You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు ఇవి చదవకపోతే వెంటనే చదవండి.
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? దీనికి వైద్యులు చెబుతున్న కారణాలేంటి?
ఆగ్నెస్ రైలులో వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చారు. తనకు ఏ మాత్రం సంబంధంలేని అంశాలపై ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు.
అయితే, కొద్దిసేపటికే తను అనుకున్న వ్యక్తి ఆమె కాదని మాట్లాడుతున్న వ్యక్తికి అర్థమైంది. వెంటనే ‘‘అచ్చం మీలాగే ఉండే ఓ వ్యక్తి నాకు బాగా తెలుసు’’అని ఆయన అన్నారు.
వెంటనే తనలా ఉండే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆగ్నెస్‌లో కుతూహలం పెరిగింది. వెంటనే ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌ను అడిగి తీసుకున్నారు.
ఆమె పేరు ఎస్తేర్. చాట్‌ల తర్వాత, వీరు వ్యక్తిగతంగా కలిశారు కూడా. మరి ఇది ఎలా సాధ్యం?
ఇవి కూడా చదవండి
భూమి మీది నీరంతా అంతరిక్షం నుంచి వచ్చిందేనా? ఇంగ్లండ్‌లో రాలిన ఉల్క దానికి సాక్ష్యమా?
బ్రిటన్‌లోని గ్లూసెస్టర్‌షైర్ నగరంలో గత ఏడాది పడిన ఉల్కలో నీరు ఉందని.. ఆ నీరు భూమి మీద ఉన్న నీటికి దాదాపుగా నిఖార్సుగా సరిపోలిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
వందల కోట్ల సంవత్సరాల కిందట భూమి రూపొందుతున్న తొలినాళ్లలో అంతరిక్షం నుంచి వచ్చిపడిన ఉల్కల ద్వారా నీరు, ఇతర కీలక రసాయన పదార్థాలు భూమికి వచ్చాయనే ఆలోచనలను ఇది బలపరుస్తోంది.
ఇవి కూడా చదవండి
తిరుమలలో ఆర్గానిక్ లడ్డూ, అన్నప్రసాదాలు.. సేంద్రియ ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి
తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు రసాయనాలు వాడకుండా పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతో తయారైన లడ్డూ, అన్న ప్రసాదాలను అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
తమతోపాటూ రాష్ట్రంలోని మరికొన్ని ప్రధాన ఆలయాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించేలా తిరుమల తిరుపతి దేవస్థానాలు చొరవ తీసుకుంటున్నాయి.
సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు రైతులతో ఒప్పందాలు చేసుకుని, వారితో సమావేశాలు నిర్వహించి అవగాహన కూడా కల్పిస్తోంది.
మరి దీని వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉంది?
ఇవి కూడా చదవండి
పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్: ఫేక్ ఉద్యోగ సైట్లను ఎలా గుర్తించాలి, మోసపోకుండా ఏం చేయాలి
రాకేశ్ ఒక యూనివర్సిటీ విద్యార్థి. వీలైనంతవరకూ తన ఖర్చుల కోసం ఇంటివాళ్లపై ఆధారపడకుండా ఏవో చిన్నాచితకా పనులు చేసుకుంటూ ఉండడం అలవాటు.
ఒక రోజు వాట్సాప్‍లో ఒక మెసేజ్ వచ్చింది. “పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఇస్తున్నాం. ఈ లింక్‌పైన క్లిక్ చేయండి”అని మెసేజ్‌లో రాసివుంది.
అలా తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు నమ్మకూడదని విని ఉన్నాడు, అందుకని ముందు కాస్త తటపటాయిస్తూనే వాళ్ళతో మాట్లాడాడు. కంపెనీ వివరాలు అడిగాడు.
నిమిషాల వ్యవధిలో బ్రాండెడ్ కంపెనీ పేరుతో సహా, రెజిస్ట్రేషన్ నంబరు, అడ్రస్ అన్నీ ఇచ్చారు.
కాస్త నమ్మకం కుదిరి, వెబ్‍సైటులో లాగిన్ అయితే, “టాస్క్” రూపంలో ఏవో కొన్ని పనులు చేయించి, అవి పూర్తవ్వగానే వెబ్‍సైటులో అతని ఖాతాలో డబ్బులు వేశారు.
ఆ తరువాత ఏం జరిగింది?
ఇవి కూడా చదవండి
అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను ఎలా గుర్తించాలి, ఎల్ఆర్ఎస్‌తో ఉపయోగం ఉంటుందా?
సాధారణంగా నగర ప్రాంతాల్లో ఇళ్లు కొనేవారు, అమ్మేవారికి ఎల్ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ల గురించి అవగాహన ఉండే ఉంటుంది.
సగటు మధ్యతరగతి వారికి మాత్రం ఈ పదాలు కాస్త కొత్తగా అనిపించొచ్చు.ఈ బీఆర్‌ఎస్, ఎల్ఆర్ఎస్‌ల పేర్లు చెప్పి రూ. లక్షలు కట్టమంటున్నారని కొందరు మధ్యతరగతి ప్రజలు అప్పుడప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
తాజాగా సుప్రీం కోర్టు వరకు ఈ బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్ఎస్‌ల వివాదం ఎందుకు వెళ్లింది?
అసలు బీఆర్ఎస్, ఎల్‌ఆర్ఎస్ అంటే ఏమిటి?మనం మన ఇళ్లు కొనుక్కున్న తర్వాత, మళ్లీ ప్రభుత్వానికి ఎందుకు లక్షల రూపాయలు కట్టాలి?
ఆ డబ్బు కట్టిన తర్వాత మున్సిపల్ అధికారులు మన ఇంటి మీదకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లాంటి అశాలపై సీనియర్ అడ్వొకేట్ లక్ష్మీ నారాయణ బీబీసీ తెలుగు ప్రతినిధి బళ్ల సతీశ్‌తో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
- విశాఖపట్నం: బీచ్‌లో ఇసుక నల్లగా మారడానికి కారణం ఏంటి, భయపడాల్సిన అవసరం ఉందా ?
- సంధ్యా దేవనాథన్: విశాఖపట్నంలో చదివిన మెటా ఇండియా హెడ్ ‘చదువులో చురుకు, వాట్సాప్‍లో సైలెంట్ ’
- రోహిత్ శర్మ: 35 ఏళ్ల ఈ ‘డాడీస్ ఆర్మీ’ కెప్టెన్‌ను తీసేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు
- బ్యూటీ పార్లర్‌లోనే భార్యని హత్య చేసిన భర్త.. పూలదండలు వేసి నివాళి, పోలీసులకు లొంగుబాటు
- ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు ఎందుకు అన్నారు? ఏడాది కిందట అసెంబ్లీలో ఏమైంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)