You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత ముస్లింలు హజ్ యాత్రకు రావచ్చునన్న సౌదీ అరేబియా.. ఇండియా కోటా 79,237 మంది

హజ్ యాత్రికులు ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం, కోవిడ్ వ్యాక్సిన్లు రెండూ తీసుకోవటం తప్పనిసరి అని సౌదీ అరేబియా ప్రభుత్వం చెప్పినట్లు అధికారులు తెలిపారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ & పృథ్వీరాజ్

  1. ప్రతిరోజూ పాములు ఇంటికి ఎందుకు వస్తున్నాయి?

    అక్కడ వన్య ప్రాణులు జనావాసాల్లోకి రావడం ప్రతి రోజూ కామనైపోయింది. పాములు, మొసల్లు తరచూ ఇళ్లలోకి వస్తున్నాయి. ఎందుకిలా? ఎక్కడ ఆ ప్రాంతం?

  2. జమ్మూ కశ్మీర్‌లో సీఐఎస్‌ఎఫ్ బస్సు మీద ‘ఉగ్రవాదుల’ దాడి ఒకరు మృతి

    జమ్మూ కశ్మీర్‌లో 15 మంది సీఐఎస్‌ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఒకరు మరణించగా ఇద్దరు గాయపడ్డారని సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి తెలిపారు.

    జమ్మూలోని చద్దా క్యాంప్ వద్ద శుక్రవారం వేకువ జామున ఈ ఘటన జరిగినట్లు వారు వెల్లడించారు.

    ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టే క్రమంలో సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు చనిపోయారని వివరించారు.

  3. జమ్మూ కశ్మీర్: ఎన్‌కౌంటర్‌లో నలుగురు ‘ఉగ్రవాదులు’ మృతి

    జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో లష్కర్-ఎ-తయిబాకు చెందిన టాప్ కమాండర్ యూసుఫ్ కంత్రూ కూడా ఉన్నట్లు వెల్లడించారు.

    మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదుల జాబితాలో యూసుఫ్ కంత్రూ ఉన్నట్లు పోలీసులు వివరించారు.

    తమకు అందిన సమాచారం మేరకు బారాముల్లా జిల్లాలోని మాల్వా ప్రాంతంలో పోలీసులు శోధాలు చేపట్టారు. అనుమానిత ప్రాంతానికి చేరుకోవగానే ఉగ్రవాదులు తమపై కాల్పులు మొదలుపెట్టారని పోలీసులు తెలిపారు.

    వారు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులకు చిన్నపాటి గాయాలు అయ్యాయని జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

  4. జెలియెన్‌స్కీ: ‘యుక్రెయిన్ నిలబడాలంటే నెలకు 7 బిలియన్ డాలర్ల సాయం కావాలి’

    యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యా, అంతర్జాతీయ ఆహార సరఫరాకు ముప్పుగా పరిణమిస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ అన్నారు.

    వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన ఆయన, యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న తమకు నెలకు 7 బిలియన్ డాలర్లు సాయం కావాలని విజ్ఞప్తి చేశారు.

    బ్లాక్ సీ పోర్టు వంటి వాటిని రష్యా నిర్బంధించడం వల్ల తాము గోధుమలు వంటి వాటిని ఎగుమతి చేయలేక పోతున్నామని జెలియెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.

  5. ‘రష్యా బలగాల కమాండింగ్ ఇప్పుడు బాగా మెరుగుపడింది’, పాల్ ఆడమ్స్, డిప్లొమాటిక్ కరస్పాండెంట్

    యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యాకు ఈ యుద్ధంలో గెలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయని పశ్చిమ దేశాల అధికారులు చెబుతున్నారు.

    యుద్ధం తొలి నాళ్లలో ఎదురైన దెబ్బల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు.

    రష్యా బలగాలపై నియంత్రణ, కమాండింగ్ ఇప్పుడు బాగా మెరుగుపడిందని వారు తెలిపారు.

    అయితే ఇప్పటికీ చిన్నచిన్న రహదారుల్లో వెళ్తున్న భారీ రష్యా సైనిక వాహనాలను యుక్రెయిన్ బలగాలు సులభంగా టార్గెట్ చేయొచ్చని పశ్చిమ దేశాల అధికారులు భావిస్తున్నారు.

  6. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.