కేంద్ర మంత్రి హర్షవర్ధన్: ప్రజలకు నమ్మకం కలగడం కోసం కోవిడ్ 19 వాక్సిన్ మొదటి డోసు తీసుకోడానికి నేను సిద్ధం - BBC Newsreel

హర్షవర్ధన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కోవిడ్ 19 గురించి ప్రజలతో నేరుగా మాట్లాడడానికి, వారి సందేహాలు నివృత్తి చెయ్యడానికి "సండే సంవాద్" కార్యక్రమం నిర్వహించారు.

గంటకు పైగా సాగిన ఈ డిజిటల్ కార్యక్రమమలో చాలామంది అడిగిన ప్రశ్నలకు హర్ష వర్ధన్ జవాబులిచ్చారు.

ఎక్కువమంది వాక్సిన్‌కు సంబంధించిన ప్రశ్నలే అడిగారు.

ప్రజలు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ...ఇండియాతో సహా అనేక దేశాల్లో కరోనావైరస్‌కు వాక్సిన్ తయారుచేసే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది అన్నిటికన్నా మంచిది, ఏ వాక్సిన్ ప్రభావవంతమైనది అనేది చెప్పడం కష్టం అని అన్నారు.

మనదేశంలో కోవిడ్ 19 వాక్సిన్ విడుదల చెయ్యడానికి కచ్చితమైన తేదీని నిర్ణయించలేదని ఆయన అన్నారు.

అయితే, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో వాక్సిన్ సిద్ధం కావొచ్చని అన్నారు.

వాక్సిన్ వస్తే మీరు ధైర్యంగా వేయించుకుంటారా? అని అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ...

వాక్సిన్ సురక్షితమా కాదా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ ఇది సురక్షితం అని నిరూపించడానికి ఆరోగ్య మంత్రి మొదటి డోసు తీసుకోవాల్సి వస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు.

వాక్సిన్ గనక వస్తే దేశంలో ఎవరికి అది ఎక్కువ అవసరమో వారికి ముందు ఇవ్వాలి అని కూడా అన్నారు.

అమిత్‌ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ ప్రకటన: 'పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మెడికల్ చెకప్'

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అస్వస్థతతో మరోసారి ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు.

శ్వాస తీసుకోవడంలో అమిత్ షా ఇబ్బంది పడుతున్నారని ఆయన కుటుంబ సన్నిహితులు బీబీసీకి తెలిపారు.

అయన శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎయిమ్స్‌లో చేరారు.

కాగా, అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ డాక్టర్ ప్రొఫెసర్ ఆర్తి విజ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ ప్రకటన

‘‘హోం శాఖ మంత్రి అమిత్ షా కోవిడ్-19 అనంతర వైద్యసేవలు పొంది, ఆగస్టు 30వ తేదీన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయ్యేప్పుడు సూచించిన విధంగా.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల పాటు కంప్లీట్ హెల్త్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొ్నారు.

ఆగస్టు 2న అమిత్‌ షా తనకు కోవిడ్‌-19 పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని ట్వీట్‌ చేశారు. అదే రోజు ఆయన మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 14న మేదాంత నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

అయితే తీవ్రమైన ఒళ్లు నొప్పుల కారణంగా అమిత్ షా ఆగస్టు 18న ఎయిమ్స్‌లో చేరారు. ఆగస్టు 31 ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

మళ్లీ నిన్న శ్వాస సంబంధమైన ఇబ్బందులు రావడంతో మరోసారి ఎయిమ్స్‌లో చేరారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అమిత్ షా త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ ట్వీట్‌ చేశారు.

"అమిత్‌ షా అనారోగ్యంతో ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలి '' అని చౌహాన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)