You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పవన్ కల్యాణ్: ‘వారాహి ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది’ అంటూ పవన్ ట్వీట్
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం ఫొటోలు, వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. పవన్ ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లైవ్ కవరేజీ
షారూఖ్ ఖాన్: ‘సోషల్ మీడియా వ్యతిరేక పోకడలు విభజన పూరితం, విధ్వంసకరం’
మాండోస్ తుపాను: “ఒక్కసారిగా వచ్చిన నీళ్లు మా పొలాలపై పడ్డాయి.. ఇసుక మేటలు వేశాయి”
ఆంధ్రప్రదేశ్: వ్యవసాయంలో డ్రోన్ పైలట్లకు ఉచిత శిక్షణ
మహువా మొయిత్ర: ‘‘ఇప్పుడు చెప్పండి.. ‘పప్పూ’ ఎవరు?’’
అరుణాచల్ ప్రదేశ్: కివీ పండ్ల నుంచి వైన్ తయారీ
బిహార్: చాప్రాలో కల్తీ మద్యం తాగి 17 మంది మృతి
బిహార్‌లోని చాప్రాలో కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ బీబీసీ హిందీకి తెలిపారు. ఈ మరణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.
సారణ్‌లోని ప్రభుత్వాస్పత్రికి 17 మంది మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారని సివిల్ సర్జన్ సాగర్ దులాల్ సిన్హా వెల్లడించారు.
కల్తీ మద్యం తాగిన వారిలో ఇంకా 8 మంది చాప్రాలోని సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు, వార్తా సంస్థల కథనం ప్రకారం.. సరణ్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో ఇసాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక కొంత మంది కల్తీ మద్యం తాగారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించింది. వారిని చాప్రాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు.
వీరిలో 17 మందిచనిపోవటంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. కల్తీ మద్యం తాగటమే ఈ మరణాలకు కారణమని బిహార్‌లోని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. ప్రభుత్వం మీద తవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ విషయం బిహార్ నుంచి దిల్లీ వరక పతాక శీర్షికలకు ఎక్కింది.
ఇండియాలో టీనేజ్ సెక్స్ ఎందుకు నేరం? ‘సమ్మతి తెలిపే వయసు’ను తగ్గించాలని కొందరు జడ్జిలు ఎందుకు అంటున్నారు
ఐరాస భద్రతామండలిలో నెహ్రూ వల్లే భారత్‌కు శాశ్వత సభ్యత్వం రాలేదా? ఆ విమర్శల్లో నిజమెంత?
షాలిని చౌహాన్: మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ బయటపెట్టడానికి స్టూడెంట్ వేషంలో 3 నెలలు రహస్య ఆపరేషన్ చేపట్టిన లేడీ కానిస్టేబుల్
బీసీలకు 50% రిజర్వేషన్ ప్రతిపాదన లేదు: రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడి
విద్యా, ఉపాధి రంగాలలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమక్ బుధవారం రాజ్యసభలో చెప్పారు.
ఓబీసీలకు జనాభా ప్రాతిపదికపై విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని సుదీర్ఘకాలంగా వస్తున్న న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా, పరిగణలోకి తీసుకున్న పక్షంలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.
ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
జనాభా ప్రాతిపదికపై ఓబీసీలకు రిజర్వేష్ కల్పించాలంటూ దేశం వ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఏపీలో మూడు రూర్బన్ మిషన్ క్లస్టర్ల అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లను శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ మిషన్ కింద 21 విభాగాలలో చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌ల గురించి వివరించారు.
బీఆర్ఎస్: దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
దేశ రాజధాని దిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఉదయం ప్రారంభించారు.
కేసీఆర్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఈ పేరు మార్పుకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో దిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ జెండాను కూడా కేసీఆర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంతరి కుమారస్వామిలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించటానికి ముందు సీఎం కేసీఆర్ దంపతులు రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహించారు. వారి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను 'దక్షిణ టిబెట్' అని ఎందుకు అంటోంది
దిల్లీలో స్కూలు విద్యార్థినిపై యాసిడ్ దాడి.. ఒకరు అరెస్ట్
దేశ రాజధాని నగరం దిల్లీలో ఒక స్కూలు విద్యార్థిని మీద యాసిడ్ దాడి జరిగింది.
ద్వారకా జిల్లాలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని, ఒక బాలిక మీద ఒక బాలుడు యాసిడ్ విసిరాడని పోలీసులు చెప్పారు.
బాలికను సప్ధర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చామని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ఆ ఘటన జరిగినపుడు బాధిత బాలికతో పాటు ఆమె చెల్లెలు కూడా ఉందన్నారు. ఈ దాడికి సంబంధించి తనకు తెలిసిన ఇద్దరి మీద ఆ బాలిక అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు.
పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో యాసిడ్‌ను నిషేధించటం కోసం దిల్లీ మహిళా కమిషన్ కొన్నేళ్లుగా పోరాడుతోందని, ప్రభుత్వం ఎప్పుడు మేలుకొంటుందని ఆ కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలేవాల్ ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు.
యాసిడ్ దాడి బాధితురాలికి న్యాయం లభించేలా చేస్తామన్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ దాడి ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది. ఆస్పత్రికి ప్రత్యేక బృందాన్ని పంపిస్తోంది.
బాధితురాలి తండ్రి ఏఎన్ఐ వార్తా సంస్థతతో మాట్లాడుతూ.. తన కూతుర్లు ఇద్దరూ ఉదయం స్కూలుకు వెళ్లటానికి బయల్దేరారని చెప్పారు. ‘‘కొద్ది సేపటికి చిన్న కూతురు పరుగున ఇంటికి తిరిగి వచ్చింది. ఇద్దరు బాలురు వచ్చి అక్క మీద యాసిడ్ పోసి వెళ్లిపోయారని చెప్పింది. ఆ బాలురు ముఖాలకు ముసుగులు కప్పుకుని ఉన్నారు’’ అని ఆయన తెలిపారు.
తన కూతురు పరిస్థితి చాలా విషమంగా ఉందని, ఆమె రెండు కళ్లలోకీ యాసిడ్ వెళ్లిందని ఆయన చెప్పారు.
భారతదేశంలో యాసిడ్ దాడుల కేసులు చాలా ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతి ఏటా దాదాపు 1,000 కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కానీ వాస్తవ సంఖ్య దీనికన్నా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు.
ప్రతినెలా 6 వేల కోట్లు నష్టం వస్తున్నా బిహార్ రాష్ట్రం 6 సంవత్సరాలుగా మద్య నిషేధాన్ని ఎందుకు అమలు చేస్తోంది?
ధూమపాన నిషేధం: 2008 తర్వాత జన్మించిన వారికి నో సిగరెట్.. బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం
కుర్దిస్తాన్: గృహహింసను భరించలేక ఆత్మాహుతికి పాల్పడుతున్న మహిళలు - బీబీసీ పరిశోధన
భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు.
రాజన్, రాహుల్ గాంధీ కలసి నడుస్తున్న ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది.
భారత్-చైనా సరిహద్దు వివాదం: అక్సాయ్ చిన్ నుంచి అరుణాచల్ వరకు.. వివాదం ఎక్కడెక్కడ?
బిహార్: చాప్రాలో కల్తీ మద్యం తాగి 17 మంది మృతి