కరోనావైరస్: 'భారత్‌లో జూన్-జూలై నాటికి కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం' - ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

దేశంలో వైరస్ విస్తరిస్తున్న తీరును బట్టి కేసుల సంఖ్య జూలై నాటికి మరింత తీవ్రంగా పెరిగే అవకాసం ఉందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,72,9367కు పెరిగింది. కోవిడ్-19 వల్ల ఇప్పటివరకూ మొత్తం 2.64 లక్షల మందికి పైగా మరణించారు. భారత్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య 52,952కి చేరింది.

లైవ్ కవరేజీ

కరోనా లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం, ముఖ్యాంశాలు

కరోనా
  • జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,48,959కి పెరిగింది. కోవిడ్-19 వల్ల ఇప్పటివరకూ మొత్తం 2 లక్షల 63 వేలమందికి పైగా మరణించారు.
  • అమెరికాలో కోవిడ్ కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. ఇక్కడ మృతుల సంఖ్య కూడా 73 వేలు దాటింది. అమెరికాపై ఇప్పటివరకూ అత్యంత భయంకరమైన దాడి ఇదేనని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
  • బ్రిటన్ కోవిడ్ మృతుల సంఖ్య ఇటలీని దాటింది. ఇక్కడ మొత్తం 30,150 మంది చనిపోయారు. దీంతో యూరప్‌లో ఇప్పటివరకూ అత్యధిక మృతులు నమోదైన దేశంగా దేశంగా నిలిచింది.
  • భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువ అవుతోంది. దేశంలో మొత్తం 1694 మంది మృతిచెందారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1777 కరోనా కేసుల నమోదుకాగా, మృతుల సంఖ్య 36గా ఉంది. తెలంగాణలో కరోనా కేసులు 1107 కాగా, 29 మంది చనిపోయారు.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలనూ హెచ్చరించింది. కరోనాపై అప్రమత్తం కాకపోతే అది మళ్లీ ప్రబలే అవకాశం ఉందని చెప్పింది.
  • ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 వేల మంది వైద్య సిబ్బంది కరోనావైరస్‌కు గురికావచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
  • ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. భారత్‌లో ఆర్థిక సంక్షోభం వల్ల 12.2 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. దానితోపాటూ షేరింగ్ ట్యాక్సీ ఉబర్ తమ సిబ్బందిలో 14 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది.