You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పవన్ కల్యాణ్: ‘వారాహి ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది’ అంటూ పవన్ ట్వీట్
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం ఫొటోలు, వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. పవన్ ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
‘22 ఏళ్లలో తొలిసారి హీరోతో సమానంగా పారితోషికం తీసుకున్నా’’
బంగాళాఖాతంలో వాయుగుండం.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాకు భారీ వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని, గురువారం ఉదయానికి అది తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.
ప్రస్తుతానికి చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని.. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ గురువారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలను సమీపిస్తుందని ఆయన చెప్పారు.
దీని ప్రభావం వల్ల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లోఅక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
చైనా: జీరో కోవిడ్ పాలసీకి సడలింపులు.. ఇక ‘కోవిడ్‌తో సహజీవనం’
‘వారాహి... ఎన్నికల పోరుకు సిద్ధమైంది’ అంటూ పవన్ ట్వీట్, తన ప్రచార వాహనం ఫొటోలు, వీడియోలు ట్విటర్‌లో షేర్ చేసిన జనసేన అధ్యక్షుడు
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం ఫొటోలు, వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.
‘వారాహి సిద్ధమైంది’ అంటూ ఆయన ఈ ఫొటోలు విడుదల చేశారు.
పవన్ ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వాహనాన్ని, ట్రయల్ రన్‌ను పవన్ కల్యాణ్ బుధవారం హైదరాబాద్‌లో పరిశీలించారు.
వాహనం విషయంలో ఆయన తమ పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు కొన్ని సూచనలు చేశారని, వాహనాన్ని రూపొందిస్తున్న సాంకేతిక నిపుణులతో చర్చించారని జనసేన వర్గాలు చెప్పాయి.
దుర్గాదేవి సప్త మాతృకలలో ఒకరైన వారాహి పేరును పవన్ తన వాహనానికి పెట్టారని జనసేన నేతలు చెబుతున్నారు.
భారత్ X బంగ్లాదేశ్: టీం ఇండియా టార్గెట్ 272
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది.
మెహిదీ హాసన్ 83 బంతుల్లో 100 పరుగులు చేయగా మహ్మదుల్లా 96 బంతుల్లో 77 పరుగులు చేశాడు.
తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో భారత బౌలర్లు ఆధిపత్యం చలాయించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.
దీంతో 69 పరుగులకే బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తరువాత మహ్మదుల్లా, మెహిదీ హాసన్ మరొక వికెట్ పడకుండా చూశారు.
చివరకు 217 పరుగుల వద్ద మహ్మదుల్లా అవుట్ అయ్యాడు. అయినా మెహిదీ హాసన్ దూకుడుగా ఆడటం, నసుమ్ అహ్మద్ 11 బంతుల్లో 18 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ 271 పరుగులు చేయగలిగింది.
చివరి ఓవర్లలో బంగ్లాదేశ్ భారీగా పరుగులు రాబట్టింది. దాదాపు 28 ఓవర్ల పాటు భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేక పోయారు. ఈ ఓవర్లలో బంగ్లాదేశ్ 148 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ చేరో రెండు వికెట్లు తీశారు.
జర్మనీ: ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యువరాజు కుట్ర?
జర్మనీలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర చేశారనే ఆరోపణలతో దేశవ్యాప్తంగా 25 మందిని అరెస్ట్ చేశారు.
ఫార్ రైట్‌తో పాటు గతంలో సైన్యంలో పని చేసిన వారిలో కొందరు పార్లమెంటు భవనం మీద దాడి చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
జర్మనీ యువరాజు ప్రిన్స్ హెయిన్‌రిచ్-13 ఈ కుట్ర వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ కుట్రదారులు తీవ్రవాద సంస్థ రిషీబూవ్‌కు చెందిన సభ్యులుగా అనుమానిస్తున్నారు.
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లలో విజయం
దిల్లీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలిచింది. బీజేపీ 104 సీట్లలో గెలవగా కాంగ్రెస్ 9 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 3 సీట్లలో విజయం సాధించారు.
మధ్యప్రదేశ్: 400 అడుగుల బోరుబావిలో పడిన బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు
మోస్ట్ పాపులర్ నటులుగా సమంత, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్
భారతదేశంలో 2022 ఏడాదికి సంబంధించి అత్యంత పాపులారిటీ ఉన్న 10 మంది నటుల జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది.
రామ్ చరణ్, సమంత, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌కు ఈ జాబితాలో స్థానం లభించింది.
ఐఎండీబీ-2022 మోస్ట్ పాపులర్ నటులు:
1.ధనుష్
2.ఆలియా భట్
3.ఐశ్వర్యరాయ్ బచ్చన్
4.రామ్ చరణ్
5.సమంత
6.హృతిక్ రోషన్
7.కైరా అడ్వాణీ
8.జూనియర్ ఎన్టీఆర్
9.అల్లు అర్జున్
10.యశ్
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ మార్క్ దాటిన ఆప్
దిల్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 126 సీట్లను గెలవడం ద్వారా మెజారిటీ మార్కును చేరుకుంది.
ఇప్పటి వరకు బీజేపీ 97 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలవగా స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.
వైఎస్ జగన్: ‘గడప గడపకు వెళ్లి ఓటు వేయమని చెప్పండి’
విజయవాడలో వైసీపీ నిర్వహించిన ‘జయహో బీసీ’ సభ ముగిసింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, పంచాయతీల నుంచి బీసీ నేతలు ఈ సభకు హాజరయ్యారు.
వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలంటూ వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
‘గడప గడపకు వెళ్లి... మీకు మంచి జరిగి ఉంటే జగన్‌కు తోడుగా ఉండమని చెప్పండి’ అంటూ జగన్ కోరారు.
బ్రేకింగ్ న్యూస్, ‘పెద్దనోట్ల రద్దు’ మీద తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు
పెద్దనోట్ల రద్దు మీద దాఖలైన పిటీషన్లను విచారించిన సుప్రీం కోర్టు, తీర్పును రిజర్వుడులో ఉంచినట్లు తెలిపింది.
2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నల్లధనం, నకిలీ నోట్లు వంటి సమస్యలు తీరతాయని నాడు ప్రధాని మోదీ ప్రకటించారు.
అయితే నాటి ఈ నిర్ణయం మీద దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించింది.
దిల్లీ మున్సిపాల్టీ ఎన్నికల్లో తొలి ట్రాన్స్‌జెండర్ వ్యక్తి గెలుపు
దిల్లీ మున్సిపాల్టీ ఎన్నికల్లో తొలిసారి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి గెలిచారు.
సుల్తాన్‌పురీ-ఎ వార్డు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బాబీ అనే ట్రాన్స్‌జెండర్ గెలిచారు.
ప్రియాంక చోప్రా జోనస్: ‘‘తొలిసారి మగ నటులతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నా, బాలీవుడ్‌లో 10 శాతమే దక్కేది’’
బ్రేకింగ్ న్యూస్, రోహిత్ శర్మ బొటన వేలుకు దెబ్బ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలుకు దెబ్బ తగిలింది.
వేలిని పరిశీలించిన బీసీసీఐ మెడికల్ టీం, రోహిత్ శర్మను స్కానింగ్ కోసం పంపింది.
ఎమ్మెల్యే రాజా సింగ్‌కు షో కాజ్ నోటీస్
గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌కు తెలంగాణలోని మంగళ్‌హట్ పోలీసులు షో కాజ్ నోటీసులు జారీ చేశారు.
ఫేస్‌బుక్‌లో అభ్యంతకరమైన సందేశాలు పోస్ట్ చేసినందుకు కాను ఆయనకు ఈ నోటీసులు ఇచ్చారు.
‘ఒక వర్గమే లక్ష్యంగా అభ్యంతకర సందేశాలను మీరు పోస్ట్ చేశారు. తద్వారా హై కోర్టు మీకు విధించిన నిబంధనను ఉల్లంఘించారు. ఇకపై మీరు ఎలాంటి కించపరిచే లేదా అభ్యంతకర సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు’ అని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.
గతంలో మహ్మద్ ప్రవక్త మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్, ఇటీవలే బెయిల్ మీద విడుదల అయ్యారు. నాడు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బీజేపీ తెలిపింది.
ధారావి: ఈ మురికివాడను అదానీ ఎలా మార్చేయబోతున్నారు?
బ్రేకింగ్ న్యూస్, దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ముందంజ
దిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ముందంజలో ఉంది.
ఆప్ 132 సీట్లలో లీడ్‌లో ఉండగా బీజేపీ 104 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 10 సీట్లలో మాత్రమే లీడ్‌లో ఉంది.
250 సీట్లు ఉన్న దిల్లీ మున్సిపాల్టీలో మెజారిటీ రావాలంటే 126 సీట్లు గెలవాల్సి ఉంటుంది.