‘పెరియార్’ పేరు పెట్టినందుకు రెస్టారెంట్ మీద హిందుత్వవాదుల దాడి

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ‘పెరియార్’ పేరుతో పెట్టిన రెస్టారెంట్ మీద ‘హిందూ మున్నానీ’కి చెందిన కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

లైవ్ కవరేజీ

  1. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి, అయినా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్లడం లేదు?

  2. నమీబియా చీతాలు భారత్‌లో భద్రమేనా?

  3. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

    ఫొటో సోర్స్, ANI

    నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నెల్లూరు, కడప, గుంటూరు, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాలలో పీఎఫ్ఐ కేసుకు సంబంధించి ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఈ కేసులో ముఖ్య నిందితుడైన పీఎఫ్ఐ కన్వీనర్ షాదుల్లా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఎన్ఐఏ సుమారు 24మందికి పైగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుల ఇళ్ల పై సోదాలు నిర్వహించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    నిజామాబాద్ లోని షాహిద్ చౌష్ ఇంట్లో కూడా ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించి సీపీసీ 41(ఏ) కింద ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

    ఈ సంస్థ తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

    ఆగస్టు 26న ఎన్ఐఏ హైదరాబాద్ శాఖ పీఎఫ్ఐ కు సంబంధం ఉన్న ఒక కేసును నమోదు చేసింది.

    ఎన్ఐఏ నిజామాబాద్ కు చెందిన అబ్దుల్ ఖాదర్ తో పాటు మరో 26 మంది పేర్లనుఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ లో వీరు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు చేసింది.

    "ఈ కుట్రను అమలు చేసే భాగంగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు శిక్షణ ఇచ్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లోకి కొంత మంది వ్యక్తులను సభ్యులుగా చేర్చుకున్నారు. వీరు భారతీయ సార్వభౌమాధికారం, భద్రతకు అంతరాయం కలిగించే చర్యలకు పాల్పడి వివిధ వర్గాల మధ్య మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలను చేశారు" అని ఎఫ్ఐఆర్ పేర్కొంది.

  4. పదహారు ఊళ్లు ఏకమై కట్టుకున్న జనవారధి

  5. చండీగఢ్‌లో ప్రైవేటు యూనివర్సిటీలో విద్యార్థుల ఆత్మహత్యాయత్నాన్ని ఖండించిన పోలీసులు

    యూనివర్సిటీ

    ఫొటో సోర్స్, ANI

    చండీగఢ్‌లోని ఒక ప్రైవేటు యూనివర్సిటీలో శనివారం రాత్రి కనీసం 8 మంది విద్యార్థినులు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారన్న వాదనలను పంజాబ్ పోలీసులు ఖండించారు.

    శనివారం రాత్రి యూనివర్సిటీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

    ఇదొక వైరల్ వీడియోకు సంబంధించిన వ్యవహారమని మొహాలీ ఎస్ఎస్పీ వివేక్ సోనీ చెప్పారు.

    యూనివర్సిటీ విద్యార్థినులు స్నానం చేస్తుండగా మరొక విద్యార్థిని వీడియో తీసి షేర్ చేయడంతో మొత్తం వివాదం మొదలయిందని బీబీసీ ప్రతినిధి గుర్ విందర్ సింగ్ గ్రేవాల్ చెప్పారు.

    అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలను సిమ్లాలో నివసిస్తున్న మరొక అబ్బాయితో పంచుకోవడంతో ఆ అబ్బాయి వాటిని వైరల్ చేసినట్లు ఫిర్యాదు చేసిన విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

    అయితే, ఈ అంశం పై యూనివర్సిటీ యాజమాన్యం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈ అంశం పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్లుపోలీసులు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    విద్యార్థులు సంయమనం పాటించాలని, తప్పు చేసినవారినెవరినీ వదిలిపెట్టేది లేదని పంజాబ్ విద్యా శాఖ మంత్రి హర్ జోత్ సింగ్ బైన్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

    ఇది చాలా సున్నితమైన ఆడపిల్లల గౌరవానికి, హుందత్వానికి సంబంధించిన అంశమని అన్నారు.

    మీడియా కూడా ఈ అంశం పై రిపోర్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని కోరారు. ఇది సమాజానికే ఒక పరీక్ష లాంటిదని ట్వీట్ చేశారు.

    తప్పు చేసినవారిని క్షమించేది లేదని పంజాబ్ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్ మనీషా గులాటీ చెప్పారు.

  6. క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లండన్ చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    ఫొటో సోర్స్, PRESIDENT'S Office/TWITTER

    క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు.

    ఆమె సెప్టెంబరు 8న బల్మోరల్ కాసిల్ లో మరణించారు.

    వెస్ట్‌మినిస్టర్ అబేలో మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారిక లాంఛనాలతో క్వీన్ అంత్యక్రియలు జరుగుతాయి.

    ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతల్ని ఈ కార్యక్రమం కోసం ఆహ్వానిస్తారు.

    యూకే సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ప్రధానులు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో కూడా ప్రసారం చేస్తారు.

  7. దిల్లీలో ప్రారంభమయిన స్లమ్ రన్

    కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

    ఫొటో సోర్స్, ANI

    దేశవ్యాప్తంగా జరిగే స్లమ్ రన్ కార్యక్రామాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియం నుంచి ఆదివారం ప్రారంభించారు.

    ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా రెండు వారాల పాటు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా స్లమ్ రన్ ను చేపట్టారు.

