సాయి గణేశ్ ఆత్మహత్య: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు హై కోర్టు నోటీసులు
తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది.
సాయిగణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటీషన్‌ను నేడు తెలంగాణ హైకోర్టు విచారించింది.
తదుపరి విచారణను ఈ నెల 29కి హై కోర్టు వాయిదా వేసింది.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రోత్సాహంతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధించడంతో సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నారనేది బీజేపీ ఆరోపణ.
సాయి గణేశ్ మరణం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వివాదంగా మారింది. సాయి గణేశ్ కుటుంబాన్ని బీజేపీ నేతలతో పాటు కేంద్ర మంత్రులు కూడా పరామర్శిస్తున్నారు.
టీఆర్‌ఎస్ నేత, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.