అమెరికా ఎన్నికల ఫలితాలు 2020: ట్రంప్, బైడెన్‌ గెలుపు - ఓటములను నిర్ణయించే రాష్ట్రాలు ఏవి?

దాదాపు అన్ని రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్‌ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. 'మనం విజయపథంలో ఉన్నాం' అని ఇప్పటికే బైడెన్ ప్రకటించగా, 'ఘనమైన గెలుపు వేడుకలకు' సిద్ధమవుతున్నాం' ట్రంప్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. 'ప్రమాదకరం, అధికారవాదం': ట్రంప్ ప్రకటనపై డెమాక్రాట్ల స్పందన

    "స్పష్టంగా మేం ఈ ఎన్నికల్లో గెలిచాం" అన్న ట్రంప్ ప్రకటనపై డెమాక్రాట్ నేతలు తీవ్రంగా స్పందించారు.

    న్యూయార్క్ లో మళ్లీ గెలుస్తారని భావిస్తున్న కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకేసియో-కోర్టెజ్ అద్యక్షుడు ట్రంప్ వాదనను "చట్టవిరుద్ధంగా, ప్రమాదకరమైనదిగా, అధికారవాదం"గా వర్ణించారు.

    "ఓట్లు లెక్కించండి, ఫలితాలను గౌరవించండి" అని ఆమె ట్వీట్ చేశారు.

    మిన్నెసోటా హౌస్ ఆఫ్ రెప్రజంటేటివ్స్ ఇల్హాన్ ఒమర్ ట్రంప్‌ను 'ప్రమాదకరమైన మనిషి'గా వర్ణించారు. "మీరు బ్యాలెట్లు లెక్కించకుండా అడ్డుకోలేరు, ఇది నియంతృత్వం కాదు" అని ఆమె ట్వీట్ చేశారు.

    మిన్నెసోటా సెనేటర్ అమీ క్లోబుచర్ దీనిపై ఆచితూచి స్పందించారు. "ఓట్లన్నీ కచ్చితంగా లెక్కించాలి. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం" అని ట్రంప్ ప్రకటనకు కొన్ని నిమిషాల తర్వాత ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. ఇక.. ఇప్పుడేం జరగనుంది?

    అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం జరిగే అవకాశం ఉంది?

    కొన్ని రోజులు వేచి చూడాలి: ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొన్ని రోజుల వరకూ ఫలితాలు తేలకపోవచ్చు. ఎందుకంటే, ఇంకా మిచిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాలలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాల్సి ఉంది.

    లాయర్లు జోక్యం చేసుకోవచ్చు: ఎన్నికల ఫలితాలపై సుప్రీం కోర్టుకు వెళతానని డోనల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అదే జరిగితే, ఫలితాల కోసం కొన్ని వారాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి రావచ్చు.

    అనిశ్చితి వల్ల అశాంతి: ఇప్పటికే అనిశ్చితి తప్పదన్న సంగతి స్పష్టమైంది. అమెరికన్లు చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రజల నుంచి చెప్పుకోదగిన స్థాయిలో నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉందని ఇప్పుడే చెప్పలేం.

    అమెరికా ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

  3. 'ఎన్నికల్లో గెలిచానని ట్రంప్ చెప్పుకోకూడదు'

    అధ్యక్షుడు ట్రంప్ తాను గెలిచానని అప్పుడే నమ్మకంగా చెప్పుకోవడానికి వీల్లేదని బీబీసీ అమెరికా బ్యూరో చీఫ్ పాల్ డనహర్ అన్నారు.

    "ఇప్పటివరకూ ఎన్నికల్లో ఎలాంటి మోసం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కొన్ని లక్షల చట్టబద్ధమైన ఓట్లను ఇంకా లెక్కించలేదు" అని ఆయన ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. ‘ట్రంప్ ప్రసంగం వ్యూహాత్మక తప్పిదం’

    వైట్‌హౌజ్‌లోని అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఈస్ట్ రూమ్ నుంచి మాట్లాడుతూ ట్రంప్ తాను గెల్చినట్లు ప్రకటించుకున్నారు. ఇంకా లక్షలాది బ్యాలెట్లను లెక్కించాల్సి ఉండగా ఆయన అలా మాట్లాడడంపై రిపబ్లికన్లే విచారం వ్యక్తం చేస్తున్నారు.

