అమెరికా ఎన్నికల ఫలితాలు 2020: ట్రంప్, బైడెన్‌ గెలుపు - ఓటములను నిర్ణయించే రాష్ట్రాలు ఏవి?

దాదాపు అన్ని రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్‌ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. 'మనం విజయపథంలో ఉన్నాం' అని ఇప్పటికే బైడెన్ ప్రకటించగా, 'ఘనమైన గెలుపు వేడుకలకు' సిద్ధమవుతున్నాం' ట్రంప్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. మూడు రాష్ట్రాల్లో గెలుపు దిశగా ట్రంప్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    మరో మూడు రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. లూసియానా, నెబ్రాస్కా, యూటా రాష్ట్రాల్లో ఆయన గెలుపు దిశగా వెళ్తున్నట్లు ఓటింగ్ సరళి చెబుతోంది.

    2016లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ ట్రంప్ విజయం సాధించారు.

    గత ఐదు అధ్యక్ష ఎన్నికల్లోనూ దక్షిణ రాష్ట్రం లూసియానాలో రిపబ్లికన్లే విజయం సాధించారు. అంతకుముందు రెండుసార్లు బిల్ క్లింటన్ ఇక్కడ గెలిచారు.

    2016లో యూటాలో 46 శాతం ఓట్లతో ట్రంప్ విజయం సాధించారు.

    ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు చీలే అవకాశమున్న రెండు రాష్ట్రాల్లో నెబ్రాస్కా కూడా ఒకటి. అయితే 2016 ఎన్నికల్లో ఐదు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లూ ట్రంప్‌కే వెళ్లాయి.

  2. న్యూమెక్సికోలో విజయం దిశగా బైడెన్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    న్యూమెక్సికోలో జో బైడెన్ ముందంజలో ఉన్నారు.

    ఒకప్పుడు అటూఇటూ చేతులు మారే ఈ రాష్ట్రం ఇటీవల డెమొక్రాట్ల చేతుల్లోకి వెళ్లింది. సరిహద్దుల్లో ఉండే ఈ రాష్ట్రాన్ని 2016లో లాటినో ఓటర్ల సాయంతో హిల్లరీ చేజిక్కించుకున్నారు.

    ఇక్కడ ఐదు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి.

  3. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్ డోనల్డ్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    ట్రంప్ తన ‘బలాన్ని చూపించడానికి’, తన ‘వాదన వినిపించడానికి’ ఈరోజు రాత్రి మాట్లాడబోతున్నారని ఆయన ఎన్నికల ప్రచార బృందంలోని అధికారి ఒకరు అమెరికాలోని మా భాగస్వామి చానల్ అయిన సీబీఎస్‌కు చెప్పారు.

    “అవును, అధ్యక్షుడు ఈ రోజు రాత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అది విజయాన్ని ప్రకటించే ప్రసంగం కాకపోయినా, ఆయన తన వాదన ఏమిటో వినిపిస్తారు” అని ఆ అధికారి అన్నారు.

    ట్రంప్ వైట్ హౌస్‌లోని ఈస్ట్ రూమ్ నుంచి మాట్లాడతారని ఆయన చెప్పారు.

    ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారనే అంచనాలపై డెమొక్రాట్లు మాట్లాడుతూ అదంతా ‘ఎరుపు రంగు ఎండమావి’ అని వ్యాఖ్యానించడంపై రిపబ్లికన్లలో ఒక రకమైన నిస్పృహ తలెత్తిందని రిపబ్లికన్ పార్టీ సీనియర్ సలహాదారులు అంటున్నారు. కొన్ని రాష్ట్రాలలో ట్రంప్ గెలుస్తారంటూ అంచనాలు వేసుకున్న వారు పోస్టల్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకోలేదని, దానివల్ల వారి అంచనాలు తప్పే అవకాశం ఉందని చెబుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా బైడెన్‌కు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

  4. నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఓటింగ్

    అయోవా (6), మోంటానా (3), నెవాడా (6), యూటా (6) లలో ఓటింగ్ దాదాపుగా పూర్తయింది. అయితే, ఈ రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు లేవు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

  5. అలబామాలో ట్రంప్ ముందంజ

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    దక్షిణ రాష్ట్రమైన అలబామాలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఈ రాష్ట్రం ఎప్పటి నుంచో రిపబ్లికన్ల చేతుల్లోనే ఉంది.

