ఐపీఎల్: సౌరవ్ గంగూలీ మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాలలో ఆడిద్దామన్నారు... నెటిజన్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టారు

సౌరవ్ గంగూలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌరవ్ గంగూలీ
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఖాళీ స్టేడియాల్లో నిర్వహించవచ్చనే సంకేతాలు ఇచ్చారు.

కరోనా వ్యాపించడంతో వాయిదా వేసిన ఐపీఎల్‌ టోర్నీని ఇప్పుడు నిర్వహించడానికి అన్ని ప్రత్యామ్నాయాలూ చూస్తున్నామని గంగూలీ చెప్పారు. అందులో ఖాళీ స్టేడియాల్లో అంటే ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించే ప్రత్యామ్నాయం కూడా ఉంది.

బుధవారం అంతర్జాతీయ క్రకెట్ కౌన్సిల్(ఐసీసీ) సమావేశం తర్వాత రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ దీనికి సంబంధించి లేఖలు కూడా రాసిందని పీటీఐ వార్తా సంస్థ చెప్పింది.

ఆ లేఖలో గంగూలీ “అభిమానులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, ప్రసార కర్తలు, స్పాన్సర్స్, మిగతా శ్రేయోభిలాషులందరూ ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించే అవకాశాల గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో ఆడాలని తహతహలాడుతున్నారు. ఐపీఎల్‌ను నిర్వహించడం గురించి బోర్డ్ ఆశావహంగా ఉంది. త్వరలోనే దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పారు.

కరోనా ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఐపీఎల్ నిర్వహణ

ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనున్న టీ-20 ప్రపంచ కప్ ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరగకపోతే, ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించవచ్చని తెలుస్తోంది.

ఐసీసీ కొన్ని రోజుల క్రితం టీ-20 ప్రపంచ కప్ భవిష్యత్ నిర్ణయాన్ని జులై వరకూ వాయిదా వేసింది. ఈ టోర్నీ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకూ జరగాల్సి ఉంది.

ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించడం గురించి సౌరవ్ గంగూలీ చేసిన ప్రకటన ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.

సత్యవ్రత్ దాస్ అనే యూజర్ “దాదా ఉండగా క్రికెట్ లేకపోవడమా.. అలా అస్సలు జరగదు మై ఫ్రెండ్” అని ట్వీట్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆకాశ్ త్యాగీ తన ట్వీట్‌లో “మన ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం లేకపోతే, ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ బాగానే ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం చూసి బోర్ కొట్టింది” అన్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరో యూజర్ ప్రణయ్ పలేయీ “ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే వచ్చే సమస్యేం లేదు. డబ్బుల కంటే ప్రాణాలు ముఖ్యం” అని పెట్టాడు.

ఐపీఎల్ అభిమానుల మీమ్స్

గంగూలీ ప్రకటనపై చాలా మీమ్స్ కూడా షేర్ అవుతున్నాయి.

ఐపీఎల్ 2020 నిర్వహణ కోసం అన్ని ప్రత్యామ్నాయాలూ చూస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)