తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
50 ఏళ్లుగా భారత్ లో ఉంటున్నా, ప్రపంచంలో ఏ దేశానికీ చెందని మహిళ ఈమె
మీరాబాయి చాను: నాడు వెదురుకర్రతో వెయిట్ లిఫ్టింగ్ చేసింది, నేడు రికార్డులు బద్ధలు చేస్తూ గోల్డ్ సాధించింది
కామన్వెల్త్ గేమ్స్‌లో 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. స్నాచ్ రౌండ్ తర్వాత చాను 12 కిలోల భారీ ఆధిక్యం సాధించింది.
ఈసారి చాను మొదటి నుంచి పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ఆమె మొత్తం 201 కిలోల బరువులను ఎత్తింది. స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలను ఎత్తగలిగింది. ఈ విభాగంలో రికార్డు కూడా సృష్టించింది మీరాబాయి.
తొలి ప్రయత్నంలోనే 84 కిలోల బరువును ఎత్తిన చాను, రెండో ప్రయత్నంలో 88 కేజీలతో వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును సమం చేసింది.
అర్జంటుగా రక్తం కావాలి, దాతలు దొరక్కపోతే ఏం చేయాలి, డబ్బులిచ్చి కొనుక్కోవచ్చా
శివసేన నేత సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడులు

ఫొటో సోర్స్, Twitter/Sanjay Raut
ఫొటో క్యాప్షన్, సంజయ్ రౌత్ ముంబైలోని ములుంద్‌లో శివసేన నేత సంజయ్ రౌత్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం ఆదివారం ఉదయం దాడులు చేసింది.
ఆయనపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపినట్టు పీటీఐ వెల్లడించింది.
'పత్రా చాల్ ల్యాండ్ భూమి' కేసులో ఈడీ చర్యలు తీసుకుంటోందని ఏఎన్ఐ తెలిపింది.
సంజయ్ రౌత్‌కు మద్దతుగా శివ్ సైనికులు ఆయన ఇంటి బయట గుమికూడి నినాదాలు చేశారు.
ఈడీ చర్యలను స్వాగతిస్తున్నామని బీజేపీ నేత కిరీట్ సోమయ్య అన్నారు.
మరో వైపు, తాను నిర్దోషినని, తన పోరాటం కొనసాగుతుందని, మహారాష్ట్ర, శివసేన మధ్య పోరు కొనసాగుతోందని చెబుతే సంజయ్ రౌత్ వరుస ట్వీట్లు చేశారు.
భారత్‌లో మతపరమైన ఆచారాలు పర్యావరణ పరిరక్షణకు ఎలా ఉపయోగపడుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో మొక్కలను, వృక్షాలను పూజించే సంప్రదాయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్లాలమ్మ గుడిలో అమ్మవారికి పూలు, పళ్లు నైవేద్యంగా సమర్పించేందుకు ఆన్యం శ్రీదేవి భర్తతో కలిసి వెళ్లారు. పక్షుల కిలకిలా రావాలు, చల్లని గాలి, భారీ వృక్షాలు, ప్రవహించే నీటి గల గలలతో ఆ అడవి వారికి స్వాగతం పలికింది.
"పిల్లలు లేని వారిక్కడకు వస్తే పిల్లలు పుడతారని చాలామంది నమ్ముతారు" అని శ్రీదేవి భర్త ఆన్యం రాంబాబు చెప్పారు. ఆయన ఈ గుడికి తరచుగా వస్తూ ఉంటారు.
ఈ గుడిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ప్రశాంత వదనంతో ఆసీనురాలైన చిన్న దేవతా విగ్రహం ఉంది. అమ్మవారికి పూలు, పళ్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరుతాయని ఇక్కడికొచ్చే భక్తులు నమ్ముతారు. పల్లాలమ్మ దేవి ప్రకృతికి దగ్గరగా ఉండటంతో ఆమెను ప్రకృతి దేవత అని కూడా పిలుస్తారు.
కామన్వెల్త్ గేమ్స్ 2022: ఇప్పటివరకు భారత్‌కు నాలుగు పతకాలు.. అన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లోనే