    గత 12 అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడ 11 సార్లు రిపబ్లికన్లు గెలిచారు. అలబామాలో తొమ్మిది ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.

  6. నార్త్ డకోటాలో ట్రంప్, కొలరాడోలో బైడెన్ ముందంజ

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    నార్త్ డకోటాలో డోనల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు ఓటింగ్ సరళి చెబుతోంది. ఇది ఎప్పటినుంచో రిపబ్లికన్లకు కంచుకోట. 1940లో ఒకసారి డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి ఎల్.బి.జాన్సన్ ఇక్కడ విజయం సాధించారు.

    మరోవైపు కొలరాడోలో బైడెన్ ముందంజలో ఉన్నారు. ఇది రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య చేతులు మారుతుంటుంది. 2016లో ఇక్కడ హిల్లరీ గెలిచారు. ఇదివరకు ఒబామా కూడా గెలిచారు. అంతకుముందు 40 ఏళ్లపాటు రిపబ్లికన్ల హవా సాగింది.

  7. డెలావేర్‌లో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ గెలుపు

    అమెరికా చరిత్రలోనే తొలిసారిగా, బహిరంగంగా తనను తాను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకున్న ఎల్‌జీబీటీ సభ్యురాలు డెలావేర్‌లో సెనేటర్‌గా ఎన్నికయ్యారు.

    మరోవైపు అమెరికాలో సేవలందిస్తున్న ట్రాన్స్‌జెండర్లలో అత్యున్నత పదవి కూడా సారా మెక్‌బ్రైడ్‌దే అవుతుంది.

    డెమొక్రాట్ అయిన సారా ఒబామా హయాంలో ఇంటెర్న్‌గా పనిచేశారు. డెలావేర్ ఫస్ట్ డిస్ట్రిక్ట్‌కు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    ఎల్‌జీబీటీ హక్కుల కోసం ఆమె బహిరంగంగానే పోరాడుతుంటారు. మానవ హక్కుల కోసమూ ఉద్యమిస్తుంటారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. కనెక్టికట్‌లో బైడెన్, సౌత్ డకోటాలో ట్రంప్ గెలుపు

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    కనెక్టికట్‌లో బైడెన్ ముందంజలో ఉన్నారు. 1993 నుంచి ఇక్కడ డెమొక్రాట్లే విజయం సాధిస్తున్నారు. మరోవైపు సౌత్ డకోటాలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. 1968 నుంచి ఇక్కడ రిపబ్లికన్లదే విజయం.

  9. అర్కాన్సాస్‌లో ట్రంప్, న్యూయార్క్‌లో బైడెన్ ముందంజ

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    అర్కాన్సాస్‌లో ట్రంప్ గెలుస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. 2000 నుంచి ఇది రిపబ్లికన్లకు కంచుకోటగా మారింది.

    మరోవైపు న్యూయార్క్‌లో బైడెన్ ముందంజలో ఉన్నారు.

    మూడు దశాబ్దాల నుంచి ఇది డెమొక్రాట్ల చేతిలోనే ఉంది. అయితే, 2016 ఎన్నికల్లో ఇక్కడ హిల్లరీ చేతిలో ట్రంప్ ఓడిపోయారు.

  10. చాలా రాష్ట్రాల్లో ముగిసిన ఓటింగ్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    అరిజోనా, కొలరాడో, క్యాన్సన్, లూసియానా, మిషిగన్, నెబ్రాస్కా, న్యూమెక్సికో, న్యూయార్క్, నార్త్ డకోటా, సౌత్ డకోటా, టెక్సాస్, విస్కాన్సిన్, వ్యోమింగ్‌లలో పోలింగ్ దాదాపుగా ముగిసింది.

    అరిజోనాలో బైడెన్ గెలిచే అవకాశమున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. అయితే, డెమొక్రాట్ల దృష్టి మాత్రం రెండో పెద్ద రాష్ట్రమైన టెక్సాస్‌పై ఉంది. ఇక్కడ 38 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రం బైడెన్‌కు వెళ్తే.. ట్రంప్ గెలవడం దాదాపుగా అసాధ్యం.

