You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘పెరియార్’ పేరు పెట్టినందుకు రెస్టారెంట్ మీద హిందుత్వవాదుల దాడి
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ‘పెరియార్’ పేరుతో పెట్టిన రెస్టారెంట్ మీద ‘హిందూ మున్నానీ’కి చెందిన కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
లైవ్ కవరేజీ
ఈ చిరుతలు కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కాయంటే
పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను జర్మనీలో విమానం నుంచి ఎందుకు ‘దించేశారు’? విపక్షాల ప్రశ్న
నోయిడాలో గోడ కూలి నలుగురు మృతి
నోయిడాలోని సెక్టర్ 21లో ఉన్న జల్ వాయు విహార్ సొసైటీలోని గోడ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఎన్ డిఆర్ ఎఫ్, అగ్నిమాపక దళాలు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఏఎన్ ఐ వార్తా సంస్థ ప్రచురించింది.
సొసైటీ ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న డ్రైనేజీ మరమ్మతు పనులు కొనసాగుతున్న సమయంలో ఈ గోడ కూలిపోయింది. దీంతో అక్కడ పని చేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎల్ వై సుహాస్ చెప్పారు.
ఈ ఘటన పట్ల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన చికిత్స చేయాలని ఆదేశించారు.
ఈ ఘటన పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ మేయర్ లతోవీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ దేశంలో భవనాలు కూలిపోవడం, అగ్నిప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సాజిద్ మీర్ : ముంబయి పేలుళ్ల నిందితుడిని ఐరాస బ్లాక్ లిస్ట్‌లో పెట్టకుండా చైనా ఎందుకు అడ్డుకుంటోంది
న్యూయార్క్‌లో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రపంచంలో వివిధ దేశాల నాయకులు న్యూ యార్క్ చేరుకుంటున్నారు.
భారత్ తరుపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఈ సమావేశంలో రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.
ఈ సమావేశానికి రష్యా, చైనా దేశాధినేతలు హాజరు కావడం లేదు. ఆ దేశాల నుంచి విదేశాంగ మంత్రులు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశానికి సబా కరోసీ అధ్యక్షత వహిస్తున్నారు. ఎస్ జై శంకర్ కరోసీతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో జనరల్ అసెంబ్లీ సమావేశ ప్రాధాన్యతలకు భారత్ మద్దతు ప్రకటిస్తుందని ఎస్ జై శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా భారత్ బహుళపాక్షిక విధానానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్ జైశంకర్ ట్వీట్ చేసారు.
ఈ పర్యటనలో భాగంగా ఎస్ జై శంకర్ సెర్బియా, క్యూబా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఈజిప్ట్, మాల్టా, ఆల్బేనియా, ట్రినిడాడ్, టొబాగో, విదేశాంగ శాఖ మంత్రులను కూడా కలిశారు.
ఆస్కార్స్ 2023: ఆర్ఆర్ఆర్‌కు నిరాశ.. భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’
5 నిమిషాలకు ఒకరు ఆసుపత్రిలో చేరుతున్నారు – పాకిస్తాన్ వరద ప్రాంతాలలో మలేరియా, డెంగీ, డయేరియా విజృంభణ
లద్దాఖ్‌లో చైనా నిబంధనలకు భారత్ తల వంచాల్సి వస్తోందా
ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
తెలంగాణ: అపరిచితుడికి బైకుపై లిఫ్ట్ ఇస్తే ఇంజెక్షన్‌తో హత్య? ఖమ్మం జిల్లా పోలీసులు ఏమంటున్నారు?
సత్యేంద్ర జైన్ కేసు విచారణ పై స్టే ఆదేశించిన దిల్లీ కోర్టు
దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ పై మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబందించి బెయిల్ పిటిషన్ విచారణ పై స్టే ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.
సత్యేంద్ర జైన్ కేసును మరొక జడ్జీకి బదిలీ చేయమంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అప్పీలు చేసింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభ్యర్ధన మేరకు ఈ కేసులో నిందితులందరికీ రౌస్ అవెన్యూ కోర్టు జిల్లా జడ్జి నోటీసు జారీ చేశారు.
ఈ కేసు విచారణను కోర్టు సెప్టెంబరు 30కి వాయిదా వేసింది.
ఏమి జరిగింది?
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సత్యేంద్ర జైన్ నివాసంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఈడీ భారీగా నగదు, బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతోంది.
హవాలా లావాదేవీలకు సంబంధించి ఈడీ సత్యేంద్ర జైన్ ను అరెస్టు చేసింది.
సత్యేంద్ర జైన్ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఆగస్టు 25, 2017లో సీబీఐకేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా
ఈడీ కూడా సత్యేంద్ర జైన్ పై కేసు నమోదు చేసింది.
సత్యేంద్ర జైన్ నాలుగు సంస్థల్లో పెట్టుబడి పెట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోయారని ఈడీ వాదిస్తోంది.
సత్యేంద్ర జైన్ అధీనంలో దిల్లీ వైద్య ఆరోగ్య శాఖ,ఇంధనం, పబ్లిక్ వర్క్స్, పరిశ్రమలు, నగర అభివృద్ధి, వరదలు, జలవనరుల శాఖ కూడా ఉన్నాయి.
ఫరీద్‌కోట్ సంస్థానం: సుమారు రూ.20వేల కోట్ల ఆస్తి వివాదం- సుప్రీంకోర్టులో ఎలా పరిష్కారమైంది, నకిలీ వీలునామాలు ఎలా గుర్తించారు?
లద్దాఖ్ లో4.3 తీవ్రతతో భూకంపం
లద్దాఖ్ లో4.3 తీవ్రతతో భూకంపం ఏర్పడింది.
ఈ భూకంపం కార్గిల్ కు 64కిలోమీటర్ల దూరంలో సోమవారం ఉదయం 9.30నిమిషాలకు సంభవించింది.
ఈ భూకంప తీవ్రత భూమిలో 10కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.
బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్
ఓనం బంపర్ లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటోడ్రైవర్, ట్యాక్స్ పోగా ఆయన చేతికొచ్చేది ఎంత?
కింగ్ కోబ్రా: మనుషుల ప్రాణాలు కాపాడుతోందా?
పుట్టుకతో చేతుల్లేవు, అయినా పిల్లల్ని దత్తత తీసుకుని పోషిస్తున్న మహిళ
యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్‌రూమ్ వీడియోలు లీక్, 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం నిజమేనా?
మహారాష్ట్ర గుహలలో చరిత్ర విప్పని రహస్యాలు ఇంకా ఉన్నాయా? ప్రాచీన మానవుడి కళాకృతులు, వస్తువులు ఏ నాగరికతవి?