35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైవ్ కవరేజీ

  1. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూనియర్ ఎన్‌టీఆర్

    జూనియర్ ఎన్టీఆర్

    ఫొటో సోర్స్, Facebook/JrNTR

    ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం మీద సినీనటుడు జూనియర్ ఎన్‌టీఆర్ స్పందించారు.

    ‘ఎన్‌టీఆర్, వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.

    ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్ స్థాయిని పెంచదు. అలాగని ఎన్‌టీఆర్ స్థాయిని తగ్గించదు.

    విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం ద్వారా ఎన్‌టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.’ అని జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. కేటీఆర్: ‘నేను ఇంత వరకు ఓట్ల కోసం చుక్క మందు పంచలేదు... పైసా డబ్బులు ఇవ్వలేదు’

    తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్

    ఫొటో సోర్స్, Facebook/KTR

    సిరిసిల్లలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ప్రోగ్రాం కింద విద్యార్థులకు ట్యాబ్స్ అందజేశారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎన్నికల్లో మందు పంచను, డబ్బులు ఇవ్వనని అన్నారు.

    ‘ఎన్నికలు అనగానే అడ్డగోలుగా ఖర్చు పెడతాం. ఎందుకు ఖర్చు పెడతాం? దేని మీద తగలబెడతాం? అనేది మీ అందరికీ తెలుసు.

    అదంతా బూడిదలో పోసిన పన్నీరే. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితే గెలవరు. ఖర్చు పెట్టకపోతే ఓడిపోరు. కాస్త సిన్సియర్‌గా పని చేస్తే చాలు.

    నేను సిరిసిల్లలో నాలుగు ఎన్నికల్లో పోటీ చేశా. ఒక్క ఎన్నికలో కూడా ఓట్ల కోసం నేను చుక్క మందు కూడా పంచలేదు. పంచను కూడా.

    ఓట్ల కోసం మందు పంచేది లేదు. పైసలు ఇచ్చేది లేదు.

    నాతో పోటీ పడాలి అనుకునే వాళ్లు మంచి పనుల్లో పోటీ పడాలి’ అని కేటీఆర్ అన్నారు.

  3. డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?

  4. జింఖానా మైదానం తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు : పోలీసులు

    జింఖానా మైదానం వద్ద స్పృహ తప్పి పడిపోయిన అభిమానులు

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, జింఖానా మైదానం వద్ద స్పృహ తప్పి పడిపోయిన అభిమానులు

    జింఖానా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటల్లో మహిళ చనిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని హైదరాబాద్ నార్త్‌జోన్ అడిషనల్ డీసీపీ తెలిపారు.

    తొక్కిసలాటలో నలుగురు గాయపడ్డారని వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. అంతేకానీ ఎవరూ చనిపోలేదని అన్నారు.

    ఒక మహిళ చనిపోయినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

    హెచ్‌సీఏ ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయని విచారణలో తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ స్పష్టం చేశారు.

    హైదరాబాద్ లో క్రికెట్ మాచ్ టికెట్స్ కోసం జనం ఒకేసారి ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఇవాళ తెల్లవారుజామున నుంచి జింఖానా గ్రౌండ్ దగ్గర వేలాది మంది బారులు తీరారు.

    చాలా ఏళ్ల తరువాత హైదరాబాద్‌లో ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అందులోనూ ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ కావడంతో ఉత్కంఠ పెరిగింది. ఆన్‌లైన్ టికెట్స్ వెంటనే అయిపోవడంతో ఆఫ్‌లైన్ టికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది.

    దీంతో జింఖానా మైదానం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు బారులు తీరారు. ఇంత మంది జనం వస్తారని ఊహించని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దానికి తగిన ఏర్పాట్లు చేయలేదు.

    దాంతో జనం మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అదుపు చేయడానికి నాన తంటాలు పడ్డారు. ఒక కానిస్టేబుల్ కి, ఒక మహిళ కీ గాయాలు అయ్యాయి. వారికి చికిత్స చేస్తున్నారు.

    ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు చికిత్స పొందుతున్నారు. ‘

    ‘మా ఆసుపత్రిలో ఎవరూ చనిపోలేదు. ఆ ఏడుగురికీ చికిత్స అందిస్తున్నాం. వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం’ అని యశోద ఆసుపత్రి ప్రతినిధులు బీబీసీకి తెలిపారు.

  5. ఇండియా-ఆస్ట్రేలియా: క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం హైదరాబాద్‌‌లో తొక్కిసలాట

    జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత

    భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం హైదరాబాద్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది.

    ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో టీ20 మ్యాచ్ జరగనుంది.

    సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు విక్రయించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసింది.

    టికెట్ల కోసం వేల మంది వచ్చి బారులు తీరారు. కొన్ని గంటల నుంచి బారుల్లో నిలబడి ఎదురు చూస్తున్నారు.

    స్థానిక మీడియా కథనాల ప్రకారం గేట్లను ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట చోటు చేసుకుని 20 మందికి స్పృహ తప్పింది. వారిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపాయి.

    పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    జింఖానా మైదానం వద్ద టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, జింఖానా మైదానం వద్ద టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు
  6. సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాల్లో మహిళలు ఏం చేయకూడదు, ఏమేం చేయొచ్చు?

  7. ఇరాన్‌లో హిజాబ్‌లను తగలబెడుతున్న మహిళలు

  8. నార్త్ వెస్ట్రన్ రైల్వేలో సేవలందిస్తున్న మహిళా పైలట్ నీలమ్ రాథల్

  9. శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?

  10. నీరా రాడియ టేపుల కేసులో ‘నేరం’ జరగలేదు:సీబీఐ

    నీరా రాడియ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, నీరా రాడియ(ఫైల్ ఫొటో)

    సుమారు 12 ఏళ్ల కిందట 2జీ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీరా రాడియా టేపుల కేసులో ఎటువంటి నేరం జరగలేదని సుప్రీం కోర్టుకు సీబీఐ తెలిపింది.

    టేపుల్లోని సంభాషణలను తాము విచారించామని వాటికి సంబంధించి ఎటువంటి నేరపూరిత కార్యకలాపాలు జరగలేదని వెల్లడించింది.

    ఈమేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ విన్నవించారు.

    గత యూపీఏ ప్రభుత్వ హాయంలో కార్పొరేట్ లాబీలు చేసే నీరా రాడియాతో నాటి కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, సీనియర్ జర్నలిస్టులు జరిపిన సంభాషణలు మీడియాకు లీక్ అయ్యాయి.

    మనీలాండరింగ్‌కు సంబంధించి 2008-09లో ఆదాయపు పన్ను శాఖ నీరా రాడియా ఫోన్‌ను ట్యాప్ చేసింది.

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి కూతురు కనిమొళి, డీఎంకే నేత ఎ.రాజా, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, సీనియర్ జర్నలిస్టు బర్ఖా దత్, రతన్ టాటా వంటి వారి పేర్లు ప్రధానంగా ఈ కేసులో వినిపించాయి.

  11. వడ్డీ రేట్లు పెంచిన ఫెడరల్ రిజర్వ్... మరింత పడిపోయిన రూపాయి

    అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచిన తరుణంలో రూపాయి విలువ పడిపోయింది.

    డాలరుతో పోలిస్తే రూపాయి విలువ జీవిత కాల కనిష్టం 80.45ని తాకి ఆ తరువాత కాస్త కోలుకుని 80.25 వద్ద ట్రేడ్ అవుతోంది.

    అమెరికా వడ్డీ రేట్లను 3-3.25శాతం రేంజ్‌కు పెంచుతూ ఫెడరల్ రిజ్వర్ నిర్ణయం తీసుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. హైదరాబాద్: చాంద్రయణగుట్టలోని పీఎఫ్‌ఐ కార్యాలయం సీజ్

    హైదరాబాద్‌లోని చాంద్రయాణగుట్టలో గల పీఎఫ్‌ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు

    ఫొటో సోర్స్, ANI

    హైదరాబాద్‌లోని చాంద్రయణగుట్టలో గల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ప్రధాన కార్యాలయాన్ని ఎన్‌ఐఏ సీజ్ చేసింది.

    మరొకవైపు ఎన్‌ఐఏ దాడులకు నిరసనగా చెన్నైలో పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాల మీద ఎన్ఐఏ దాడులు

    పోలీసుల పహారా

    ఫొటో సోర్స్, ANI

    దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యాలయాల మీద నేషనల్ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఈడీ ఏక కాలంలో దాడులు చేశాయి.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు సుమారు 10 రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.

    100 మందికిపైగా పీఎఫ్ఐ నేతలను అరెస్టు చేశారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో దాడులకు నిరసనగా పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. కేటీఆర్: ‘నేను ఇంత వరకు ఓట్ల కోసం చుక్క మందు పంచలేదు... పైసా డబ్బులు ఇవ్వలేదు’

  15. RRR- ఛెల్లో షో : భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ సినిమా కథ ఏంటి, దీని ముందు ‘RRR' ఎందుకు వెనుకబడింది?

  16. పాకిస్తాన్: అంటువ్యాధుల సంక్షోభంలో చిక్కుకుంటుందా?