    ఈ స్లమ్ రన్ లో మురికివాడలకు చెందిన 10,000మందికి పైగా విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

  8. కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచాయి: జైరాం రమేశ్

  9. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వ్యతిరేక కూటమిగా మారుతోందా, దీనితో భారత్‌కు ఎదురయ్యే ఇబ్బందులేంటి?

  10. పిటిషనర్ తాను గూఢచారినని చెప్పినా ఒప్పుకోలేదు, కానీ ప్రభుత్వం రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎందుకు ఆదేశించింది?

  11. హిజాబ్ ధరించనందుకు అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రాణాలు కోల్పోయిన యువతి

  12. విజయవాడ: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని కాలితో తన్నుతూ దాడి చేసిన లెక్చరర్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?

  13. నేలకొండపల్లి: ఎస్సై స్రవంతి రెడ్డి కులం పేరుతో బహిరంగంగా దళితులను దూషించారా? లేదా? ఎస్సీ కాలనీ వాసులు ఏమంటున్నారు, పోలీసుల వాదనేంటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  14. క్వీన్ ఎలిజబెత్ 2: కోహినూర్ వజ్రం, హంసలు, డాల్ఫిన్స్‌, ఖరీదైన కార్లు, భూములు, బంగళాలు.. కింగ్ చార్లెస్‌కు తల్లి నుంచి వారసత్వంగా ఏం వస్తున్నాయి?

  15. "రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో బీజేపీ ఉత్సవాలు చేస్తోంది" - రేవంత్ రెడ్డి

    కాంగ్రెస్ పార్టీ

    ఫొటో సోర్స్, Congress

    హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ స్వతంత్ర వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘

    ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌తో పాటు భారత్ లో విలీనమైన జునాఘడ్‌లో బీజేపీ ఎందుకు ఉత్సవాలు చేయడం లేదని ప్రశ్నించారు

    రాజకీయ ప్రయోజనాల కోసమే ఇక్కడ బీజేపీ ఉత్సవాలు చేస్తోందని ఆయన అన్నారు.

    తెలంగాణ పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకుపోవాలని, హైదరాబాద్‌లో మత కలహాలు సృష్టించాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు.

    సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడని, ఆయనను ఆర్ ఎస్ ఎస్ నుంచి నిషేధించారని గుర్తు చేశారు. స్వతంత్ర పోరాటంలో కానీ, సాయుధ పోరాటంలో కానీ బీజేపీ పాత్ర లేదని గుర్తు చేశారు.

    సెప్టెంబరు 17ను మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆయుధంలా బీజేపీ వాడుకుంటోంది అని రేవంత్ ఆరోపించారు.

    హైదరాబాద్ విలీనంలో నెహ్రూ పాత్రను గుర్తు చేశారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ పునాది వేసిందే పటేల్ అని ఆయన అన్నారు.

    తమ నాయకుడు పటేల్ ను బీజేపీ దొంగిలిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర కోడ్, పాట అన్నిటినీ మారుస్తాం అని అన్నారు.

    ఈ సందర్భంగా తెలంగాణ తల్లి పేరుతో ఒక కొత్త శిల్పాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఒక చేతిలో జొన్న కంకులతో, మరో చేత్తో అభయం ఇస్తూ, మెడలో తెలంగాణ సంప్రదాయ ఆభరణంతో మూడు రంగుల చీరతో ఉంటుంది.

    కాంగ్రెస్ పార్టీ ఈ ఉత్సవాలను ఏడాది పాటు చేయాలని నిర్ణయించింది.

  16. పాకిస్తాన్‌లో వినికిడి లోపం గలవారి కోసం పాటుపడుతోన్న ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్

  17. మూన్‌లైటింగ్ అంటే ఏమిటి? ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి?

  18. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చీతాలివి, 70 ఏళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాయి.

  19. కునో జాతీయ పార్కులోకి చిరుతలను వదిలిపెట్టిన ప్రధాని మోదీ

    నమీబియా నుంచి భారత్ కు తీసుకొచ్చిన 8 చిరుతలను ప్రధాని మోదీ శనివారం కునో జాతీయ పార్కులో విడుదల చేశారు.

    ఇవి భారత్ లో గత 70 ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. వీటిని తిరిగి దక్షిణ ఆఫ్రికా నుంచి తెప్పించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    వీటిని పూర్తిగా ఆవాసాల్లోకి వదిలిపెట్టే ముందు నెలరోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతారు.

  20. ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయకులు, ప్రముఖులు

    మోదీ, పుతిన్

    ఫొటో సోర్స్, TWITTER/@mfa_russia

    ప్రధాన మంత్రి మోదీకి అనేక మంది నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, క్యాబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

    మరో వైపు శుక్రవారం జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోదీ పుట్టినరోజుకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

    మోదీ పుట్టినరోజు గురించి పుతిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

    పుతిన్ మొదట మోదీకి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆ తర్వాత ప్రధాని మోదీ పుట్టిన రోజు గురించి మాట్లాడారు.

    "ప్రియమైన స్నేహితుడా, రేపు మీ పుట్టినరోజని తెలుసు. రష్యా సంప్రదాయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా చెప్పం. అందుకే, నేనిప్పుడు మీకు శుభాకాంక్షలు చెప్పలేను. కానీ, ఈ విషయం నాకు తెలుసని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీకు నా అభినందనలు”.

    “మీ దేశం సుభిక్షంగా ఉండాలని, మీ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.

    బౌద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.