తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
గత 8 ఏళ్లలో 7.22 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఫొటో సోర్స్, Getty Images
గత 8 సంవత్సరాలలో 7.22
లక్షల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లు కేంద్ర సిబ్బంది, శిక్ష వ్యవహారాల
శాఖ తెలిపింది.
ఇదే కాలంలో 22
కోట్ల 5 లక్షల 99 వేల 238 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.
తెలంగాణ కాంగ్రెస్
ప్రెసిడెంట్, లోక్‌సభ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా ప్రభుత్వం ఈ
వివరాలు ఇచ్చింది.
కేంద్ర
ప్రభుత్వంలో 2020 మార్చి 1 నాటికి సుమారు 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
సంవత్సరాల వారీగా
ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు:
2014-15: 1,30,423
2015-16: 1,11,807
2016-17: 1,01,333
2017-18: 76,147
2018-19: 38,100
2019-20: 78,555
2020-21: 38,850
హలో, గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్
తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్
కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
బీఎస్ఎన్ఎల్ ను సంక్షోభం లోంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వ ప్యాకేజీ
ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను
సంక్షోభం నుంచి బయటకు తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ రూ.1,64,156 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు, భారత్
సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్
బీబీఎన్ఎల్ విలీనానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
బీఎస్ఎన్ఎల్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం 2019లో కూడా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సమాచారాన్ని తెలిపినట్లుపీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
మంగళవారం ప్రారంభమైన 5జీ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి.. ఇప్పటివరకు
దాదాపు రూ.1.49 లక్షల కోట్ల బిడ్లు వచ్చినట్లు అశ్విని
వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం తొమ్మిదో రౌండ్ బిడ్డింగ్ జరుగుతోంది.
‘కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆడడం మొదటిసారే అయినా ఆందోళనేమీ లేదు’ - స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్
మధ్యప్రదేశ్: చెట్టుకు వేలాడుతూ కనిపించిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృత దేహాలు
ఫొటో సోర్స్, ANI
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో చెట్టుకు వేలాడుతూ ముగ్గురు
అక్కాచెల్లెళ్ల మృతదేహాలు కనిపించాయి. వీరు గిరిజనులు.
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో భామ్‌గఢ్ గ్రామ సమీపంలోని కోట
ఫాల్యాలోని చెట్టుకు మృతదేహాలు వేలాడుతూ కనిపించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది హృదయ విదారక సంఘటన అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్
అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
"గ్రామస్థులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు" అని ఖాండ్వా పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సింగ్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ
పేర్కొంది.
ఈ అక్క చెల్లెళ్ళ వయస్సు 23, 21, 19 సంవత్సరాలని తెలిపారు.
"ఈ అమ్మాయిలు గ్రామంలో తమ తల్లితో కలిసి నివసిస్తున్నారు, వారి తండ్రి నాలుగేళ్ల క్రితం చనిపోయారు" అని వివేక్ సింగ్ చెప్పారు.
ప్రస్తుతం తల్లితో పాటు మరో ఇద్దరు అక్క చెల్లెల్లు, ముగ్గురు సోదరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు
అనుమానిస్తున్నామని, పూర్తి
విచారణ జరిపిన తర్వాత కచ్చితమైన కారణాలను తెలుసుకుంటామని ఎస్పీ వివేక్ సింగ్
తెలిపారు.
విచారణ, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఈ మరణాలకు కారణం తెలుస్తుందని
భావిస్తున్నారు.
బ్రెజిల్ చమురు బ్లాక్ లో 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఆమోదం తెలిపిన భారత్
బ్రెజిల్‌లోని బీఎం -సీల్ - 11 ప్రాజెక్టులో భారత్ పెట్రో రిసోర్సెస్ లిమిటెడ్ (బిపిఆర్‌ఎల్) 1.6 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని పెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఇది ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) అనుబంధ సంస్థ.
ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. విదేశాంగ
మంత్రి ఎస్ జైశంకర్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఇది భారతదేశ ఇంధన భద్రతను మరింత పటిష్టం చేస్తుందని, బ్రెజిల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కూడా బలోపేతం చేస్తుందని జైశంకర్
అన్నారు.
BM-సీల్-11 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో2026-27 నుండి ఉత్పత్తి
ప్రారంభమవుతుంది.
ఈ బ్లాక్‌లో బీపీఆర్ ఎల్ కు40 శాతం వాటా ఉండగా,మిగిలిన 60 శాతం వాటా బ్రెజిల్ జాతీయ చమురు కంపెనీ
పెట్రోబ్రాస్ కు ఉంది.
ఈ బ్లాక్‌లో ఇప్పటివరకు చమురు కోసం చాలా తవ్వకాలు జరిగినట్లు
తెలిపారు. ఈ తవ్వకాలను మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు.
విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతయ్యారనుకున్న వివాహిత నెల్లూరులో ఉన్నారంటున్న అధికారులు
ఫొటో సోర్స్, Getty Images
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తప్పిపోయిన
వివాహిత సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని విశాఖ నగర పాలక సంస్థ
డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తెలిపారు.
గత 36 గంటలుగా ఆమె కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.
సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు ఆమె
బంధువులు గుర్తించారు. ప్రేమికుడితో కలిసి వెళ్లినట్లు బంధువులు
చెబుతున్నారు. ఈ విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
సాయిప్రియకు 2020 జూలై 25న శ్రీనివాస్ అనే
వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, నాలుగు నెలల క్రితం
కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చారు. జులై 25 సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్‌కి వెళ్లిన
సాయి ప్రియ అక్కడి నుంచి కనిపించలేదు. శ్రీనివాస్
తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు హెలికాప్టర్లతో గాలింపు
చర్యలు చేపట్టారు.
వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ
తీవ్రంగా శ్రమించాయని జియ్యాని శ్రీధర్ తెలిపారు.
ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో
ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని
వివరించారు.
కర్నాటక: బీజేపీ నాయకుడి హత్య.. అసలేం జరిగింది?
‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
మమతా బెనర్జీ: ‘బెంగాల్‌ను కూలగొట్టాలంటే ముందుగా బీజేపీ, రాయల్ బెంగాల్ టైగర్‌తో పోరాడాలి’
ఫొటో సోర్స్, Getty Images
బీజేపీకి పనేం లేదని, రాష్ట్ర
ప్రభుత్వాలను వేధించడమే వారి పని అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
అన్నారు.
‘‘మొదట మహారాష్ట్రను అస్థిరపరిచారు.
ఇప్పుడు జార్ఖండ్‌పై వారి దృష్టి ఉంది. కానీ, బీజేపీని బెంగాల్ ఓడించింది. బెంగాల్‌ను
కూలగొట్టడం అంత సులభం కాదు. ఎందుకంటే, వారు ఆ పని చేయాలంటే ముందుగా రాయల్ బెంగాల్
టైగర్‌తో పోరాడాలి’’ అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
మమతా బెనర్జీ నేతృత్వంలో మంత్రిగా ఉన్న పార్థ చటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది.
స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది.
‘ఆయన లేరు.. పిల్లలను ఎలా పోషించాలి?’ - రూ. 20 నాటు సారా 39 మంది ప్రాణాలు తీసింది
టెంపెస్ట్: పైలట్ మెదడును చదివేసే విమానం
బిహార్: పిడుగుపాటుతో 20 మంది మృతి
ఫొటో సోర్స్, Getty Images
బిహార్‌లోని 8 జిల్లాల్లో గత 24
గంటల్లో పిడుగుపాటు కారణంగా 20 మంది మృత్యువాత పడ్డారు.
బుధ, గురువారాల్లో కూడా రాష్ట్రంలో
మరింత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
పడే అవకాశముందని వాతావారణ శాఖ చెబుతోంది.
రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచనలను
ప్రజలంతా పాటించాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోరారు.
మరణించిన ప్రతీ ఒక్కరి కుటుంబాలకు ఆయన
మంగళవారం రూ. 40,000 పరిహారాన్ని ప్రకటించారు.
వర్షాకాలంలో పిడుగుల కారణంగా భారత్‌లో
ప్రతీ ఏటా వందలాది మంది మరణిస్తున్నారు.
మంకీపాక్స్ సోకకుండా వ్యాక్సీన్లు ఉన్నాయా... ప్రస్తుతం చికిత్సకు వాడుతున్న మందులేంటి?
ఫొటో సోర్స్, Getty Images
ఇంతకు ముందెప్పుడూ కనిపించని దేశాలలో కూడా ఈ ఏడాది మే నెల నుంచి మంకీపాక్స్ వైరస్ కనిపిస్తోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం జూలై 23 నాటికి, 75 దేశాలలో 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా అయిదుగురు మరణించారు.
మశూచి (స్మాల్‌పాక్స్) లాగే మంకీపాక్స్ కూడా కుటుంబంలో ఒకరికి వస్తే మిగతా వారికి కూడా సోకే అవకాశం ఉంటుందని, అయితే అది వ్యాప్తి చెందే తీవ్రత చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు.
వ్యాధి లక్షణాలు ఉన్నవారిని వేరుగా ఉంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ లాంటి విధానాల ద్వారా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక
అధ్యక్షురాలు సోనియా గాంధీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 6 గంటల
పాటు విచారించింది.
దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈరోజు మూడో
విడత విచారణ జరిగింది.
సోనియాగాంధీపై ఈడీ విచారణకు
వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశాయి.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్
గెహ్లాట్, గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ బుధవారం విలేఖరుల సమావేశం
ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఏపీజే అబ్దుల్ కలాం: ఈ మిసైల్ మ్యాన్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకంటారు?, రేహాన్ ఫజల్, బీబీసీ ప్రతినిధి
ఫొటో సోర్స్, AFP
భారత ప్రజల అత్యంత ప్రియమైన రాష్ట్రపతిగా మన్ననలందుకున్న ఏపీజే అబ్దుల్ కలాం 1931లో అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు.
భారత మాజీ ప్రధాని ఇందర్‌కుమార్ గుజ్రాల్ తన ప్రభుత్వం పడిపోకపోయినా, బలహీన ప్రధాని అని బీజేపీతో పదేపదే అనిపించుకుని విసిగి పోయి, దేశభద్రతకు తాను ఎంత ప్రాధాన్యమిస్తానో నిరూపించుకోవాలని భావించారు.
అందులో భాగంగానే మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాంకు భారతరత్నను ప్రదానం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 1952లో సి.వి.రామన్ తర్వాత మరో సైంటిస్టును ఈ అవార్డు వరించలేదు.
1998 మార్చి1న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారతరత్న అవార్డు ప్రదానం కార్యక్రమంలో అబ్దుల్ కలాం భయపడుతూ కనిపించారు. ఆయన తన నీలి రంగు టైని పదేపదే తాకుతూ ఉన్నారు.