‘హైదరాబాద్ విమోచన’ వేడుకల్లో పాల్గొనాలంటూ తెలంగాణ యూనివర్సిటీలను కోరిన యూజీసీ
ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న ‘హైదరాబాద్ విమోచన దినం’ వేడుకల్లో పాల్గొనాలంటూ తెలంగాణలోని యూనివర్సిటీలు, కాలేజీలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) కోరింది.
ఈమేరకు యూజీసీ సెక్రటరీ రజినీశ్ జైన్ యూనివర్సిటీల వీసీలు, కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు లేఖ రాశారు.
కర్నాటక, మరఠ్వాడా యూనివర్సిటీలకు కూడా యూజీసీ ఈమేరకు వేడుకల్లో పాల్గొనాలని కోరింది.
1948 సెప్టెంబరు 17న సైనిక చర్య తరువాత హైదరాబాద్ స్టేట్ భారత్‌లో కలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు 17 నుంచి 2023 సెప్టెంబరు 17 వరకు కేంద్ర ప్రభుత్వం ‘హైదరాబాద్ విమోచన’ వేడుకలు జరుపుతోంది.