అమెరికా ఎన్నికల ఫలితాలు 2020: ట్రంప్, బైడెన్‌ గెలుపు - ఓటములను నిర్ణయించే రాష్ట్రాలు ఏవి?

దాదాపు అన్ని రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్‌ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. 'మనం విజయపథంలో ఉన్నాం' అని ఇప్పటికే బైడెన్ ప్రకటించగా, 'ఘనమైన గెలుపు వేడుకలకు' సిద్ధమవుతున్నాం' ట్రంప్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. విజేత ఎవరో రాత్రికి తేలిపోతుందా? ఫలితాలు ఆలస్యమవుతాయా?

    అమెరికా ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా అధ్యక్ష పదవికి మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో గెలిచేది ఎవరో తెలియడానికి ఎంత సమయం పడుతుందన్నదే అసలు ప్రశ్న.

    ఫలితాలు రాత్రి వరకూ తేలుతాయా? ఇంకా ఆలస్యమవుతాయా? కౌంటింగ్‌కు సంబంధించిన వ్యవహారాలు కోర్టు దాకా వెళ్లి, కొన్ని రోజుల పాటు వేచిచూడాల్సి వస్తుందా?

    ఇవన్నీ ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్న సందేహాలు.

    ఆ సందేహాలకు సమాధానం కోసం చదవండి:

  2. పామ్ బీచ్‌లో ఓటు వేసిన ప్రథమ మహిళ మెలానియా

    మెలానియా ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా ప్రధమ మహిళ మెలానియా ట్రంప్.. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఓటు వేశారు.

    ఆమె తన భర్త, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో కలిసి ఎందుకు ఓటు వేయలేదని విలేకరులు అడిగారు.

    ‘‘ఇది ఎన్నికల రోజు, కాబట్టి ఇక్కడ ఓటు వేయటానికి, నా పిల్లలను కలవటానికి వచ్చాను’’ అని మెలానియా బదులిచ్చారు.

    ట్రంప్ వారం రోజుల కిందటే ఓటు వేశారు.

    ట్రంప్, మెలానియా దంపతులు ఏడాది కిందట న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు నివాసం మారారు.

    మెలానియా ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

  3. కమలా హారిస్ గెలుపు కోరుతూ తమిళనాడులోని కుగ్రామంలో పూజలు, పరిమళ కృష్ణన్, బీబీసీ తమిళం

    కమలా హారిస్ కోసం పూజలు

    అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలుపు కోరుతూ తమిళనాడులోని ఒక చిన్న గ్రామం తులసేంద్రపురంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    డెమొక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్ కమలా హారిస్ మూలాలు.. చెన్నై నగరానికి 350 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలోనే ఉన్నాయి.

    ఆమె తాత (తల్లికి తండ్రి) పి.వి. గోపాలన్ ఈ గ్రామంలో నివసించేవారు. గోపాలన్ కుటుంబం ఇప్పుడు చెన్నైలో నివసిస్తోంది.

    కమలా హారిస్ ఘన విజయం కోరుతూ గ్రామస్తులు తులసేంద్రపురంలోని ఆలయంలో ధర్మశాస్త విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ దేవుడు పి.వి.గోపాలన్ కులదైవం కూడా.

    ఆయన ఐదేళ్ల వయసులో ఈ ఆలయానికి వచ్చాడని ఆలయ ట్రస్టీలు ఎస్.వి.రమణన్ చెప్తున్నారు. కమల మేనత్త సరళా గోపాలన్ ఇప్పటికీ ప్రతి ఏటా కొన్ని వేల రూపాయలు ఆలయానికి విరాళం పంపిస్తుంటారని కూడా తెలిపారు.

    కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయటమే గ్రామంలోని యువతలో స్ఫూర్తి నింపిందని పూజా నిర్వాహకుల్లో ఒకరైన సుధాకర్ బీబీసీ తమిళంతో మాట్లాడుతూ చెప్పారు.

    ‘‘అమెరికా ఎన్నికల ఫలితాల కోసం మేం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కమల గెలవాలని, మా గ్రామానికి మరింత ప్రతిష్ట తేవాలని మేం కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు.

