‘ఆ అమ్మాయిలను మోసపూరితంగా
ఊరి బయట పొలాల్లోకి తీసుకెళ్లి సొహైల్, జునైద్ అనే ఇద్దరు రేప్ చేశారు. పెళ్లి
చేసుకోవాలంటూ నిందితులను ఆ అమ్మాయిలు కోరడంతో సోహైల్, హఫీజుల్, జునైద్ వారిని
గొంతు పిసికి చంపేశారు.
ఆ తరువాత వారు కరీముద్దీన్,
ఆరిఫ్‌ను పిలిచి శవాలను వేలాడతీశారు’ అని లఖీంపుర్ ఖీరీ ఎస్‌పీ సంజీవ్ సుమన్ తెలిపారు.
ఈ కేసుకు
సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రేప్, హత్య కేసులు వారి మీద నమోదు
చేశారు. బాలికల ఇద్దరి వయసు 18ఏళ్లలోపు ఉందని, వారు దళితులని పోలీసులు
వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఆక్స్‌ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?
రోజర్ ఫెదరర్: టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడా దిగ్గజం
జ్ఞాన్‌వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?
SCO Summit: ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఏం మాట్లాడబోతున్నారు?
SCO: గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత తొలిసారి భేటీకానున్న మోదీ, షీ జిన్‌పింగ్, రెండు దేశాల సంబంధాలలో మార్పులు వస్తాయా?
తెలంగాణలో ఆయిల్ పామ్: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చులు తగ్గుతాయా?
హోటల్ రూబీ: అగ్నిప్రమాదం బాధితులను ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు
బ్రేకింగ్ న్యూస్, మరో మూడేళ్ల పాటు బీసీసీఐ అధ్యక్షునిగా సౌరవ్ గంగూలీ
ఫొటో సోర్స్, Getty Images
బీసీసీఐ అధ్యక్షునిగా సౌరవ్ గంగూలీ,
కార్యదర్శిగా జై షా మరో మూడేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగేందుకు సుప్రీం కోర్టు గ్రీన్
సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలు
చేసేందుకు సుప్రీం అనుమతించింది.
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. బీసీసీఐలో
లేదా ఏదైనా రాష్ట్ర క్రికెట్ బోర్డులో పదవిలో ఉన్నవారెవరైనా మరోసారి పదవిని
చేపట్టడానికి ముందు మూడేళ్ల పాటు ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ (రెండు పదవుల మధ్య
విరామం) ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ, కొత్త నిబంధన ప్రకారం ఎవరైనా
సభ్యుడు వరుసగా రెండు పర్యాయాలు పదవిలో ఉండొచ్చు.
దీంతో సౌరవ్ గంగూలీ, జై షా మరో పర్యాయం
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా పదవి చేపట్టే అవకాశం లభించింది.
బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందు
సౌరవ్ గంగూలీ, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. జై షా, గుజరాత్
క్రికెట్ సంఘంలో పని చేశారు.
2021 అక్టోబర్‌లో గంగూలీ, జై షా... బీసీసీఐ
పదవులను చేపట్టారు. సెప్టెంబర్‌తో వారి పదవీకాలం ముగుస్తుంది.
ఊబకాయులు తెలంగాణలో ఎక్కువా, ఆంధ్రలో ఎక్కువా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏం చెప్పింది
కొత్తపల్లి గీత: రూ. 42.79 కోట్ల లోన్ ఎగవేత కేసులో మాజీ ఎంపీకి, ఆమె భర్తకు అయిదేళ్ల జైలు శిక్ష
‘యూఎన్ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం కోసం సహకరిస్తాం’
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చైర్మన్‌షిప్ త్వరలోనే
ఫ్రాన్స్ చేతికి వస్తుందని, అప్పుడు భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించేందుకు మరింత సహకరిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి కేథరిన్ కొలన్నా అన్నారు.
భారతపర్యటనకు వచ్చిన ఆమె విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు.
భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించేలా తాము మద్దతు కూడగడతామని
ఆమె అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోటు... రూ.200 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
బ్రిటన్ రాణి అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఫొటో సోర్స్, Facebook/President of India
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారతదేశం తరపున
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు.
ఈమేరకు సెప్టెంబరు 17-19 వరకు ఆమె లండన్‌లో పర్యటించనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
బ్యాంకు లోను ఎగ్గొట్టారంటూ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం
ఫొటో సోర్స్, Facebook/Kothapalli Geetha
అరకు మాజీ ఎంపీ, బీజేపీ నేత కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్టు
చేశారు. మంగళవారం అరెస్ట్ చేసిన ఆమెను వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని
ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత
పిటిషన్ దాఖలు చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని మాజీ ఎంపీ
కొత్తపల్లి గీత దంపతులు చెల్లించలేదదంటూ ఆ బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు
చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కొత్తపల్లి గీతను అరెస్టు చేశారు.
విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత
దంపతులు రూ.52 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఈ రుణం చెల్లించనందున బ్యాంకు
అధికారులు గీతా దంపతులపై ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు 2015 జులై 11న
చార్జీషీట్ దాఖలు చేసింది. కొత్తపల్లి గీత ఆమె భర్త విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్
ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. రామకోటేశ్వరరావులపై సీబీఐ చార్జీషీట్
దాఖలు చేసింది.
బ్యాంకు నుంచి రుణం పొందేందుకు నేరపూరిత కుట్రకు
పాల్పడ్డారని చార్జీషీట్‌లో సీబీఐ పేర్కొంది. కొత్తపల్లి గీత, ఆమె భర్త
రామకోటేశ్వరరావు వాస్తవాలను దాచిబ్యాంకుకు తప్పుడు
సమాచారం ఇచ్చారని పేర్కొంది.
మల్లిఖార్జున హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాలాక్షి
క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోస్టల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్
లిమిటెడ్, కనక ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్, మహేశ్వర ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, విశాలాక్షి
ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, అన్విత హాస్పిటాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు
కొతపల్లి గీత డైరెక్టర్‌గా ఉన్నారు.
దిల్లీ సిటీ బస్సుల్లో తొలిసారిగా 11 మంది మహిళా డ్రైవర్లు
గోవా: బీజేపీలో చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గోవాలోని 11 మంది
కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 8 మంది బీజేపీలో చేరారు.
ఆ తరువాత గోవా
కాంగ్రెస్‌ను బీజేపీలో చేర్చాలంటూ గోవా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తీర్మానం
చేసింది.
బీజేపీలో చేరిన
వారిలో మాజీ గోవా ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కూడా ఉన్నారు.
ప్రస్తుతం గోవా
అసెంబ్లీలో 40 సీట్లు ఉండగా బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
దీనిపై కాంగ్రెస్
పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది.
‘ఆపరేషన్ లోటస్ దిల్లీ,
పంజాబ్‌లో ఫలించలేదు. కానీ గోవాలో విజయవంతమైంది.
ఎందుకు?
ఎందుకంటే
కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే బీజేపీ ఎమ్మెల్యేను ఎన్నుకున్నట్లే.
కాంగ్రెస్ పని
అయిపోయింది’ అని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
బెంగళూరు ఇలా మునిగిపోవడానికి అసలు కారణాలు ఇవేనా?
తెలంగాణలో ఆయిల్ పామ్: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చు, దిగుమతి బిల్లులు తగ్గుతాయా?