అనకాపల్లి: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి

వీడియో క్యాప్షన్,
అనకాపల్లి: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి
ప్రచురణ

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జూన్ 23 ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు.

ఫార్మాసిటీలోని తారు తయారీ పరిశ్రమ దక్షిణ ఎనర్జీ కెమికల్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లోపల చిక్కుకుపోయిన కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)