా సరిహద్దుల్లో ఉండాలి. ఇక్కడెందుకు'' అని వారు ప్రశ్నించారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)