కరోనావైరస్: భారత్‌లో 49,391కి చేరిన కేసులు, 1,694 మంది మృతి
అమెరికాలో అత్యధికంగా 12 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. స్పెయిన్, ఇటలీ, బ్రిటన్‌లో 2 లక్షల చొప్పున వైరస్ బారిన పడ్డారు. అమెరికా తరువాత అత్యధికంగా బ్రిటన్‌లో 30,070 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
లైవ్ కవరేజీ
భారత్‌లో 49,391కి చేరిన కేసులు, 1,694 మంది మృతి
- ప్రపంచవ్యాప్తంగా 3,691,683 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 2,59,695 మంది మృతి చెందారు.
- అమెరికాలో 12,06,886 పాజిటివ్ కేసులు నమోదు కాగా 71,463 మంది మరణించారు.
- బ్రిటన్‌లో 1,96,244 మంది కరోనాబారిన పడగా 30,070 మంది మరణించారు.
- ఇటలీలో 2,13,013 పాజిటివ్ కేసులు నమోదు కాగా 29,684 మంది చనిపోయారు.
- స్పెయిన్‌లో 2,19,329 పాజిటివ్ కేసులుండగా 25,613 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో 1,70,694 మందికి కరోనావైరస్ సోకగా 25,538 మంది ప్రాణాలు కోల్పోయారు.
- భారత్‌లో 49,391 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,694 మంది మరణించారు.
- తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,107కి పెరగ్గా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు 1777 కాగా, ఇప్పటివరకు 36 మంది మృతి చెందారు.
బ్రిటన్‌లో 30 వేలు దాటిన మరణాల సంఖ్య

ఫొటో సోర్స్, PA Media
బ్రిటన్‌లో కోవిడ్-19 మరణాల సంఖ్య 30 వేలు దాటింది. ఇవాళ కొత్తగా 649 మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. దాంతో, మృతుల సంఖ్య 30,070కి చేరిందని వెల్లడించింది.
యూరప్‌లో 30 వేలకుపైగా కోవిడ్-19 మరణాలు ఒక్క బ్రిటన్‌లోనే నమోదయ్యాయి.
ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక మంది చనిపోయింది కూడా బ్రిటన్‌లోనే.
తెలంగాణ నుంచి 1030 మంది వలసకూలీలతో మధ్యప్రదేశ్ చేరుకున్న రైలు

ఫొటో సోర్స్, ANI
మంగళవారం నాడు 1030 మంది వలసకూలీలతో తెలంగాణ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు బుధవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కరోనావైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

కరోనావైరస్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 36 లక్షలు దాటింది. 2.58 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 12 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
అమెరికాలో అత్యధికంగా 12 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. స్పెయిన్, ఇటలీ, బ్రిటన్‌లో 2 లక్షల చొప్పున వైరస్ బారిన పడ్డారు.
అమెరికా తరువాత అత్యధికంగా బ్రిటన్‌లో 29 వేలకు పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 49 వేలు దాటింది. 1,694 మంది మరణించారు.
నితిన్ గడ్కరీ: 'త్వరలోనే బస్సు రవాణాను ప్రారంభిస్తాం'

ఫొటో సోర్స్, pti
కొన్ని మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలో బస్సు రవాణాను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
అనేక మంది ప్రజలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినందున విమాన, రైలు, బస్సు ప్రయాణాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
మహారాష్ట్రలో 1,233, తమిళనాడులో 771 కొత్త కేసులు

ఫొటో సోర్స్, EPA
ఇవాళ మహారాష్ట్రలో కొత్తగా 1233 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 34 మంది చనిపోయారు.
తాజా కేసులతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 16,758కి చేరింది. 651 మంది కరోనావైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ 771 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. దాంతో, మొత్తం కేసుల సంఖ్య 4829కి, మరణాల సంఖ్య 35కి పెరిగాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గుజరాత్‌లో గడచిన 24 గంటల్లో 380 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,625కు చేరింది. అందులో ఇప్పటి వరకు 1500 మంది కోలుకున్నారని, 396 మంది మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన జర్మనీ

ఫొటో సోర్స్, Reuters
జర్మనీలో ఆంక్షలను సడలిస్తున్నట్లు ఆ దేశ చాన్సెలర్ ఏంగెలా మెర్కెల్ ప్రకటించారు.
పెద్ద దుకాణాలు కూడా తెరుకుంటాయని, వృద్ధాశ్రమలాలకు సందర్శకులను అనుమతిస్తామని చెప్పారు.
రెండు కుటుంబాలు బహిరంగ ప్రదేశాల్లో కలుసుకోవచ్చని తెలిపారు.
ఈ నెలలోనే జరగాల్సి ఉన్న బుందెస్లీగా ఫుట్‌బాల్ లీగ్ పోటీలకూ అనుమతి ఇస్తున్నామని మెర్కెల్ ప్రకటించారు.
సినిమా థియేటర్లు, రెస్టారెంట్లను ఎలా తెరవాలన్న విషయంపై ఆయా రాష్ట్రాల అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
జూన్ 5 వరకు దేశంలో అందరూ కనీసం 5 అడుగుల భౌతిక దూరం పాటించాలని కోరారు.
కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య పెరిగితే, మళ్లీ ఆంక్షలను విధిస్తామని ఆమె స్పష్టం చేశారు.
ప్రభుత్వ సూచనలను పాటిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల ఎగుమతులపై నిషేధం
ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను విదేశాలకు ఎగుమతి చేయడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
ఆ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
దిల్లీ- నోయిడా మార్గంలో ట్రాఫిక్ జామ్
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భయం, అభద్రతల మధ్య ఓ ఆశావర్కర్ జీవితం

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని 130 కోట్ల మంది ప్రజల్ని కరోనావైరస్ మహమ్మారి భయపెడుతున్న సమయంలో మేం ఉన్నాం అంటూ భరోసా ఇస్తున్నారు లక్షలాది మంది మహిళలు.
నిత్యం ఇంటింటికీ తిరుగుతూ జనం బాగోగుల్ని కనుక్కుంటూ తగిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
అవసరమైన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే కోవిడ్-19 పోరాటంలో తగిన ఆయుధాలు లేకపోయినా సరే తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ జనం కోసం పోరాడుతున్నారు.
కేరళలో ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

ఫొటో సోర్స్, Getty Images
కేరళలో ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 502 కేసులు నమోదు కాదా, ప్రస్తుతం 30 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మిగతావారు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆయన చెప్పారు.
కర్ణాటకలో గడచిన 24 గంటల్లో కొత్తగా 20 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 693కి పెరిగింది. ఇప్పటి వరకు 29 మంది కోవిడ్ఠ-19 రోగులు చనిపోయారని కర్ణాటక ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌లో ఒక కేసు, ఒడిశాలో అయిదు కొత్త కేసులు నమోదయ్యాయని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తెలిపాయి.
అమెరికా: మాంసం పరిశ్రమల్లో 50 శాతానికి పైగా సిబ్బందికి కరోనా

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, సిబ్బంది కరోనావైరస్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని పరిశ్రమ యాజమాన్యం చెబుతోంది అమెరికాలోని మాంసం శుద్ధి పరిశ్రమల్లో పనిచేస్తున్న సిబ్బందిలో సగం మందికి పైగా కరోనావైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు.
అయోవా రాష్ట్రంలో ఉన్న టైసన్ ఫుడ్స్ ప్లాంటులో 730 మంది ఉద్యోగులు (మొత్తం సిబ్బందిలో 58 శాతం) ఈ వైరస్ బారిన పడ్డారని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం తెలిపింది.
సౌత్ డకోటాలోని స్మిత్‌ఫీల్డ్ పోర్క్ ప్లాంటులో 600 మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
దేశంలో ఆహార కొరత లేకుండా చూసేందుకు మాంసం పరిశ్రమలు పనిచేయాలని గత నెలలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఆయన ఆ ప్రకటన చేసినప్పటికే అమెరికాలో మాంసం ప్యాకింగ్ చేసే సిబ్బందిలో దాదాపు 3,300 మంది వైరస్ బారిన పడగా, 20 మంది చనిపోయారు.
అమెరికాలో కరోనావైరస్ పై పరిశోధనలు చేస్తున్న 'కీలక శాస్త్రవేత్త' కాల్చివేత

