35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైవ్ కవరేజీ

  1. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్న గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీకి 8వ స్థానం

    గౌతమ్ అదానీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీ

    ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రెండో ర్యాంకుకు చేరుకున్నారు.

    ఆయన ఫ్రాన్స్‌కు చెందిన కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను దాటి ఈ ర్యాంకును సాధించారు.

    ఈ జాబితాలో టెస్లా మోటార్స్ అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

    బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడో స్థానం, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నాలుగో స్థానం, బిల్ గేట్స్ ఐదో స్థానంలో ఉన్నారు.

    గౌతమ్ అదాని సంపద 154.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12లక్షల కోట్లు ) కాగా, ఎలాన్ మస్క్ సంపద రూ. 21.7 లక్షల కోట్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది.

    ఈ జాబితాలో ముకేశ్ అంబానీ సుమారు రూ.7 లక్షల కోట్ల సంపదతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

    బొగ్గు గనుల నుంచి విమానాశ్రయాల వరకు అనేక వ్యాపారాలో అదానీ బిజినెస్ వ్యవహరాలు విస్తరించాయి. ఇటీవలే అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను పరోక్ష పద్ధతిలో కొనుగోలు చేసింది.

  2. బ్రిటన్ వంట గదుల్లోకి భారతీయ వంటకాలను తీసుకెళ్లిన మాథుర్

  3. స్మార్ట్‌ఫోన్‌ను పిల్లలకు ఏ వయసులో ఇవ్వాలి?

  4. లఖీంపుర్ ఖీరీలో దళిత బాలికల హత్య: 'నా బిడ్డలను ఎందుకు చంపారు, అందరినీ ఉరి తీయాలి' - తల్లి ఆవేదన

  5. ఉత్తరప్రదేశ్: లఖ్‌నవూలో గోడకూలి 9మంది మృతి

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో కురిసిన భారీ వర్షాలకు ఓ గోడ కూలడంతో 9 మంది మరణించారు.

    ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

    లఖ్‌నవూలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న దిల్‌కుషా ఏరియాలో ఘటన జరిగిందని రాష్ట్ర హోంశాఖ వెల్లడించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

  6. SCO సదస్సు: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తో సమావేశం కానున్న ప్రధానమంత్రి మోదీ

    మోదీ, షీ జిన్‌పింగ్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్, నరేంద్రమోదీ తో షీ జిన్‌పింగ్

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ వేదికగా జరిగే ఒక భద్రతా సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా ఉజ్బెకిస్తాన్ దేశాల నేతలతో సమావేశమవుతారు.

    షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సభ్యదేశాలు ఉజ్బెకిస్తాన్ వేదికగా జరుగుతున్న సమావేశంలో పాల్గొంటున్నాయి.

    చైనా సైన్యాన్ని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సూచించాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణియన్ స్వామి ట్వీట్ చేశారు.

    యుక్రెయిన్ యుద్ధంతో పాటు చైనా, పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి ఈ సదస్సులో ప్రముఖంగా చర్చించే అవకాశం ఉంది.

    ఈ సదస్సులో చైనా, రష్యాలతో మోదీ చర్చలు జరుపనున్నారనే అంచనాలు మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీపై అందరి దృష్టి నిలిచింది.

    గురువారం రాత్రి ఉజ్బెకిస్తాన్‌లో సదస్సు జరుగుతున్న సమర్‌కండ్‌ నగరానికి ప్రధానమంత్రి మోదీ చేరుకున్నారు.

    ప్రధానికి ఉజ్బెకిస్తాన్‌లోని భారత దౌత్యాధికారులు, ఇతర సిబ్బంది స్వాగతం పలికారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. SCO సదస్సు: భారత్-రష్యా సంబంధాల బలోపేతంపై పుతిన్‌తో చర్చించిన ప్రధాని మోదీ

  8. యుక్రెయిన్ మెడిసిన్ విద్యార్థులను భారత్ ఎందుకు ఇక్కడి కాలేజీల్లో చేర్చుకోవడం లేదు?

