విజయనగరం రైలు ప్రమాదం 10 ఫోటోల్లో...

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గాయపడిన వారికి విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితోపాటు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ప్రచురణ

విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ మధ్య ఆగివున్న పలాస ప్యాసింజర్‌ను అదే ట్రాక్‌పై వచ్చిన రాయగడ ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాత్రి ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో 13 మంది మరణించారని విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం ఉదయం తెలిపారు.

ప్రమాద దృశ్యాలు...

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రమాద స్థలం ఏరియల్ వ్యూ
రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, వెనక నుంచి మరో రైలు ఢీకొనడంతో ముందున్న రైలు బోగీలు కొన్ని ట్రాక్ మీద నుంచి పక్కకు పడిపోయాయి.
రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, విశాఖపట్నం పలాస పాసింజర్‌ బోగీలు మూడు ఈ ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక బోగీ మరో బోగీపైకి ఎక్కింది.
రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కంటకాపల్లి-అలమండ గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఈ రెండు గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, రైల్వే సిబ్బంది రాక ముందు వారే సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బోగీలు తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ఉన్న ప్రయాణికులను బయటకు తీయడం సవాలుగా మారింది. బోగీలను కోసేసి బాధితులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు సహాయ సిబ్బంది.
రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాద బాధితురాలు
రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బాలాసోర్ తరహాలోనే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఈ ప్రమాదంతో హౌరా మార్గంలోని కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు, మరికొన్ని దారి మళ్లించినట్లు, మరికొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)