ఫొటో సోర్స్, University of Pittsburgh School of Medicine
అమెరికాలో కరోనావైరస్ గురించి లోతైన అధ్యయనం చేస్తున్నారని చెబుతున్న ఒక పరిశోధకుడు కాల్పులకు గురై మరణించారు.
ఆయనను కాల్చి చంపిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
పిట్స్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ బింగ్ లియూ శనివారం పిట్స్‌బర్గ్ సమీపంలోని రాస్ టౌన్‌షిప్‌లో శవమై కనిపించారని స్థానిక వైద్యుడు తెలిపారు.
ఘటనా స్థలం నుంచి మైలు దూరంలో ఆగి ఉన్న ఓ కారులో రెండో వ్యక్తి హావో గూ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డాక్టర్ లీయూను హావోనే చంపారని, తరువాత తనను తాను తుపాకితో కాల్చుకుని చనిపోయారని భావిస్తున్నారు.
కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లో చదువుకున్న డాక్టర్ లీయూ – సైన్స్‌కు విశేష కృషి చేశారని, అత్యుత్తమ పరిశోధకుడని పిట్స్‌బర్గ్ మెడికల్ స్కూలు ఒక ప్రకటనలో తెలిపింది. "కరోనావైరస్ కణ నిర్మాణాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఆయన కీలక పరిశోధనలు చేస్తున్నారు" అని పేర్కొంది.
వలస కూలీల నుంచి రైలు ఛార్జీలు వసూలు చేయడం 'మూర్ఖపు చర్య'

ఫొటో సోర్స్, Getty Images
అర్ధాకలితో అలమటిస్తున్న వలస కూలీల నుంచి రైలు ఛార్జీలు వసూలు చేయడం భారత ప్రభుత్వ 'మూర్ఖపు చర్య' అని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు.
విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఎయిర్ ఇండియా విమానాలలో ఉచితంగా తీసుకొచ్చారని ఆయన అన్నారు.
ఒకవేళ వలస కూలీల ప్రయాణ ఖర్చులను భరించేందుకు రైల్వే శాఖ నిరాకరిస్తే, పీఎం కేర్స్ నిధులను ఎందుకు ఖర్చు చేయకూడదు? అని ఆయన ప్రశ్నించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రష్యాలో వరుసగా నాలుగో రోజు 10 వేలకు పైగా కొత్త కేసులు