    ట్రంప్ చేసిన నిరాధార ఆరోపణల మీద కొందరు రిపబ్లికన్లు, కన్సర్వేటివ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

    ట్రంప్ సలహాదారు అయిన న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ, అధ్యక్షుడి మాటలు తప్పుడు వ్యూహం కిందకు వస్తాయని అభిప్రాయపడ్డారు.

    “ఇది వ్యూహాత్మక తప్పిదం. తప్పుడు రాజకీయ నిర్ణయం” అని క్రిస్టీ అన్నారు.

    పెన్సిల్వేనియాకు చెందిన రిపబ్లికన్ మాజీ సెనేటర్ రిక్ సాంటోరమ్ కూడా, “ట్రంప్ వ్యాఖ్యలు విచారకరం. మోసం అన్న పదం ఆయన ఉపయోగించి ఉండాల్సింది కాదు” అని సీఎన్ఎన్‌తో అన్నారు.

    “అవి బాధ్యతారాహిత్యంతో కూడుకున్న వ్యాఖ్యలు” అని ట్రంప్ విమర్శకుడు, కన్సర్వేటివ్ వ్యాఖ్యాత అయిన బెన్ షాపిరీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Reuters

    అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో ఒకవైపు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ హోరాహోరీగా తలపడుతుంటే.. మరోవైపు నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీలో మంగళవారం రాత్రి జరిగిన నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    క్యాపిటల్ హిల్ భవనం వైపుగా వందల మంది ప్రదర్శనగా వెళ్లారు. పలువురు ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. కొందరు బాణసంచా కూడా కాల్చారు. ‘‘మనకు న్యాయం జరగకపోతే.. వారికి శాంతి ఉండదు’’అంటూ వారు నినాదాలు చేశారు.

    చాలావరకు ఈ నిరసనలు ప్రశాంతంగానే జరిగినప్పటికీ.. వైట్‌హౌస్ వెలుపల మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్టు కూడా చేశారు.

    స్మోక్ బాంబ్ లాంటి ఒక పేలుడు పదార్థాన్ని ఒకరు పేల్చారని సీబీఎస్ న్యూస్ రిపోర్టర్ క్రీస్టీనా రుఫినీ ట్వీట్ చేశారు.

    మరోవైపు లాస్ ఏంజెలిస్, కాలిఫోర్నియా, నార్త్ కెరోలినా, పోర్ట్‌ల్యాండ్, ఆరేగాన్, న్యూయార్క్ సిటీలోనూ నిరసనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.

    ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతాయని ముందే ఊహించిన వ్యాపార సముదాయాలు తమ షాప్‌లను ముందే మూసివేశాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ఫలితాలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం: ట్రంప్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    వైట్‌హౌస్ ఈస్ట్ రూమ్‌ నుంచి ప్రజలను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాట్లాడారు.

    మొదటగా తన కుటుంబానికి, తన కోసం ఓట్లు వేయడానికి వచ్చిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

    ‘‘మనం భారీ వేడుకకు సిద్ధమవుతున్నాం. మనం అన్నీ గెలుస్తున్నాం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

    ‘‘మనది మామూలు విజయం కాదు.. ఘన విజయం’’అంటూ ఫ్లోరిడాలో గెలుపు గురించి చెప్పారు.

    పెన్సిల్వేనియాలోనూ తాము ముందంజలో ఉన్నామని చెప్పారు. బైడెన్ కూడా పెన్సిల్వేనియా గురించి ఇలానే చెప్పారు. అయితే, అక్కడ ఎవరు గెలిచేది చెప్పడానికి ఇంకా సమయం పడుతుంది.