    కమలా హారిస్ పూర్వీకుల గ్రామం
    ఫొటో క్యాప్షన్, కమలా హారిస్ పూర్వీకుల గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు
    కమలా హారిస్ గెలిచి తమ ఊరి ప్రతిష్టను మరింతగా పెంచాలని ఈ గ్రామస్తులు కోరుతున్నారు
    ఫొటో క్యాప్షన్, కమలా హారిస్ గెలిచి తమ ఊరి ప్రతిష్టను మరింతగా పెంచాలని ఈ గ్రామస్తులు కోరుతున్నారు
  4. ప్రచారం ముగిసినా సోషల్ మీడియాలో ట్రంప్, బైడెన్ జోరు

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోలింగ్‌కు ముందు అమెరికాలో ఎన్నికల ప్రచారానికి, సభలకు తెర పడింది. కానీ అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరూ సోషల్ మీడియాలో తమకే ఓటు వేయాలంటూ జోరు చూపిస్తున్నారు.

    దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో ఒక వీడియో షేర్ చేశారు. అందులో ఆయన డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. దానికి ఓట్.. ఓట్.. ఓట్ అనే కాప్షన్ పెట్టారు.

    జో బైడనెన్ ఒక కాంపైన్ వీడియో ట్వీట్ చేశారు. అందులో బైడెన్-హారిస్ టీషర్టులు వేసుకున్న వారు ఓటు వేయడానికి వెళ్తూ కనిపిస్తున్నారు. ఆ వీడియోతో ఆయన ‘అన్నీ చివరకు దీనితో ముగుస్తాయి’ అని రాశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  5. అమెరికాలో ఎన్నికలు.. ఇండియాలో ట్రెండయిన ‘పనీర్ టిక్కా’ - ఎందుకంటే..., శృతి మీనన్, బీబీసీ రియాలిటీ చెక్

    కమలా హారిస్

    ఫొటో సోర్స్, Getty Images

    ఒకవైపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంటే.. మరోవైపు ఇండియాలో చాలా ప్రాచుర్యం గల భారతీయ వంటకం పనీర్ టిక్కా భారతదేశంలో ట్విటర్‌ టాప్ ట్రెండ్స్‌లో ఒకటయ్యింది.

    డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) సభ్యురాలు, భారతీయ అమెరికన్ అయిన ప్రమీలా జయపాల్.. తమ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌ కోసం ఎన్నికల సందర్భంగా పనీర్ టిక్కా వండాలని నిర్ణయించుకున్నారు.

    కమలా హారిస్ తల్లి భారతదేశంలో పుట్టారు. పనీర్ టిక్కా అంటే తనకు చాలా ఇష్టమని కమలా చెప్పారు.

    అయితే.. ప్రమీలా జయపాల్ తయారు చేసిన పనీర్ టిక్కా భారత ట్విటర్ యూజర్లలో కలకలం రేపింది. ఆ పనీర్ టిక్కాను చూసి కొందరు ఫ్యాక్ట్ చెక్ కూడా చేశారు. సంప్రదాయ పనీర్ టిక్కా పొడిగా ఉంటుందని.. గ్రేవీ ఉండదని ఇంకొందరు చెప్పారు.

    ఇంకొందరు వివిధ రకాల వంటకాలకు పనీర్ టిక్కా పేరు పెట్టి జోకులు పేల్చారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. సెనేట్‌ మీద కూడా డెమోక్రాట్లు పట్టు సాధిస్తారా?

    వ్యోమగామి మార్క్ కెల్లీ, ఫుట్‌బాల్ కోచ్ టామీ ట్యూబర్‌విల్, ట్రక్కర్ కెల్లీ లోఫర్‌లు సెనేట్ స్థానాలకు పోటీపడుతున్న వారిలో ఉన్నారు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, వ్యోమగామి మార్క్ కెల్లీ, ఫుట్‌బాల్ కోచ్ టామీ ట్యూబర్‌విల్, ట్రక్కర్ కెల్లీ లోఫర్‌లు సెనేట్ స్థానాలకు పోటీపడుతున్న వారిలో ఉన్నారు

    అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీపైనే ప్రధానంగా ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైంది. అయితే.. అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) మీద పట్టు కోసం కూడా ఈ ఎన్నికల్లో అంతే తీవ్రమైన పోరాటం జరుగుతోంది.

    కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లో ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల పట్టు ఉంది. దీనిని నిలుపుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. అలాగే మరో సభ సెనేట్‌లో బలం పెంచుకోవాలని భావిస్తున్నారు.

    సెనేట్‌లో ప్రస్తుతం రిపబ్లికన్లకు మూడు సీట్ల ఆధిక్యం ఉంది. ఇప్పుడు 35 మంది సెనెటర్లు ఈ ఎన్నికల బరిలో తలపడుతున్నారు. వారిలో చాలా మంది గెలుపోటముల మధ్య ఊగిసలాడుతున్నారు.

    కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లోనూ డెమొక్రాట్లే బలంగా ఉన్నట్లయితే.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైతే ఆయన ప్రణాళికలను అడ్డుకునే శక్తి ఉంటుంది. బైడెన్ అధ్యక్షుడైతే ఆయన అజెండాను నిరాటంకంగా అమలు చేసే శక్తి కూడా వారికి ఉంటుంది.

    ఈ ఐదు స్థానాలే కీలకం...

    సెనేట్ స్థానాలకు పోటీ చేస్తున్న వారిలో వ్యోమగామి మార్క్ కెల్లీ, ఫుట్‌బాల్ కోచ్ టామీ టుబెర్‌విల్, ట్రక్ డ్రైవర్ కెల్లీ లోఫ్లెర్ కూడా ఉన్నారు.

    కానీ, ఐదు సెనేట్ స్థానాల ఫలితాల కోసం అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఆరిజోనా: ప్రముఖ వ్యోమగామి మార్క్ కెల్లీ, రిపబ్లికన్ మార్థా మెక్‌సలీ 2018లో సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ 2018లో చనిపోవడంతో ఖాలీ యిన ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు.

    సౌత్ కెరోలినా: రిపబ్లికన్ ప్రముఖ నేత, మొదట ట్రంప్ విమర్శకులుగా, తర్వాత ఆయన బలమైన మద్దతుదారుల్లో ఒకరుగా మారిన లిండ్సీ గ్రాహంకు, స్టేట్ డెమాక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జామీ హారిసన్‌నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

    మేన్: ఇక్కడి ప్రస్తుత సెనేటర్, మితవాద రిపబ్లికన్ సెనేటర్లలో ఒకరినైన సుసాన్ కాలిన్స్ ను ఓడించడానికి ఓటర్లు సిద్ధమయ్యారు.

    జార్జియా:ఇక్కడ 1992 నుంచి డెమాక్రాట్లు గెలవలేదు. నాలుగేళ్ల క్రితం అట్లాంటా శివార్లలో హిల్లరీ క్లింటన్ చాలా బాగా పని చేశారు. ఇప్పుడు స్టేట్‌లోని రెండు సెనేట్ స్థానాలను సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

    అలబామా: ఈ ఎన్నిక డెమాక్రాట్ల పట్టున్న స్థానాన్ని ఒడిసిపట్టేందుకు రిపబ్లికన్ పార్టీకి అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. ఇక్కడి సెనేటర్ డెమాక్రాట్ డగ్ జోన్స్, మాజీ అమెరికన్ ఫుట్‌బాల్ కోచ్, ట్రంప్ మద్దతు ఉన్న రిపబ్లికన్ టామీ టుబెర్‌విల్ కంటే 10 శాతం పాయింట్లతో వెనకబడి ఉన్నారు.

  7. ఫొటోలు: ఓటు వేయటానికి బారులు తీరుతున్న అమెరికన్లు

    అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయటానికి అమెరికన్లు మంగళవారం ఉదయం నుంచీ పోలింగ్ బూత్‌ల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.

    దేశవ్యాప్తంగా స్కూళ్లు, లైబ్రరీలు సహా విభిన్న ప్రదేశాల్లో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

    అమెరికా ఎన్నికలు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, పెన్సిల్వేనియాలోని ఆంబ్రిడ్జ్‌లో పోలింగ్ వద్ద ఓటర్లు
    జార్జియాలోని అట్లాంటాలో పోలింగ్ సిబ్బంది ప్రమాణ స్వీకారం

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, జార్జియాలోని అట్లాంటాలో పోలింగ్ సిబ్బంది ప్రమాణ స్వీకారం
    న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ పబ్లిక్ లైబ్రరీ వద్ద సైన్ పోస్టులు సిద్ధం చేస్తున్న పోలింగ్ సిబ్బంది

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ పబ్లిక్ లైబ్రరీ వద్ద సైన్ పోస్టులు సిద్ధం చేస్తున్న పోలింగ్ సిబ్బంది
    మేన్‌లోని వాటర్‌విల్‌లో ఒక పోలింగ్ బూత్ వద్ద సామాజిక దూరం పాటిస్తున్న ఓటర్లు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, మేన్‌లోని వాటర్‌విల్‌లో ఒక పోలింగ్ బూత్ వద్ద సామాజిక దూరం పాటిస్తున్న ఓటర్లు
    కెంటకీలోని లూయిస్‌విల్‌లో బారులు తీరిన ఓటర్లు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కెంటకీలోని లూయిస్‌విల్‌లో బారులు తీరిన ఓటర్లు
  8. స్వింగ్స్ స్టేట్స్: గెలుపు ఎవరిది?