ఫొటో సోర్స్, Reuters
రష్యాలో వరుసగా నాలుగో రోజు 10 వేలకు పైగా కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
గడచిన 24 గంటల్లో 10,559 కేసులు నిర్ధరణ అయ్యాయి. 86 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు.
దాంతో, రష్యాలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 కేసుల సంఖ్య 1,65,929కి చేరింది. మరణాల సంఖ్య 1,537కి పెరిగింది.
కేరళలో కోవిడ్ రోగుల వ్యక్తిగత డేటా భద్రతపై కేసు మే 11కి వాయిదా
కేరళలో కోవిడ్-19 రోగుల వ్యక్తిగత వివరాలు లీకయ్యే అవకాశాలపై ఆ రాష్ట్ర హైకోర్టులో కొందరు పిటిషన్ వేశారు.
కోర్టు ఈ అంశాన్ని మే 11కి వాయిదా వేసింది.
కాగా కేరళలో కోవిడ్ రోగులు, క్వారంటైన్‌లో ఉన్నవారి వివరాలను ప్రభుత్వం స్ప్రింక్లర్ అనే అమెరికా సంస్థకు అందిస్తోందన్న ఆరోపణలపైనా కోర్టులో కేసు ఉంది.
దీనిపై కేరళ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలిచ్చింది. స్ప్రింక్లర్‌కు అందించిన డేటా మొత్తం అనామకంగా మార్చాలని.. ఆ తరువాతే దానికి యాక్సెస్ ఇవ్వాలని ఆదేశించింది.
స్ప్రింక్లర్ సంస్థతో కేరళ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం.. డేటా ప్రైవసీకి సంబంధించి అక్కడి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నేపాల్‌లో మే 18 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
పొరుగు దేశం నేపాల్‌లో లాక్‌డౌన్‌ను పొడిగించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మే 18 వరకు పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతుండడంతో దేశ రాజధాని కాఠ్మండూలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మే 17 తరువాత ఏం చేస్తారో చెప్పండి: కేంద్రాన్ని ప్రశ్నించిన సోనియా గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మోదీ ప్రభుత్వం లాక్‌డౌన్ మళ్లీ పొడిగించాక పరిస్థితులు ఎలా ఉన్నాయనేది వారితో ఆమె చర్చించారు.
ఈ సమావేశంలో ఆమె కేంద్రాన్ని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు సంధించారు. మే 17 తరువాత పరిస్థితి ఏం చేస్తారు.. ఆ తరువాత పరిస్థితి ఏమిటి..? లాక్‌డౌన్ ఎంతకాలం కొనసాగించాలనేది నిర్ణయించడానికి భారత ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్న అంశాలేమిటి..? అంటూ మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.
ఈ సమావేశంలో ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మే 17 తరువాత ఏం చేయాలనేదానిపై ప్రభుత్వానికి ప్రణాళిక ఉండాలని సూచిస్తూ.. అసలు వారి వద్ద ఉన్న ప్రణాళికేంటో ముఖ్యమంత్రులు కేంద్రాన్ని అడగాలన్నారు.
ఈ లాక్‌డౌన్ 3.0 తరువాత ఏం జరగబోతోందో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నారాయన. రాహుల్ గాంధీ ఈ సమావేశంలో వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.
ఈ ఏడాది పెద్దమొత్తంలో గోధుమ పంటను అందించి ఆహార భద్రతకు భరోసా కల్పించారంటూ సోనియా పంజాబ్, హరియాణా రైతులకు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశంలో మాట్లాడిన అంశాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్వీటర్ వేదికగా షేర్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పోస్ట్ X స్కిప్ చేయండి, 3X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మడగాస్కర్‌లో ‘కోవిడ్-19కి మూలికల మందు’ వినియోగం.. శాస్త్రీయం కాదంటున్న డబ్ల్యూహెచ్‌వో, ప్రత్యేక విమానంలో తెప్పిస్తానంటున్న టాంజానియా దేశాధ్యక్షుడు

ఫొటో సోర్స్, AFP
కోవిడ్-19కి చికిత్స చేసేందుకు ఫలానా మందు ఉపయోగపడుతుందన్న ఆధారం ఇప్పటి వరకూ లేదని ఒక పక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) చెబుతున్నప్పటికీ టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి మాత్రం కోవిడ్-19 కి మందు తెప్పించడానికి మడగాస్కర్‌కి ప్రత్యేక విమానం పంపిస్తానని చెబుతున్నారు.
కోవిడ్-19కి చికిత్స చేసే ఒక హెర్బల్ మందు మడగాస్కర్‌లో లభిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదే మందుని కాంగో బ్రజావిల్లే అధ్యక్షుడు కూడా దిగుమతి చేసుకోవాలనుకుంటున్నారు.
మరో వైపు స్వీయ పరిజ్ఞానంతో ఎటువంటి మందులు తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) హెచ్చరిస్తోంది.