  17. వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు - ఎన్నికల సంఘం, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    వైఎస్ జగన్

    ఫొటో సోర్స్, facebook/ysrcpofficial

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ని ఎన్నుకోవడం చెల్లదని తెలిపింది. ఈ మేరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.

    జూలై 8,9 తేదీలలో మంగళగిరి సమీపంలో ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఆ సందర్భంగా రెండో రోజు నిర్వహించిన సమావేశాల్లో పార్టీ రాజ్యాంగం సవరిస్తున్నట్టు తీర్మానం చేశారు. ఆ వెంటనే ఈ ఎన్నిక జరిగింది.

    వైఎస్ జగన్ ని పార్టీ శాశ్వత అధ్యక్ష హోదాలో ఎన్నుకుంటూ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్లీనరీలో ఆమోదించారు. అదే నెల 22న ఈసీకి ఈ వివరాలు తెలియజేశారు. కానీ వివరణ కోరుతూ ఆగష్టు 1, 5, తేదీలలో ఎన్నికల సంఘం లేఖలు రాసినా ఆపార్టీ నుంచి తగిన స్పందన లేదని తెలిపింది. ఆగష్టు 23నాడు పార్టీ తరుపున అందిన లేఖలో అంశాలు చెల్లవని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

    ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కూడా నిర్ధిష్ట కాలపరిమితిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. శాశ్వత అధ్యక్షుడు అన్నది ప్రజాస్వామ్య విరుద్దం అంటూ ప్రస్తావించింది. పార్టీలకు తరచూ ఎన్నికలు జరగాలని తెలిపింది.

    శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఎన్నికల సంఘం నియమాలకు విరుద్దం అని స్పష్టం చేసింది.

    వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న వైసీపీ..

    వైసీపీ నాయకత్వం ఈసీకి తెలియజేసిన అంశాలు ఆసక్తిగా ఉన్నాయి. తమ పార్టీ రాజ్యాంగాన్ని ఫిబ్రవరిలో సవరించినట్టు పేర్కొనడం విశేషం. దానిపై మీడియాలో కథనాలు వచ్చాయని తెలిపినట్టు ఈసీ ప్రస్తావించడం ఆసక్తిగా కనిపిస్తోంది. ఆ కథనాలపై విచారణ చేస్తున్నామని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానమని వైసీపీ పేర్కోన్నట్టు ఈసీలో లేఖలో ఉండడం చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ వాదనను తోసిపుచ్చుతూ ఈసీ స్పష్టత కోరింది.

    పార్టీ అంతర్గత విచారణ చేసి వెంటనే స్పందించాలని కోరింది. త్వరగా దీనిపై స్పష్టతనిస్తూ బహిరంగ ప్రకటన చేయాలని ఆదేశించింది. అస్సష్టత తొలగించేలా చర్యలుండాలని ఎన్నికల సంఘం తెలిపింది.

    శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక అనేది సమంజసం కాదని, ఇలాంటివాటిపై స్పష్టత ఇవ్వకపోతే ఇతర పార్టీల్లో గందరగోళం నెలకొంటుందని, దీనిని మిగతా పార్టీలు కూడా అనుసరించే ప్రమాదం ఉంటుందని పేర్కొంది.

    జగన్ మోహన్ రెడ్డి ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న తీరు మీద సమాధానం కోరినా స్పందించకపోవడం పట్ల ఈసీ సీరియస్ అయ్యింది. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికను అంగీకరించడమా లేదా తిరస్కరించడమా అన్నది తేల్చుకుండా తాత్సార్యం చేయడాన్ని నిలదీసింది. ఈసీ లేఖలోని అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించి, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ పేర్కొనడం గమనార్హం.

  18. రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, మైదానంలో ప్రవర్తన గురించి చర్చ ఎందుకు?

  19. OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్‌లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?

  20. విమెన్ టీ20 ఆసియాకప్‌కు ఎంపికైన తెలుగు అమ్మాయి

    క్రికెటర్ సబ్బినేని మేఘన

    ఫొటో సోర్స్, Kalpana

    ఫొటో క్యాప్షన్, క్రికెటర్ సబ్బినేని మేఘన

    విమెన్ టీ20 ఆసియా కప్‌కు టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన సబ్బినేని మేఘన తుది జట్టులో స్థానం దక్కించుకుంది.

    హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధన(వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగ్యూస్, సబ్బినేని మేఘన, రీచ ఘోష్(వికెట్ కీపర్), స్నేహ రాణ, దయాలన్ హేమలత, మేఘన సింగ్, రేణుక ఠాకుర్, పూజ వస్త్రకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధ యాదవ్, కేపీ నవ్గిరే

    స్టాండ్ బై ప్లేయర్స్: తానియా సప్న భాటియా, సిమ్రన్ దిల్ బహుదూర్

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది