కోవిడ్-19తో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి - Newsreel

ఫొటో సోర్స్, Facebook/Challa Ramakrishna reddy
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి (72) కోవిడ్-19 సోకడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు.
ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయనకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధరణ అయ్యింది. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం గత నెల 13న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజులపాటు ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో 1948 ఆగస్టు 27న ఆయన జన్మించారు. కాంగ్రెస్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కోయిలకుంట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు.
పౌర సరఫరా కార్పొరేషన్ ఛైర్మన్‌గానూ ఆయన పనిచేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES / PRAKASH SINGH
లద్దాఖ్‌లో పరిస్థితులపై చైనా సైన్యంతో భారత్ చర్చలు
భారత్, చైనా సైనికుల మధ్య తొమ్మిదో దఫా సైనిక కమాండర్ స్థాయి చర్చలు జరిగాయని చైనా సైనిక అధికార ప్రతినిధి తెలిపారు.
ఈ అంశంపై చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో ఓ కథనం ప్రచురించారు. నవంబరులో ఎనిమిదో దఫా చర్చలు పూర్తయిన అనంతరం.. లద్దాఖ్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతిని పునరుద్ధరించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని చైనా సైనిక అధికార ప్రతినిధి తైన్ కెఫీ చెప్పారు.
సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని ఆయన వివరించారు.
భారత్‌తో సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు చైనా సిద్ధంగా ఉందని తైన్ వివరించారు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