    జో బైడెన్, డోనల్డ్ ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    స్వింగ్ స్టేట్స్, ఎన్నికల ఫలితాలు లెక్కించిన తర్వాత, వచ్చే మరికొన్ని వారాల పాటు మనం వీటి గురించి చాలా వినవచ్చు.

    ఇద్దరిలో ఏ అభ్యర్థి అయినా విజయం సాధించగలిగే అవకాశం ఉందని ఎన్నికల విశ్లేషకులు చెప్పే రాష్ట్రాలను స్వింగ్ లేదా బాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు.

    మిగతా రాష్ట్రాలకు భిన్నంగా, వీటిపై రిపబ్లికన్, లేదా డెమొక్రటిక్ అభ్యర్థికి బలమైన పట్టు ఉంటుంది. 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల రేసులో వైట్ హౌస్‌ను గెలుచుకోవటానికి ఇవి కీలకంగా చెబుతారు.

    ఈ ఏడాది ఫ్లోరిడా, పెన్సిల్వేవియా, మిచిగాన్, విస్కాన్సిన్, నార్త్ కెరోలినా, ఆరిజోనాలను బాటిల్ గ్రౌండ్ స్టేట్స్‌గా పరిగణిస్తున్నారు.

    రియల్ క్లియల్ పాలిటిక్స్ సంస్థ సేకరించిన తాజా సర్వేలు.. బైడెన్‌కు రెండు స్వింగ్ రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని చెబుతున్నాయి. మరో మూడు రాష్ట్రాల్లో ఆయన స్వల్ప ఆధిక్యంలో ఉండగా, ఒక రాష్ట్రంలో మాత్రం ఆయన కంటే ట్రంప్ కాస్త ముందున్నారు.

    ట్రంప్ లోటు సోమవారం నాటికి రెండు శాతం పాయింట్లకే పరిమితం కావడంతో, అక్టోబర్ మధ్య నుంచి ఈ స్వింగ్ స్టేట్ పోల్స్ కఠినంగా మారాయి.

    • ఫ్లోరిడా: బైడెన్ 1.8+ ఆధిక్యం
    • పెన్సిల్వేనియా: బైడెన్ 2.6+ ఆధిక్యం
    • మిచిగాన్: బైడెన్ 5.1+ ఆధిక్యం
    • విస్కాన్సిన్: బైడెన్ 6.7+ ఆధిక్యం
    • నార్త్ కెరోలినా: ట్రంప్ 0.2+ ఆధిక్యం
    • ఆరిజోనా: బైడెన్ 0.9+ ఆధిక్యం
    స్వింగ్ స్టేట్స్
  9. ఫలితాల తర్వాత కనిపించే పతాక శీర్షికలివేనా?, జాన్ సోపెల్, బీబీసీ ఉత్తర అమెరికా ఎడిటర్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఇది అసాధారణంగా, కొన్నిసార్లు కలవరపరిచేలా, కచ్చితంగా ఊహించని (వీరికి కరోనా మహమ్మారి ప్రచారాంశంగా మారింది) ఎన్నికల ప్రచారంగా నిలిచింది.

    ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మనకు మూడు రకాల పతాక శీర్షికలు కనిపించే అవకాశం ఉంది. వాటిలో ఏది జరిగినా నేనంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.

    • బైడెన్ సునాయాస విజయం: సర్వేలు నిజమే అయితే జో బైడెన్ ఆడుతూపాడుతూ విజయం సాధిస్తారు.
    • ట్రంప్‌ షాకింగ్ గెలుపు: 2016 లాగే సర్వేలు తల్లకిందులైతే డోనల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధిస్తారు. పెన్సిల్వేనియా, ఫ్లోరిడా ఫలితాలు ఆయన విజయానికి కీలకం కానున్నాయి.
    • బైడెన్‌కు భారీ విజయం: బైడెన్ గెలవడం కాదు, భారీ విజయం సాధిస్తే, అది 1980లో జిమ్మీకార్టర్ మీద రొనాల్డ్ రీగన్ సాధించిన విజయంతో, లేదంటే 1988లో మైకేల్ డుకాకిస్‌పై జార్జ్ హెచ్‌డబ్ల్యు బుష్ సాధించిన విజయంతో సమానం అవుతుంది.

    ఇద్దరికీ సగం సగం: నెబ్రస్కా తన ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు విభజించడం వల్ల అధ్యక్ష పదవికి కావల్సిన 270 ఓట్ల మ్యాజిక్ నంబర్‌కు బదులు బైడెన్‌కు 269, ట్రంప్‌కు 269 ఓట్లు వస్తే?అలా ముందెప్పుడూ జరగలేదు. జరగకపోవచ్చు కూడా. కానీ, ఇది 2020 కాబట్టి అసాధ్యం కూడా కాదు.

  10. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఓట్లను ఎలా లెక్కిస్తారు... విజేతను ఎలా ప్రకటిస్తారు?

    జో బైడెన్, డోనల్డ్ ట్రంప్

    అమెరికా అధ్యక్షుడంటే మాటలు కాదు. యుద్ధాలు, మహమ్మారులు, వాతావరణంలో మార్పులు.. ఇలా ఏ సంక్షోభం వచ్చినా, దానిపై దేశాల స్పందనను అమెరికా అధ్యక్ష పీఠం ప్రభావితం చేస్తుంది.

    ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది.

    ఈ ఎన్నికల ప్రక్రియపై చాలా కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. బీబీసీ ప్రతినిధులుగా మేం కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుంది, ఎలక్ట్రోరల్ కాలేజీ ఎలా పని చేస్తుంది, ఏ రాష్ట్రం కీలకంగా మారనున్నాయనే విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మీరు మొదటిసారి తెలుసుకోవాలనుకున్నా, ఉన్న అవగాహనను మరింత పెంచుకోవాలని అనుకున్నా ఈ సింపుల్ గైడ్‌ మీకు సహాయపడుతుంది.

  11. అమెరికా అధ్యక్ష పదవికి సమరం షురూ

    అమెరికా ఎన్నికలు

    ఫొటో సోర్స్, Reuters

    అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం పోలింగ్ మొదలైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు (ఈస్ట్రన్ స్టాండర్డ్ టైమ్ ఉదయం 5 గంటలకు) వెర్మాంట్‌ రాష్ట్రంలో తొలి పోలింగ్ ప్రారంభమైంది.

    అమెరికాలో గత కొన్ని దశాబ్దాల చరిత్రలో అత్యంత విభజన పూరితంగా మారినట్లు పరిగణిస్తున్న ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండోసారి గెలవటానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. ట్రంప్‌ను గద్దె దించటానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ తలపడుతున్నారు.

    అయితే.. ముందస్తు ఓటింగ్‌ (ఎర్లీ ఓటింగ్)లో దాదాపు 10 కోట్ల మంది ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఈసారి పోలింగ్ శతాబ్దంలోనే అత్యధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

    ట్రంప్, బైడెన్ ఇద్దరూ తుది దశ ప్రచారంలో కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో గడిపారు.

    ఈ ఎన్నికల్లో జో బైడెన్ ముందంజలో ఉన్నారని.. అయితే కీలక రాష్ట్రాల్లో హోరాహోరీ పోరాటం ఫలితాలను నిర్ణయిస్తాయని దేశవ్యాప్త సర్వేలు చెప్తున్నాయి.

    పోలింగ్ మొదలైన.. వెర్మాంట్ రాష్ట్రం 1992 నుంచీ డెమొక్రటిక్ పార్టీకే ఓటు వేస్తూ వచ్చింది. రాష్ట్రంలోని ప్రతి కౌంటీనీ ఆ పార్టీయే గెలుస్తూ వస్తోంది. అయితే.. 2016లో ఒక కౌంటీని ట్రంప్ గెలుచుకున్నారు.

    ఈ ఎన్నికల్లోనే గవర్నర్లను కూడా ఎన్నుకునే 13 రాష్ట్రాల్లో వెర్మాంట్ కూడా ఉంది.

    సిటింగ్ గవర్నర్ ఫిల్ స్కాట్‌ను రిపబ్లికన్ వాదిగా పరిగణిస్తారు. ఆయనకు మంచి ప్రజామోదం ఉంది. కరోనా మహమ్మారి సమయంలో ఆయన ప్రజామోదం రేటింగ్ 75 శాతానికి పెరిగింది.

    అయితే.. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను స్కాట్ తీవ్రంగా విమర్శిస్తారు. ట్రంప్‌కు తాను ఓటు వేయబోనని కూడా చెప్పారు.

    ఆయన ప్రత్యర్థి డెమొక్రాట్ అభ్యర్థి లెఫ్టినెంట్ గవర్నర్ డేవిడ్ జుకర్మన్.. కనీస వేతనం పెంచాలనే, గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేయాలనే విధానాలకు మద్దతిస్తున్నారు.

    2020 ఎన్నికలకు డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి పోటీలో వెర్మాంట్‌కే చెందిన బెర్నీ సాండర్స్‌కు జుకర్మన్ మద్దతు తెలిపారు.