  11. వెస్ట్ వర్జీనియాలో గెలుపు దిశగా ట్రంప్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    వెస్ట్ వర్జీనియాలో గెలుపు దిశగా ట్రంప్ ముందుకు వెళ్తున్నారు.

    2016లోనూ ఇక్కడ ట్రంపే గెలిచారు. గత నాలుగు ఎన్నికల్లోనూ ఇక్కడ రిపబ్లికన్లే గెలుస్తున్నారు.

  12. ఇప్పటివరకు ఏం జరిగింది?

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. అంటే అంచనాల ప్రటకన మొదలైంది. నెలల తరబడి సేకరించిన పోలింగ్ డేటా, ఎగ్జిట్ పోల్స్, ఇప్పటివరకు లెక్కించిన ఓట్ల ఆధారంగా ఈ అంచనాలు వేస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నడుమ జరిగిన ముందస్తు ఓటింగ్ వల్ల ఓట్ల లెక్కింపు రోజుల తరబడి కొనసాగే అవకాశముంది.

    ఫలితాలు అంచనాలకు అనుగుణంగా వస్తున్నాయి. అయితే అప్పుడే ఒక నిర్ధారణకు రాకూడదు. ప్రస్తుతం వెలువడిన అంచనాలు ఏవి?

    ఇండియానా, ఒక్లహామా, కెంటకీ, టెన్నెసీల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు

    వెర్మోంట్, డెలావేర్, మేరీల్యాండ్, మసాచుసెట్స్, న్యూజెర్సీ, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో బైడెన్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి

    2016తో పోలిస్తే అదే ఫలితాలు ఇప్పుడు కూడా పునరావృతం అవుతున్నాయి.

    తర్వాత ఏమిటి? ఎవరు గెలవబోతున్నారో ఇప్పుడే చెప్పలేం.

    ఎడిసన్ రీసెర్చ్ సంస్థ గణాంకాల ఆధారంగా బీబీసీ అంచనాలు వెల్లడిస్తోంది. బీబీసీ, భాగస్వామ్య సంస్థల దగ్గర తగిన సమాచారం లభిస్తేనే అభ్యర్థులు గెలుస్తారని ప్రకటిస్తాం.

    ప్రస్తుతం ఫ్లోరిడాలో అంచనాలను పరిశీలిస్తున్నాం. ఇక్కడ పోటాపోటీగా పోరు సాగుతోంది. ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేం.

  13. టెన్నెసీలో ట్రంప్ గెలుపు

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    టెన్నెసీలో ట్రంప్ గెలుస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.

    బిల్ క్లింటన్ హయాం తర్వాత ఈ రాష్ట్రం డెమొక్రాట్ల నుంచి రిపబ్లికన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. 2016లో ఇక్కడ హిల్లరీ క్లింటన్ కంటే ట్రంప్‌కు 26 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

  14. ఐదు రాష్ట్రాల్లో బైడెన్ ముందంజ

    డెలావర్, మేరీల్యాండ్, మసాచుసెట్స్, న్యూజెర్సీ, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాల్లో జో బైడెన్ గెలుస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.

    మరోవైపు ఒక్లహామాలో ట్రంప్ గెలుస్తున్నట్లు ఓటింగ్ సరళి చెబుతోంది.

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Ge

  15. కెంటకీలో ట్రంప్ ముందంజ

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    కెంటకీలో డోనల్డ్ ట్రంప్ విజయం సాధిస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.

    ఇది రిపబ్లికన్లకు కంచుకోట. అయితే, జిమ్మీ కార్టర్ (1976), బిల్ క్లింటన్ (1992, 1996)లలో ఇక్కడ విజయకేతనం ఎగురవేశారు. కెంటకీలో ఎనిమిది ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి.

  16. వెర్మోంట్‌లో బైడెన్‌కు విజయావకాశం

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    వెర్మోంట్‌లో బైడెన్ విజయం సాధిస్తున్నట్లు ఓటింగ్ సరళి చెబుతోంది. 2016 ఎన్నికల్లో ఇక్కడ హిల్లరీ క్లింటన్ 56 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఇక్కడ మూడు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి.