ఫొటో సోర్స్, Getty Images, ANI, Reuters
సంకేత్ సర్గర్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి మొదటి పతకాన్ని అందించాడు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 55 కిలోల విభాగంలో మొత్తం 248 కిలోలు ఎత్తి రజత్ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
తరువాత వెయిట్ లిఫ్టింగ్ లోనే గురురాజ్ పూజారి 61 కేజీల విభాగంలో మొత్తం 269 కేజీలు ఎత్తి కాంస్య పతకాన్ని సాధించాడు. భారత్‌కు ఇది రెండో పతకం.
వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 49 కిలోల విభాగంలో మొత్తం 201 కిలోలు ఎత్తి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇది భారత్‌కు మూడో పతకం. తొలి బంగారు పతకం కూడా.
స్నాచ్ రౌండ్ తరువాత చాను 12 కిలోల భారీ ఆధిక్యం సాధించింది. స్నాచ్‌లో 88 కిలోలు ఎత్తింది. క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలు ఎత్తి రికార్డు సృష్టించింది. ఈ విభాగంలో స్నాచ్ గేమ్స్ రికార్డు కూడా ఇదే.
వెయిట్ లిఫ్టర్ బిందియారాణి దేశానికి నాలుగో పతకం అందించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో మొత్తం 202 కిలోలు ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
కామన్వెల్త్ గేమ్స్ 2022: భారత వెయిట్ లిఫ్టర్ బిందియారాణి దేవికి రజత పతకం

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, బిందియారాణి 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ బిందియారాణి దేశానికి నాలుగో పతకం అందించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో మొత్తం 202 కిలోలు ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
బిందియారాణి స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు సృష్టించింది.
నైజీరియాకు చెందిన ఆదిజత్ ఒలారినోయ్ బిందియారాణి కంటే కేవలం ఒక కేజీ బరువు ఎక్కువ ఎత్తి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
బిందియారాణి దేవి మణిపూర్‌లోని ఓ రైతు కుటుంబంలో జన్మించింది. పతకం సాధించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, "ఇది నా తొలి కామన్వెల్త్ గేమ్స్. రికార్డుతో పాటు రజతం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 2008 నుంచి 2012 వరకు టైక్వాండో ఆడాను. కానీ, నా ఎత్తు వలన సమస్య రావడంతో వెయిట్ లిఫ్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. వెయిట్ లిఫ్టింగ్‌కు నా ఎత్తు అనువైనదని అందరూ చెప్పారు" అని చెప్పింది.
కామన్వెల్త్ గేమ్స్ 2022: స్మృతి మంధాన అజేయ అర్ధసెంచరీ, పాక్‌పై భారత్ ఘన విజయం
మీరాబాయి చాను: నాడు వెదురుకర్రతో వెయిట్ లిఫ్టింగ్ చేసింది, నేడు రికార్డులు బద్ధలు చేస్తూ గోల్డ్ సాధించింది
భారత్‌లో మతపరమైన ఆచారాలు పర్యావరణ పరిరక్షణకు ఎలా ఉపయోగపడుతున్నాయి?
తల్లిని కాల్చి చంపిన తండ్రిని శిక్షించాలంటూ రక్తంతో లేఖ రాసిన కూతుళ్లు.. ఆరేళ్ల తర్వాత జీవిత ఖైదు విధించిన కోర్టు
కేరళ లాటరీ: అప్పుల బాధలు తట్టుకోలేక ఇల్లు అమ్మేస్తుంటే కోటి రూపాయల లాటరీ తగిలింది..
బ్రిటన్‌లో ఆకలి కేకలు: ‘నేను భోజనం మానేస్తేనే నా రెండేళ్ల కూతురు కడుపునిండా తినగలదు’
పాకిస్తాన్‌లో పంజాబ్ రాజకీయ సంక్షోభం.. కోల్పోయిన అధికారాన్ని మళ్లీ పొందిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరంలో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర మందిరం, ఇతర విశేషాలు..
బీజీఎంఐ: పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా మారిన ఈ గేమ్‌ను భారత్ ఎందుకు బ్లాక్ చేసింది?
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా?
ఒబేసిటీ: భారతదేశపు చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయులు, కారణాలు ఇవే
ఓఆర్ఎస్: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా
