‘పెరియార్’ పేరు పెట్టినందుకు రెస్టారెంట్ మీద హిందుత్వవాదుల దాడి

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ‘పెరియార్’ పేరుతో పెట్టిన రెస్టారెంట్ మీద ‘హిందూ మున్నానీ’కి చెందిన కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

లైవ్ కవరేజీ

  1. SCO సదస్సు: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తో సమావేశం కానున్న ప్రధానమంత్రి మోదీ

    మోదీ, షీ జిన్‌పింగ్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్, నరేంద్రమోదీ తో షీ జిన్‌పింగ్

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ వేదికగా జరిగే ఒక భద్రతా సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా ఉజ్బెకిస్తాన్ దేశాల నేతలతో సమావేశమవుతారు.

    షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సభ్యదేశాలు ఉజ్బెకిస్తాన్ వేదికగా జరుగుతున్న సమావేశంలో పాల్గొంటున్నాయి.

    చైనా సైన్యాన్ని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సూచించాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణియన్ స్వామి ట్వీట్ చేశారు.

    యుక్రెయిన్ యుద్ధంతో పాటు చైనా, పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి ఈ సదస్సులో ప్రముఖంగా చర్చించే అవకాశం ఉంది.

    ఈ సదస్సులో చైనా, రష్యాలతో మోదీ చర్చలు జరుపనున్నారనే అంచనాలు మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీపై అందరి దృష్టి నిలిచింది.

    గురువారం రాత్రి ఉజ్బెకిస్తాన్‌లో సదస్సు జరుగుతున్న సమర్‌కండ్‌ నగరానికి ప్రధానమంత్రి మోదీ చేరుకున్నారు.

    ప్రధానికి ఉజ్బెకిస్తాన్‌లోని భారత దౌత్యాధికారులు, ఇతర సిబ్బంది స్వాగతం పలికారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. SCO సదస్సు: భారత్-రష్యా సంబంధాల బలోపేతంపై పుతిన్‌తో చర్చించిన ప్రధాని మోదీ

  3. యుక్రెయిన్ మెడిసిన్ విద్యార్థులను భారత్ ఎందుకు ఇక్కడి కాలేజీల్లో చేర్చుకోవడం లేదు?

  4. ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి

  5. ఆస్పత్రికి వెళ్ళిన రోగులు 17 రకాల హక్కులను వినియోగించుకోవచ్చు, అవి ఏంటో మీకు తెలుసా

  6. మంత్రి మేరుగు నాగార్జున దళితులను అవమానించారా, ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది

  7. లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు, అసలేం జరిగింది?

  8. మ్యూచువల్ ఫండ్స్‌: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?

  9. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

    ఫొటో సోర్స్, Facebook/KCR

    తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేడ్కర్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

    భారత సామాజిక దార్శనికుడు, మహామేధావి అంబేడ్కర్ పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కేసీఆర్ అన్నారు.

    అలాగే భారతదేశ కొత్త పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ ప్రధాని త్వరలోనే లేఖ రాస్తామని ఆయన తెలిపారు.

  10. బ్రిటన్ కొత్త హోం మంత్రి, భారత సంతతికి చెందిన సువెల్లా బ్రేవర్‌మన్ ఎవరు?

  11. మహారాష్ట్రలోని ఓ బడిలో పిల్లలకు రొట్టెలు చేయడం నేర్పిస్తున్న టీచర్లు

  12. హైదరాబాద్: ‘మైనర్ బాలిక కిడ్నాప్, రేప్’, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    తెలంగాణ పోలీసు

    ఫొటో సోర్స్, UGC

    హైదరాబాద్ డబీర్‌ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ కేసు నమోదు అయింది. డబీర్ పురాకు చెందిన మైనర్ అమ్మాయిని ఇద్దరు యువకులు కలిసి, నాంపల్లిలోని ఒక లాడ్జీకి తీసుకెళ్లి రెండు రోజులు అత్యాచారం చేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులకు ఫిర్యాదు అందింది.

    ముందుగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. తరువాత అమ్మాయి ఆచూకీ కనిపెట్టారు. అప్పుడు అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం రేప్ కేసు కూడా పెట్టారు.

    వెంటనే ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యి, అమ్మాయిని విచారించిన తరువాత ఘటన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

    నిందితులు రెయిన్ బజార్ ప్రాంతానికి చెందిన వారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం లాడ్జీకి ఎవరూ బలవంతంగా తీసుకెళ్లలేదని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో కిడ్నాప్ కేసు, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

    విచారణ పూర్తయిన తరువా పూర్తి వివరాలు తెలియజేస్తామని డబీర్ పుర ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర రావు తెలిపారు.

  13. లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు... ఈ మైనర్లను రేప్ చేసి చంపారనే ఆరోపణలతో ఆరుగురి అరెస్ట్

  14. JEE ADVANCED-2022లో 16వ ర్యాంకర్, అమ్మాయిల్లో టాపర్ తనిష్కా కాబ్రా చెప్పిన టిప్స్ వింటారా....

  15. ‘నువ్వు దళితుడివే అయితే, దళితులకే పుడితే’... ఏపీ అసెంబ్లీలో మంత్రి మేరుగు నాగార్జున వ్యాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగు నాగార్జున

    ఫొటో సోర్స్, AP Assembly

    ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగు నాగార్జున అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

    తనను, దళితులను కించపరిచేలా మేరుగు నాగార్జున మాట్లాడారని కొండేపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు.

    అసెంబ్లీలో స్టడీ సర్కిళ్ల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘నువ్వు దళితుడివే అయితే దళితులకే పుడితే చంద్రబాబు పంచ నుంచి బయటకు రా’ అంటూ మేరుగు నాగార్జున అన్నారు.

    మేరుగు నాగార్జున చేసిన వ్యాఖ్యల మీద తెలుగు దేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ తమ్మినేని సీతారంకు బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు.

    దీనిపై స్పీకర్ వివరణ కోరగా తాను తప్పుగా ఏం మాట్లాడలేదని మేరుగు నాగార్జున అన్నారు.

    అయితే మంత్రి మాట్లాడిన రికార్డును బయటకు తీయాలని స్వామి స్పీకర్‌ను కోరారు. అలాగే మంత్రి మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ఫోను ద్వారా ప్లే చేసేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించగా స్పీకర్ అడ్డుకున్నారు.

    మేరుగు నాగార్జున మాట్లాడిన రికార్డులను బయటకు తీయాలని స్వామి డిమాండ్ చేయగా తాను తరువాత చూసి చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు.

  16. షాంఘై కోపరేషన్ సదస్సు కోసం నేడు ఉజ్బెకిస్తాన్ వెళ్లనున్న మోదీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Facebook/Narendra Modi

    ఉజ్బెకిస్తాన్‌లో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల 22వ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

    ఈమేరకు నేడు సాయంత్రం ఆయన ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లనున్నట్లు విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు.

    ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షునితో పాటు ఇతర నాయకులతో మోదీ భేటీ అవుతారు.

  17. యూపీ: ‘ఇద్దరు మైనర్ బాలికల రేప్... ఆ తరువాత హత్య’

    ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీలో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతు కనిపించాయి.

    ‘ఆ అమ్మాయిలను మోసపూరితంగా ఊరి బయట పొలాల్లోకి తీసుకెళ్లి సొహైల్, జునైద్ అనే ఇద్దరు రేప్ చేశారు. పెళ్లి చేసుకోవాలంటూ నిందితులను ఆ అమ్మాయిలు కోరడంతో సోహైల్, హఫీజుల్, జునైద్ వారిని గొంతు పిసికి చంపేశారు.

    ఆ తరువాత వారు కరీముద్దీన్, ఆరిఫ్‌ను పిలిచి శవాలను వేలాడతీశారు’ అని లఖీంపుర్ ఖీరీ ఎస్‌పీ సంజీవ్ సుమన్ తెలిపారు.

    ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రేప్, హత్య కేసులు వారి మీద నమోదు చేశారు. బాలికల ఇద్దరి వయసు 18ఏళ్లలోపు ఉందని, వారు దళితులని పోలీసులు వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. ఆక్స్‌ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?

  19. రోజర్ ఫెదరర్: టెన్నిస్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడా దిగ్గజం

  20. జ్ఞాన్‌వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?