INDVsBAN: బంగ్లాపై తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగులతో భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసింది. ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చవిచూసింది.
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా జట్టు 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులో ముష్ఫికర్ రహీం (64) ఒక్కడే కాస్త గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్
మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ(243)తో చెలరేగిన వేళ భారత తన తొలి ఇన్నింగ్స్‌లో 493/6 పరుగులు సాధించింది. బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా బ్యాటింగ్ నత్తనడకన సాగింది. భారత పేసర్ల ధాటికి ఓపెనర్లు రెండంకెల స్కోరు కూడా చేయకుండా వెనుదిరిగారు.
మమ్మద్ షమీ నాలుగు వికెట్లతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.
రవిచంద్రన్ అశ్విన్(3), ఉమేశ్ యాదవ్ (2), ఇషాంత్ శర్మ(1), తమ వంతు సహకారం అందిస్తున్నారు.
స్కోర్ వివరాలు: కింది లింక్‌లో చూడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఈడెన్ గార్డెన్‌లో రెండో టెస్ట్, తొలిసారి డే అండ్ నైట్..
ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్, బంగ్లాల మధ్య నవంబర్ 22 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. భారత్‌కు ఇదే తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్. ఈ మ్యాచ్‌లో పింక్ బాల్‌ను వినియోగించనున్నారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య-రామ మందిర ఉద్యమంలో ముఖ్య పాత్రధారులు వీరే..
- సచిన్ రికార్డును బ్రేక్ చేసిన అమ్మాయి మళ్లీ అదరగొట్టింది
- విజయవాడలో స్విగ్గీ సర్వీస్ ఎందుకు ఆగిపోయింది...
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