  17. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అంటే ఏమిటి?

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలో ఎక్కువ ఓట్లు వచ్చినంత మాత్రాన అధ్యక్షులు కాలేరు.

    విజయంలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లే కీలకం. కాంగ్రెస్‌లో ప్రాతినిధ్యం ఆధారంగా ఈ ఓట్లను కేటాయిస్తారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. కాలిఫోర్నియాలో అత్యధికంగా 55 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా.. అలస్కాలో మూడు మాత్రమే ఉన్నాయి.

    ఎన్నికల్లో విజయం సాధించాలంటే 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 270 సాధించాల్సి ఉంటుంది.

    2016లో ట్రంప్‌కు 304 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌కు 227 వచ్చాయి. అయితే, ఓట్ల విషయంలో హిల్లరీకి మాత్రం మూడు మిలియన్ ఓట్లు ఎక్కువే వచ్చాయి.

  18. ఇండియానాలో ట్రంప్ విజయం

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఇండియానాలో ట్రంప్ గెలవబోతున్నట్లు ఓటింగ్ సరళి చెబుతోంది.

    అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ సొంత రాష్ట్రంలో సాధారణంగా రిపబ్లికన్లే విజయం సాధిస్తుంటారు. 2008లో మాత్రం స్వల్ప మెజారిటీతో ఒబామా ఇక్కడ గెలిచారు. రాష్ట్రంలో 11 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి.

  19. జార్జియా రాష్ట్రంలో గెలుపు ట్రంప్‌కు ఎందుకు అంత కీలకం?

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు
    ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    జార్జియాలో ఎవరు గెలుస్తారో ఎప్పుడు తెలుస్తుంది? ఇది ట్రంప్‌కు ఎందుకంత కీలకం?

    2016లో 5 శాతం పాయింట్ల తేడాతో ఇక్కడ డోనల్డ్ ట్రంప్ విజయం సాధించారు. చివరిసారిగా ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన డెమొక్రటిక్ అభ్యర్థి బిల్ క్లింటన్(1992లో).

    2020లో మళ్లీ ఇది డెమొక్రాట్లకు చెందే అవకాశముంది.

    జార్జియాలోని 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు బైడెన్ కంటే ట్రంప్‌కే ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. బైడెన్ గెలవడానికి జార్జియా అంత ముఖ్యమేమీ కాదు.

    జార్జియాలో ఆదివారం ట్రంప్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఎన్నికలను ఆయన కుంగుబాటు, అభివృద్ధిల మధ్య పోరాటంగా అభివర్ణించారంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు..

    పట్టణ ప్రజలు, నల్లజాతీయులు ఇక్కడ బైడెన్‌కు భారీగా ఓట్లు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ట్రంప్ వైపు నిలుస్తున్నారు.

    జార్జియాలో చాలా మంది పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేశారు. 2016 కంటే ఇప్పుడే ఎక్కువ ఓటింగ్ నమోదు అవుతుందని అంచనాలు చెబుతున్నాయి.

    ఇక్కడ ఫలితాలు ఈ రోజు రాత్రికల్లా రావాలి. అయితే పోలింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తమ ఓటు వేసేందుకు 11 గంటలు వరుసలో నిలబడాల్సి వచ్చిందని ఓ కుటుంబం చెబుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

  20. ఇండియానా, కెంటకీల్లో దాదాపుగా ముగిసిన పోలింగ్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలోని ఇండియానా, కెంటకీ రాష్ట్రాల్లో పోలింగ్ దాదాపుగా ముగిసింది.

    కెంటకీలో పెద్దయెత్తున ఓటర్లు బారులు తీరి కనిపించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సొంత రాష్ట్రమైన ఇండియానాలోనూ పోలింగ్ ముగిసింది.

    ఈ రెండు రాష్ట్రాలూ రిపబ్లికన్ పార్టీ కంచుకోటలు. మళ్లీ ఇక్కడ రిపబ్లికన్లే గెలుస్తారని అంచనాలు చెబుతున్నాయి.