తాలిబాన్ల కంటెంట్‌ను నిషేధించిన ఫేస్‌బుక్
తాలిబాన్లకు సంబంధించిన అన్ని రకాల కంటెంట్‌లను నిషేధించినట్లు ఫేస్‌బుక్ ధృవీకరించింది.
తాలిబాన్‌ను తీవ్రవాద సంస్థగా పరిగణిస్తున్నామని ఫేస్‌బుక్ తెలిపింది.
కాబట్టి తమకు సంబంధించిన అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుండి తాలిబాన్లకు మద్దతు ఇచ్చే మొత్తం కంటెంట్‌ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది.
తాలిబాన్లతో సంబంధం ఉన్న కంటెంట్‌ని పర్యవేక్షించి, తీసివేయడానికి అఫ్గాన్ నిపుణుల ప్రత్యేక బృందం పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.
ఈ విధానం ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌తో సహా తమకు చెందిన అన్ని ఇతర ప్లాట్‌ఫామ్‌లకు వర్తిస్తుందని ఫేస్‌బుక్ గట్టిగా చెప్పింది.
అయితే, తాలిబాన్లు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
తమ యాప్‌లోని అకౌంట్‌లకు తాలిబాన్‌లతో సంబంధం ఉన్నట్టు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఫేస్‌బుక్ బీబీసీకి తెలిపింది.
ట్విటర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా తాలిబాన్ సంబంధిత కంటెంట్‌ని ఎలా అరికట్టాలనేదానిపై చర్చిస్తున్నాయి.