  9. ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి

  10. ఆస్పత్రికి వెళ్ళిన రోగులు 17 రకాల హక్కులను వినియోగించుకోవచ్చు, అవి ఏంటో మీకు తెలుసా

  11. మంత్రి మేరుగు నాగార్జున దళితులను అవమానించారా, ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది

  12. లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు, అసలేం జరిగింది?

  13. మ్యూచువల్ ఫండ్స్‌: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?

  14. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

    ఫొటో సోర్స్, Facebook/KCR

    తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేడ్కర్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

    భారత సామాజిక దార్శనికుడు, మహామేధావి అంబేడ్కర్ పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కేసీఆర్ అన్నారు.

    అలాగే భారతదేశ కొత్త పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ ప్రధాని త్వరలోనే లేఖ రాస్తామని ఆయన తెలిపారు.

  15. బ్రిటన్ కొత్త హోం మంత్రి, భారత సంతతికి చెందిన సువెల్లా బ్రేవర్‌మన్ ఎవరు?

  16. మహారాష్ట్రలోని ఓ బడిలో పిల్లలకు రొట్టెలు చేయడం నేర్పిస్తున్న టీచర్లు

  17. హైదరాబాద్: ‘మైనర్ బాలిక కిడ్నాప్, రేప్’, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    తెలంగాణ పోలీసు

    ఫొటో సోర్స్, UGC

    హైదరాబాద్ డబీర్‌ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ కేసు నమోదు అయింది. డబీర్ పురాకు చెందిన మైనర్ అమ్మాయిని ఇద్దరు యువకులు కలిసి, నాంపల్లిలోని ఒక లాడ్జీకి తీసుకెళ్లి రెండు రోజులు అత్యాచారం చేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులకు ఫిర్యాదు అందింది.

    ముందుగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. తరువాత అమ్మాయి ఆచూకీ కనిపెట్టారు. అప్పుడు అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం రేప్ కేసు కూడా పెట్టారు.

    వెంటనే ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యి, అమ్మాయిని విచారించిన తరువాత ఘటన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

    నిందితులు రెయిన్ బజార్ ప్రాంతానికి చెందిన వారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం లాడ్జీకి ఎవరూ బలవంతంగా తీసుకెళ్లలేదని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో కిడ్నాప్ కేసు, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

    విచారణ పూర్తయిన తరువా పూర్తి వివరాలు తెలియజేస్తామని డబీర్ పుర ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర రావు తెలిపారు.

  18. లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు... ఈ మైనర్లను రేప్ చేసి చంపారనే ఆరోపణలతో ఆరుగురి అరెస్ట్

  19. JEE ADVANCED-2022లో 16వ ర్యాంకర్, అమ్మాయిల్లో టాపర్ తనిష్కా కాబ్రా చెప్పిన టిప్స్ వింటారా....

  20. ‘నువ్వు దళితుడివే అయితే, దళితులకే పుడితే’... ఏపీ అసెంబ్లీలో మంత్రి మేరుగు నాగార్జున వ్యాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగు నాగార్జున

    ఫొటో సోర్స్, AP Assembly

    ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగు నాగార్జున అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

    తనను, దళితులను కించపరిచేలా మేరుగు నాగార్జున మాట్లాడారని కొండేపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు.

    అసెంబ్లీలో స్టడీ సర్కిళ్ల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘నువ్వు దళితుడివే అయితే దళితులకే పుడితే చంద్రబాబు పంచ నుంచి బయటకు రా’ అంటూ మేరుగు నాగార్జున అన్నారు.

    మేరుగు నాగార్జున చేసిన వ్యాఖ్యల మీద తెలుగు దేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ తమ్మినేని సీతారంకు బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు.

    దీనిపై స్పీకర్ వివరణ కోరగా తాను తప్పుగా ఏం మాట్లాడలేదని మేరుగు నాగార్జున అన్నారు.

    అయితే మంత్రి మాట్లాడిన రికార్డును బయటకు తీయాలని స్వామి స్పీకర్‌ను కోరారు. అలాగే మంత్రి మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ఫోను ద్వారా ప్లే చేసేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించగా స్పీకర్ అడ్డుకున్నారు.

    మేరుగు నాగార్జున మాట్లాడిన రికార్డులను బయటకు తీయాలని స్వామి డిమాండ్ చేయగా తాను తరువాత చూసి చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు.