35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’
ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
లైవ్ కవరేజీ
కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్ ప్రారంభం
ఫొటో సోర్స్, ANI
కశ్మీర్ ప్రజలు సుమారు మూడు దశాబ్దాల తర్వాత బిగ్
స్క్రీన్ పై సినిమాలను చూసేందుకు అవకాశం కలుగుతోంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్
గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు.
జమ్మూ కశ్మీర్‌లో కొత్త సినిమా విధానాల
రూపకల్పనతో ఇక్కడ సినిమాల చిత్రీకరణ పెరిగింది. భవిష్యత్తులో రాష్ట్రంలో ఫిల్మ్
సిటీ కూడా నిర్మిస్తామని మనోజ్ సిన్హా తెలిపారు. ఇందుకోసం భూమిని కూడా
కేటాయించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రచురించింది.
ఫొటో సోర్స్, ANI
లండన్ సమీపంలోని లెస్టర్‌లో అల్లర్లు.. 47 మంది అరెస్ట్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను జర్మనీలో విమానం నుంచి ఎందుకు ‘దించేశారు’? విపక్షాల ప్రశ్న
నోయిడాలో గోడ కూలి నలుగురు మృతి
ఫొటో సోర్స్, ANI
నోయిడాలోని సెక్టర్ 21లో ఉన్న జల్ వాయు విహార్
సొసైటీలోని గోడ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి.
వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఎన్ డిఆర్ ఎఫ్, అగ్నిమాపక దళాలు రక్షణ చర్యలు
చేపడుతున్నట్లు ఏఎన్ ఐ వార్తా సంస్థ ప్రచురించింది.
సొసైటీ ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న డ్రైనేజీ
మరమ్మతు పనులు కొనసాగుతున్న సమయంలో ఈ గోడ కూలిపోయింది. దీంతో అక్కడ పని చేస్తున్న
కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎల్ వై
సుహాస్ చెప్పారు.
ఈ ఘటన పట్ల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన చికిత్స చేయాలని
ఆదేశించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఘటన పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి చర్యలు
తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ మేయర్
లతోవీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ
దేశంలో భవనాలు కూలిపోవడం, అగ్నిప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న
సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
సాజిద్ మీర్ : ముంబయి పేలుళ్ల నిందితుడిని ఐరాస బ్లాక్ లిస్ట్‌లో పెట్టకుండా చైనా ఎందుకు అడ్డుకుంటోంది
న్యూయార్క్‌లో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్
ఫొటో సోర్స్, ANI
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రపంచంలో
వివిధ దేశాల నాయకులు న్యూ యార్క్ చేరుకుంటున్నారు.
భారత్ తరుపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ ఈ సమావేశంలో
పాల్గొంటారు.
ఈ సమావేశంలో రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడి ప్రధానంగా చర్చకు
వచ్చే అవకాశముంది.
ఈ సమావేశానికి రష్యా, చైనా దేశాధినేతలు హాజరు కావడం లేదు. ఆ దేశాల నుంచి
విదేశాంగ మంత్రులు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశానికి సబా కరోసీ అధ్యక్షత
వహిస్తున్నారు. ఎస్ జై శంకర్ కరోసీతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో జనరల్ అసెంబ్లీ సమావేశ ప్రాధాన్యతలకు భారత్ మద్దతు
ప్రకటిస్తుందని ఎస్ జై శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా భారత్ బహుళపాక్షిక విధానానికి
కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్ జైశంకర్ ట్వీట్ చేసారు.
ఈ పర్యటనలో భాగంగా ఎస్ జై శంకర్ సెర్బియా, క్యూబా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఈజిప్ట్,
మాల్టా, ఆల్బేనియా, ట్రినిడాడ్,
టొబాగో, విదేశాంగ శాఖ మంత్రులను కూడా కలిశారు.
ఆస్కార్స్ 2023: ఆర్ఆర్ఆర్‌కు నిరాశ.. భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’
5 నిమిషాలకు ఒకరు ఆసుపత్రిలో చేరుతున్నారు – పాకిస్తాన్ వరద ప్రాంతాలలో మలేరియా, డెంగీ, డయేరియా విజృంభణ
లద్దాఖ్‌లో చైనా నిబంధనలకు భారత్ తల వంచాల్సి వస్తోందా
‘కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న శశిథరూర్’
కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షునిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్‌కు సోనియా గాంధీ అనుమతి
ఇచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
ఈమేరకు అనుమతి కోసం ఆయన నేడు సోనియా గాంధీని కలిశారు.
అయితే అందుకు ఎవరి
అనుమతి అక్కర్లేదని మరొక సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు.
‘కాంగ్రెస్ ప్రజాస్వామ్య
పార్టీ. ఖాళీగా ఉంటే ప్రెసిడెంట్ పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చు. రాహుల్ గాంధీ,
సోనియా గాంధీల అభిప్రాయం కూడా అదే’ అని ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
బీజేపీలో చేరిన అమరీందర్ సింగ్
ఫొటో సోర్స్, ANI
పంజాబ్ మాజీ
ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. ఆయన పార్టీ పంజాబ్ లోక్
కాంగ్రెస్(పీఎల్‌సీ)ని కూడా అందులో విలీనం చేశారు.
దేశ ప్రయోజనాల
కోసం పోరాడుతున్న బీజేపీలో చేరడానికి ఇదే సరైన సమయమని ఈ సందర్భంగా అమరీందర్ సింగ్
అన్నారు.
‘పంజాబ్ సరిహద్దు
రాష్ట్రం. పాకిస్తాన్‌తో మన సంబంధాలు దెబ్బతింటున్నాయి. పంజాబ్‌లో అల్లర్లు
సృష్టించడానికి అక్కడి నుంచి డ్రోన్లు వస్తున్నాయి. చైనా ఇక్కడకు పెద్ద దూరంలో
లేదు. కాబట్టి మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది’ అని ఆయన
చెప్పారు.
గత ఏడాది
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని
స్థాపించారు. పోయిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన ఆ పార్టీ ఒక్క సీటును
కూడా గెలవలేక పోయింది.
పాటియాల నుంచి
పోటీ చేసిన అమరీందర్ సింగ్ కూడా ఓడిపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
తెలంగాణ: అపరిచితుడికి బైకుపై లిఫ్ట్ ఇస్తే ఇంజెక్షన్‌తో హత్య? ఖమ్మం జిల్లా పోలీసులు ఏమంటున్నారు?
సత్యేంద్ర జైన్ కేసు విచారణ పై స్టే ఆదేశించిన దిల్లీ కోర్టు
ఫొటో సోర్స్, ANI
దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ పై మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబందించి బెయిల్
పిటిషన్ విచారణ పై స్టే ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.
సత్యేంద్ర జైన్ కేసును మరొక జడ్జీకి బదిలీ చేయమంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్
డైరెక్టరేట్ అప్పీలు చేసింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభ్యర్ధన మేరకు ఈ కేసులో నిందితులందరికీ
రౌస్ అవెన్యూ కోర్టు జిల్లా జడ్జి నోటీసు జారీ చేశారు.
ఈ కేసు విచారణను కోర్టు సెప్టెంబరు 30కి వాయిదా వేసింది.
ఏమి జరిగింది?
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సత్యేంద్ర జైన్ నివాసంలో సోదాలు
నిర్వహించింది. ఈ సోదాల్లో ఈడీ భారీగా నగదు, బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతోంది.
హవాలా లావాదేవీలకు సంబంధించి ఈడీ సత్యేంద్ర జైన్ ను అరెస్టు చేసింది.
సత్యేంద్ర జైన్ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఆగస్టు 25, 2017లో సీబీఐకేసు నమోదు చేసింది. ఈ
ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా
ఈడీ కూడా సత్యేంద్ర జైన్ పై కేసు నమోదు చేసింది.
సత్యేంద్ర జైన్ నాలుగు సంస్థల్లో పెట్టుబడి పెట్టిన డబ్బు ఎక్కడి
నుంచి వచ్చిందో చెప్పలేకపోయారని ఈడీ వాదిస్తోంది.
సత్యేంద్ర జైన్ అధీనంలో దిల్లీ వైద్య ఆరోగ్య శాఖ,ఇంధనం, పబ్లిక్
వర్క్స్, పరిశ్రమలు, నగర అభివృద్ధి,
వరదలు, జలవనరుల శాఖ కూడా ఉన్నాయి.
ఫరీద్‌కోట్ సంస్థానం: సుమారు రూ.20వేల కోట్ల ఆస్తి వివాదం- సుప్రీంకోర్టులో ఎలా పరిష్కారమైంది, నకిలీ వీలునామాలు ఎలా గుర్తించారు?
లద్దాఖ్ లో4.3 తీవ్రతతో భూకంపం
ఫొటో సోర్స్, National Center for Seismology
లద్దాఖ్ లో4.3 తీవ్రతతో భూకంపం ఏర్పడింది.
ఈ భూకంపం కార్గిల్ కు 64కిలోమీటర్ల దూరంలో సోమవారం ఉదయం 9.30నిమిషాలకు సంభవించింది.
ఈ భూకంప తీవ్రత భూమిలో 10కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్లు నేషనల్ సెంటర్ ఫర్
సెస్మాలజీ తెలిపింది.
బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్
ఓనం బంపర్ లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటోడ్రైవర్, ట్యాక్స్ పోగా ఆయన చేతికొచ్చేది ఎంత?
కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచాయి: జైరాం రమేశ్
ఫొటో సోర్స్, ani
కాంగ్రెస్ లేకుండా
విపక్షాలన్నీ ఏకం కావాలని కొన్ని పార్టీలు అనుకుంటున్నాయని, కానీ, అది సాధ్యం
కాదని.. అలాంటి పార్టీల నమ్మకం భ్రమ మాత్రమేనని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
ఇలాంటి ప్రయత్నాలన్నీ
కాంగ్రెస్, విపక్షాల బలాన్ని తగ్గిస్తాయని ఆయన అన్నారు.
కొన్ని ప్రాంతీయ పార్టీలు
వాటి ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచాయని ఆయన పీటీఐకి ఇచ్చిన
ఇంటర్వ్యూలో అన్నారు.
బీజేపీయేతర పార్టీలు
ఏవైనా కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఐదేళ్లు మనుగడ సాధిస్తామనుకుంటే
అది పిచ్చితనమని ఆయన అన్నారు.