    ఇంకా లక్షల కొద్దీ బ్యాలెట్లు లెక్కపెట్టడానికి మిగిలి ఉన్నప్పటికీ తను గెలిచినట్లు ట్రంప్ ప్రకటించేసుకున్నారు.

    ‘‘నిజంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో మనమే విజయం సాధించాం. అయితే కొన్నిచోట్ల మోసం జరిగింది. ఇది మన దేశానికి సిగ్గుచేటు. ఈ ఎన్నికల ఫలితాలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  7. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. : ఇప్పటి దాకా ఏం జరిగింది?

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను చూసేందుకు ఇప్పుడే వచ్చిన వారికి స్వాగతం. ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు.

    కీలకమైన ఫ్లోరిడా సహా ప్రధాన రాష్ట్రాల్లో ఎవరు ముందున్నారో ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. గంటలపాటు హోరాహోరీగా తలపడిన అనంతరం ఫ్లోరిడాలో రిపబ్లికన్ల జెండా ఎగురుతోంది.

    మరికొన్ని కీలక రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా ఓట్ల లెక్కింపు పూర్తికాలేదు. చివరి ఓటు వరకు మొత్తం లెక్కపెట్టాలని రెండు వర్గాల ప్రతినిధులు కోరుతున్నారు.

    • శ్వేతసౌధంలో అధ్యక్షుడిగా కూర్చోవాలంటే 270కు మించి ఎలక్టోరల్ కాలేజి ఓట్లు సంపాదించాలి. ప్రస్తుతం డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు 220 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు 213 ఓట్లు దక్కాయి. అయితే, మరికొన్ని కీలక రాష్ట్రాల ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడికావాల్సి ఉంది.
    • ఇదివరకటి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలు రాలేదు. చాలావరకు 2016నాటి ఫలితాలే పునరావృతం అయ్యాయి.
    • అందరూ ప్రశాంతంగా ఉండాలని బైడెన్ అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఓటునూ లెక్కించాలని ఆయన చెబుతున్నారు. మరోవైపు తను ఘన విజయం సాధించబోతున్నానని, ఓట్లను డెమొక్రాట్లు దోచేయాలని చూస్తున్నారని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ తప్పుదోవ పట్టించేదిగా ఉందని ట్విటర్ పేర్కొంది.
    • అంచనాల్లో చెప్పిన దానికంటే ఫ్లోరిడా సహా దక్షిణ రాష్ట్రాల్లో ట్రంప్ మెరుగ్గా ఫలితాలు సాధించారు. ప్రస్తుతం అందరి కళ్లు మిడ్-వెస్ట్ రాష్ట్రాలపై ఉన్నాయి. సాధారణంగా ఇవి డెమొక్రాట్ల కంచుకోటలు. అయితే 2016లో వీటిని హిల్లరీ చేజార్చుకున్నారు. మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాలను గతంలో ట్రంప్ గెలిచారు. ప్రస్తుతం వాటి ఫలితాలు రావాల్సి ఉంది.
    • మొదట అరిజోనాను బైడెన్ ఖాతాలో వేస్తూ ఫాక్స్ న్యూస్ వార్తలు ప్రచారం చేసింది. అయితే అప్పుడే నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ శ్వేతసౌధం ఆగ్రహం వ్యక్తంచేసింది.
    • నాసా మాజీ వ్యోమగామి మార్క్ కెల్లీ.. అరిజోనాలో రిపబ్లికన్ సెనేటర్, మాజీ వైమానిక దళ అధికారి మార్టా మెక్ సల్లీపై విజయం సాధించారు.
    • సౌత్ కెరోలినాలోని తన స్థానాన్ని ట్రంప్ సన్నిహితుడు, సెనేటర్ లిండ్సీ గ్రాహం పదిలం చేసుకున్నారు.
    • న్యూజెర్సీలో గంజాయిని చట్టబద్ధం చేయాలని కోరుతూ పెద్దయెత్తున ఓటర్లు ఓటింగ్ పాల్గొన్నారని ఏపీ రిజల్ట్స్ తెలిపింది.
  8. వైట్ హౌస్ ‌నుంచి కాసేపట్లో మాట్లాడబోతున్న ట్రంప్

    ట్రంప్ ఏం మాట్లాడతారన్నది ఇంకా స్పష్టం కాలేదు. కానీ, ఇప్పటికే ఆయన ట్వటర్లో తన ‘ఘన విజయాన్ని’ ప్రకటించుకున్నారు.

    ఎన్నికల నిర్దుష్టత మీద ట్రంప్ గతంలోనే సందేహాలు వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన పోస్టల్ బ్యాలెట్లలో అక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆరోపించారు.

    ఎన్నికల రోజు రాత్రి ఆయన బ్యాలట్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్‘తప్పుదారి’ పట్టించేలా ఉందనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

    ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

  9. మిన్నెసోటాలో గెలుపు దిశగా బైడెన్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    మిన్నెసోటాలో గెలుపు దిశగా బైడెన్ ముందుకు వెళ్తున్నారు.

    మొదట్నుంచీ ఈ రాష్ట్రం డెమొక్రాట్లకు కంచుకోటే. 1972 మినహా గత 60ఏళ్లలో ఇక్కడ ప్రతిసారీ డెమొక్రటిక్ ప్రతినిధులే విజయం సాధిస్తూ వచ్చారు.

  10. స్వల్ప ఆధిక్యంలో బైడెన్

    అమెరికా ఎన్నికలు
  11. టెక్సాస్‌లో విజయం దిశగా ట్రంప్

    టెక్సాస్‌లో ట్రంప్ గెలుపు దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కాలిఫోర్నియా(55) తర్వాత ఎక్కువ సీట్లు ఉండేది టెక్సాస్(38) లోనే.

    గత పది ఎన్నికల్లోనూ టెక్సాస్‌లో రిపబ్లికన్లే విజయం సాధించారు. 2016లోనూ ఇక్కడ ట్రంపే గెలిచారు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

  12. ఇద్దరు నేతలూ 200 మార్క్ దాటారు

    మొత్తం 50 రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 39 రాష్ట్రాల నుంచి అందిన ఫలితాల సమాచారం ప్రకారం ట్రంప్, బైడెన్‌ల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది.

    ఇద్దరు నేతలూ డబుల్ సెంచరీ దాటారు. ట్రంప్ 213 ఎలక్టోరల్ కాలేజి ఓట్లలో గెలుపు దిశలో ఉండగా, బైడెన్ 210 స్థానాల్లో గెలవబోతున్నారని ఫలితాలు సూచిస్తున్నాయి.

    అమెరికా ఎన్నికలు
  13. ట్రంప్ ట్వీట్‌పై ట్విటర్ హెచ్చరిక

    అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను ఎన్నికలను తప్పుదోవ పట్టించేదిగా ట్విటర్ పేర్కొంది. అందరూ ఎన్నికలపై విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలని సూచించింది.

    ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు సహనంతో ఉండాలని డెలావేర్ వేదికగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రసంగించిన కొద్దిసేపటికే ట్రంప్ ట్వీట్‌చేశారు.

    ‘‘మనకు మంచి ఫలితాలు వచ్చాయి. అయితే, వారు ఓట్లను అక్రమంగా కొల్లగొట్టాలని భావిస్తున్నారు. మేం అలా జరగనివ్వం. ఓటింగ్ సమయం పూర్తయ్యాక ఓట్లు వేసేందుకూ అనుమతించం’’ అని ఆయన ట్వీట్ చేశారు.

    ఓట్లను దొంగిలించడం, కొల్లగొట్టడం లాంటి పదాలను అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఉపయోగించారు.

    మరోవైపు త్వరలో తను ప్రకటన చేస్తానని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. మనం గెలుపు దిశగా వెళ్తున్నాం: బైడెన్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    అభిమానుల కార్ల హారన్ శబ్దాల నడుమ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ప్రసంగించారు. ఆయన పక్కనే ఆయన సతీమణి జిల్ బైడెన్ ఉన్నారు.

    ‘‘గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు. పరిణామాలు మనకు చాలా సానుకూలంగా ఉన్నాయి’’.

    ‘‘దీనికి చాలా సమయం పడుతుందని మనకు ముందే తెలుసు. కానీ మరీ రేపు ఉదయం వరకు లేదా ఇంకా ఆలస్యం కావచ్చని అనుకోలేదు’’.

    ‘‘నాకు చాలా బాగా అనిపిస్తోంది. నేడు మనం గెలుపు దిశగా పయనిస్తున్నాం’’.

    ‘‘ప్రతి ఓటునూ లెక్కించేంత వరకు ఇది పూర్తికాదు’’అని బైడెన్ వ్యాఖ్యానించారు.

  15. ఒహాయోలో ట్రంప్, వర్జీనియాలో బైడెన్ ఆధిక్యం

    ఒహాయో, ఐడహోలలో ట్రంప్ విజయం దిశగా ముందుకు వెళ్తున్నారు. హోరాహోరీగా పోటీ ఉండే రాష్ట్రాల్లో ఒహాయో ఒకటి. గత 200 ఏళ్లుగా ఇక్కడ గెలిచేవారు అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలుస్తుంటారు. 2016లోనే అదే జరిగింది. ఇక్కడ 18 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.

    మరోవైపు గత 13 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఐడహోలో రిపబ్లికన్లే గెలిచారు.

    వర్జీనియాలో విజయానికి బైడెన్ చేరువలో ఉన్నారు.

    సాధారణంగా ఇక్కడ రిపబ్లికన్లు గెలుస్తుంటారు. అయితే గత మూడు ఎన్నికల్లో ఇక్కడ డెమొక్రాట్లే గెలుస్తూ వస్తున్నారు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

  16. ట్రంప్ ఖాతాలోకి ఫ్లోరిడా

    ఫ్లోరిడాలో విజయం దిశగా ట్రంప్ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ పోటీ హోరాహోరీగా సాగుతోంది.

    29 ఎలక్టోరల్ కాలేజి ఓట్లు కలిగిన ఈ రాష్ట్రం అధ్యక్ష ఎన్నికల్లో చాలా కీలకమైనది.

    2000లో ఫ్లోరిడాలో కేవలం 537 ఓట్ల తేడాతో గెలిచి జార్జ్ డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షుడు కాగలిగారు. గత ఎన్నికల్లో ఇక్కడ ట్రంప్ గెలిచారు. అయితే అంతకుముందు రెండుసార్లు ఒబామా గెలిచారు.

  17. డెలావేర్‌లో ప్రసంగించనున్న బైడెన్

    మరికొన్ని నిమిషాల్లో డెలావేర్‌లోని డౌన్‌టౌన్ విల్మింగ్‌టన్ నుంచి డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ప్రసంగం ఇవ్వనున్నారు.

    కొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు ఇంకా అటూఇటూగా ఉన్న తరుణంలో ఆయన విజయాన్ని లేదా ఓటమిని అంగీకరించడం లాంటివేమీ ఉండవు.

    మరోవైపు ట్రంప్ కూడా ఈ రోజు రాత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వైట్‌హౌస్‌లో 400 మంది అతిథులకు ఆయన పార్టీ కూడా ఇస్తున్నారు.

    అమెరికా ఎన్నికలు
  18. బైడెన్ 205, ట్రంప్ 136 ఎలక్టోరల్ కాలేజి ఓట్లలో ఆధిక్యం, పోరు హోరాహోరీగా సాగుతోంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్‌లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నట్లు ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.

    పోరు హోరాహోరీగా సాగుతోంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్‌లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నట్లు ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం జో బైడెన్ 205, ట్రంప్ 114 ఎలక్టోరల్ కాలేజి ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అధ్యక్ష పదవి చేపట్టడానికి గెల్చుకోవాల్సిన మ్యాజిక్ ఫిగర్ 270.

    అయితే, కొన్ని కీలక రాష్ట్రాల్లో గెలుపు ఎవరిదన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితులున్నాయి. అక్కడ పోటీ ఇరు అభ్యర్థుల మధ్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా, మధ్య-పశ్చిమ రాష్ట్రాలలో ఎవరు గెలుస్తారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది.

    ప్రస్తుత అంచనాల ప్రకారం జో బైడెన్ 14 రాష్ట్రాలలో గెలవబోతున్నారు. వాషింగ్టన్ డీసీతో పాటు ఆయన న్యూయార్క్, న్యూజెర్సీ, కొలరాడో, న్యూ మెక్సికో వంటి రాష్ట్రాల్లో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.

    డోనల్డ్ ట్రంప్ 17 రాష్ట్రాలలో విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియానా, ఓక్లహామా, కెంటకీ, వెస్ట్ వర్జీనియా, ఆర్కాన్సాస్, కాన్సస్, మిస్సోరీ వంటి రాష్ట్రాలలో ఆయన విజయం సాధిస్తున్నారు.

    అమెరికా ఎన్నికలు

    ఫొటో సోర్స్, Reuters

  19. కీలకమైన రాష్ట్రాల్లో హోరాహోరీ

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రాథమిక అంచనాలు, ఫలితాలను పరిశీలిస్తుంటే రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ జో బైడెన్‌ల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది.

    కీలకమైన ఫ్లోరిడాలో బైడెన్ కంటే ట్రంప్ ముందున్నారు. అయితే జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, అరిజోనా, ఒహైయో, టెక్సాస్, నార్త్ కరోలినా ఫలితాలపై అంతా ఆధారపడి ఉంది.

    మరోవైపు కోట్ల మంది తమ ఓట్లను బ్యాలెట్ పద్ధతిలో వేశారు. శతాబ్ద కాలంలో మునుపెన్నడూ చూడని స్థాయిలో ఈ ఓటింగ్ జరిగింది. ఈ ఓట్లనూ లెక్కించాల్సి ఉంది.

    అధ్యక్ష ఎన్నికలతోపాటు అమెరికా కాంగ్రెస్‌కూ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతినిధుల సభపై డెమొక్రాట్ల పట్టు కొనసాగుతుందని అంచనాలు చెబుతున్నాయి.

  20. న్యూహ్యాంప్‌షైర్‌లో బైడెన్, మిస్సౌరీలో ట్రంప్ ఆధిక్యం

    జో బైడెన్ ఖాతాలో మరో రాష్ట్రం పడినట్లు కనిపిస్తోంది. న్యూహ్యాంప్‌షైర్‌లో ఆయన విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

    2000లో ఇక్కడ జార్జ్ డబ్ల్యూ బుష్ విజయం సాధించారు. ఈ దఫా మినహా ప్రతిసారీ డెమొక్రాట్లే ఇక్కడే విజయం సాధించారు.

    ఇలినాయిలోనూ బైడెన్ విజయం దిశగా ముందుకు వెళ్తున్నారు. 1992 నుంచి ఇక్కడ ప్రతిసారీ డెమొక్రాట్లే గెలుస్తున్నారు.

    మరోవైపు మిస్సౌరీలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. గత ఐదు ఎన్నికల్లో ఇక్కడ రిపబ్లికన్లే విజయం సాధించారు. 2016లో 19 శాతం ఓట్ల తేడాతో హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్ విజయం సాధించారు.

    క్యాన్సస్, వ్యోమింగ్‌లలో డోనల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. గత 80 ఏళ్లలో క్యాన్సస్‌లో ఒకసారి మాత్రమే డెమొక్రాట్లు(1964) గెలిచారు. మరోవైపు వ్యోమింగ్ రిపబ్లికన్లకు కంచుకోట.

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images