You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కొలంబియా భూకంప తీవ్రత 9 ఫోటోల్లో
"కొలంబియాలో గత పదేళ్లలోనే ఇది చాలా శక్తిమంతమైన భూకంపం".. కొలంబియన్ జియోలాజికల్ సర్వీస్ జనరల్ డైరెక్టర్ జులియో ఫెరీరో మొరాలెస్ వ్యాఖ్యలివి.
రిక్టర్ స్కేలు మీద 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం పశ్చిమ కొలంబియాలో అనేక చోట్ల విధ్వంసాన్ని, విషాదాన్ని మిగిల్చింది.
భూకంపం కారణంగా వంద మందికిపైగా మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు.
50కి పైగా భవనాలు శిథిలాలుగా మారాయి.
పూర్తి స్థాయి నష్టాన్ని లెక్కించే పని ఇంకా కొనసాగుతోంది.
శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని అధికారులు చెబుతున్నారు.
వారిని కాపాడేందుకు రాత్రి పూట కూడా సహాయ చర్యల్ని కొనసాగిస్తున్నారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సాయం అందించేందుకు అమెరికా, ఈక్వెడార్, బ్రెజిల్, ఎల్ సాల్వడార్, వెనెజ్వెలా తమ బృందాలను పంపించాయి.
కొలంబియన్ మీడియాలో ప్రసారమైన వీడియోలలో.. భూకంప కేంద్రానికి 100 కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్న పెరీరాలో, మనిజాలెస్‌లో, చోకో డిపార్ట్‌మెంట్‌లోని కాలి ఇతర ప్రాంతాలలో పాక్షికంగా ధ్వంసమైన నివాస భవనాలు కనిపిస్తున్నాయి.
వల్లే డెల్ కాకా ప్రాంతానికి రాజధాని ఆర్థిక, జనాభా పరంగా కొలంబియాలో మూడో పెద్ద నగరమైన కాలి భూకంపం వల్ల ఎక్కువగా నష్టపోయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)