ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులా ? పది రోజుల్లో తొలగించండి—ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, http://hc.ap.nic.in/
ప్రభుత్వ భవనాలకు ప్రజాధనంతో రాజకీయ పార్టీ రంగులు వేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిందంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ, ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ పతాకాన్ని పోలిన రంగుల్ని తొలగించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
పది రోజుల్లోగా ఆ రంగులు తీసేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
దీనిపై తక్షణం ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని,. ఈ ఆదేశాల అమలుపై హైకోర్టు రిజిస్ట్రార్‌కు రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని తేల్చి చెప్పింది.
తమ ఆదేశాల అమలులో విఫలమైతే పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శితో పాటు సీఎస్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.
అదేవిధంగా రాజకీయ పార్టీలకు చెందిన రంగులతో ఏమాత్రం సారూప్యత లేని రంగులను పంచాయతీ, ప్రభుత్వ భవనాలకు వేసేందుకు అనువుగా సీఎస్ తగిన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.
పంచాయతీ భవనాలకు వైసీపీ పతాకంలోని రంగులను ప్రతిపాదిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ చేసిన సిఫారసును ఆమోదిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోను కూడా రద్దు చేసింది.
గ్రామ పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేస్తున్నారంటూ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు చెందిన ఎం.వెంకటేశ్వరరావు, విజయనగరం జిల్లా లక్కవరపుకోట తలారి గ్రామానికి చెందిన రమణ వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి ఈ వార్తలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
యోగాతో సంతానం !
పిల్లలు పుట్టడం లేదని బాధపడే వారికి శుభవార్త అంటూ సాక్షి పత్రిక ఓ వార్తను ప్రచురించింది. యోగా పురుషులలో వీర్య కణాల వృద్ధికి తోడ్పడుతుందని సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ), దిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో తేలిందన్నది ఈ వార్త సారాంశం.
ఆండ్రలోగియా జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైన కథనం ప్రకారం సంతానోత్పత్తి కణాలు తక్కువగా ఉన్న పురుషులతో 21 రోజుల పాటు క్రమం తప్పకుండా రోజుకు గంట సేపు యోగాలోని ప్రాణాయామం, ధ్యానం తదితర ఆసనాలు వేయించడం వల్ల వారిలో వీర్య కణాల నాణ్యత పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఈ వార్తలో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సంతానం లేని దంపతులు ఆధునిక వైద్య విధానంతో పాటు సంప్రదాయ యోగ పద్ధతుల్ని కూడా అవలంబించడం వల్ల ఫలితం మెరుగవుతుందని సీసీఎంబీ డైరక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారని తెలిపింది.
యోగా అధ్యయనంలో పాల్గొన్న ఇద్దరు ఏడాది తిరగకుండానే తల్లిదండ్రులు అవుతున్నారని ఈవార్తలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
'కరోనావైరస్ లక్షణాలున్నాయి సెలవు ఇవ్వండి'- హెడ్ మాస్టర్‌కు విద్యార్థి లేఖ
కరోనావైరస్ పేరిట స్కూలు ప్రధానోపాధ్యాయుడికి ఓ విద్యార్థి రాసిన సెలవు చీటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందంటూ ఈనాడు ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
చెన్నైకి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతువుతున్న ఓ విద్యార్థి తనకు జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉండటంతో మిగిలిన విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సెలవు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని లీవ్ లెటర్‌లో పేర్కొన్నట్లు తెలిపింది.
అంతేకాదు, ఇప్పటికే అలాంటి లక్షణాలున్న విద్యార్థులను బడికి రావద్దన్న పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు కూడా పంపిందన్న విషయాన్ని తన సెలవు చీటిలో ప్రస్తావించాడని తెలిపింది.
తాను సెలవు పెట్టిన రోజుల్లో తాను స్కూలుకి హాజరైనట్టు పరిగణించాలని అభ్యర్థించాడని కూడా ఈనాడు ఈ కథనంలో చెప్పుకొచ్చింది.

ఫొటో సోర్స్, twitter.com/TelanganaHealth
తెలంగాణ ఇప్పుడు కరోనా రహిత రాష్ట్రం - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
రాష్ట్రంలో ఇప్పుడు కరోనావైరస్ లేదని, దుబాయి నుంచి వచ్చి కరోనావైరస్‌తో బాధపడిన ఆ ఒక్క వ్యక్తి కూడా నయమైపోయిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపినట్టు నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ ప్రబలుతుండటంతో వివిధ దేశాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజలంతా తిరిగి సొంతరాష్ట్రానికి వస్తున్నారని వారికోసం విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించేందుకు సిబ్బందిని నాలుగు రెట్లు పెంచామని మంత్రి తెలిపారు.
కేంద్రం ఆదేశాల మేరకు ఉస్మానియాలో మరో కరోనావైరస్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
చైనా, హాకాంగ్, జపాన్, సౌత్ కొరియా, ఇటలీ, థాయ్‌లాండ్, సింగపూర్,మలేషియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల నుంచి వస్తున్న ప్రవాస భారతీయులంతా ఎవరికి వారు 14 రోజుల పాటు తమ ఇంట్లోనే ఐసోలేషన్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనను జారీ చేసింది .
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: వుహాన్‌లో షీ జిన్‌పింగ్, కోవిడ్-19 అదుపులోకి వచ్చిందంటున్న చైనా
- కరోనావైరస్: "క్రికెట్ మైదానంలో మేం 'షేక్ హ్యాండ్' ఇవ్వం" - ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- జ్యోతిరాదిత్య సింధియా: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా... మధ్య ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం
- యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ప్రియాంక గాంధీ నుంచి పెయింటింగ్ కొన్నారా?
- కరోనావైరస్: చైనాలో రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకుపోయిన క్యాన్సర్ పేషెంట్... ఆ తర్వాత ఏమైంది?
- కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన ఇన్ఫెక్షన్... దేశమంతటా అత్యవసర పరిస్థితి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























