కరోనావైరస్: 'భారత్‌లో జూన్-జూలై నాటికి కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం' - ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

దేశంలో వైరస్ విస్తరిస్తున్న తీరును బట్టి కేసుల సంఖ్య జూలై నాటికి మరింత తీవ్రంగా పెరిగే అవకాసం ఉందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,72,9367కు పెరిగింది. కోవిడ్-19 వల్ల ఇప్పటివరకూ మొత్తం 2.64 లక్షల మందికి పైగా మరణించారు. భారత్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య 52,952కి చేరింది.

లైవ్ కవరేజీ

  1. బ్రెజిల్‌లో ఒకే రోజు అత్యధిక మరణాలు

    బ్రెజిల్ కరోనా

    ఫొటో సోర్స్, EPA

    బ్రెజిల్‌లో బుధవారం ఒకే రోజు 615 మంది మృతిచెందారు.

    వీటితో కలిపి బ్రెజిల్‌లో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 8500 దాటింది.

    "ప్రభుత్వం ఇప్పుడు అత్యంత ప్రభావితమైన కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేయాలని సిఫారసు చేసింది" అని బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి నెల్సన్ టేక్ చెప్పారు.

    బ్రెజిల్ అధ్యక్షుడు జాయర్ బోల్సోనారో కరోనా మహమ్మారి ప్రమాదాన్ని కొట్టిపారేస్తూ వచ్చారు. మహమ్మారి దేశంలో వ్యాపిస్తుంటే, ఆయన మాత్రం మీరు మీ పని కొనసాగించాలని దేశ ప్రజలకు చెబుతూ వచ్చారు.

  2. 'వందే భారత్ మిషన్': భారత్ నుంచి సౌదీకి 5 విమానాలు

    విమానాలు

    ఫొటో సోర్స్, Getty Images

    సౌదీలో భారతీయులన తీసుకురావడానికి 5 ప్రత్యేక విమానాలు వెళ్లనున్నాయి.

    సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక విమానాలు నడపనున్నారు.

    వీటిలో దాదాపు వెయ్యి మంది భారతీయులను దేశానికి తీసుకొస్తారు. సౌదీ అరేబియా రాయబార కార్యాలయం నుంచి బీబీసీకి ఈ సమాచారం అందింది.

    విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం 'వందే భారత్ మిషన్' కింద ప్రత్యేక విమానాలను నడుపుతోంది.

    సౌదీ అరేబియా నుంచి మొదటి విమానం రేపు రియాద్ నుంచి కోజికోడ్ చేరుకుంటుంది. ఇందులో దాదాపు 200 మందికి చోటు లభిస్తుంది.

    రాయబార కార్యాలయం అధికారుల వివరాల ప్రకారం సుమారు 80 వేల మంది తిరిగి భారత్ వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారు.

    ఎవరు స్వదేశానికి చేరుకోవడం అత్యంత అవసరమో వారిని మాత్రమే ఇప్పుడు భారత్ తీసుకొస్తున్నారు.

    సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలోని ఒక అధికారి "మేం అన్ని దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. అత్యవసరం ఉన్న వారికి మాత్రమే చోటు ఇస్తున్నాం" అన్నారు.

    అటు సౌదీలో ఉన్న భారతీయుల్లో ఆందోళన పెరుగుతోంది. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వారు ఎలాగోలా స్వస్థలాలకు చేరుకోవాలని అనుకుంటున్నారు.

    ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల ద్వారా వారిని తిరిగి దేశానికి తీసుకొస్తున్నారు. ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేయాలని చెప్పారు.

    బీబీసీతో మాట్లాడిన కొందరు మేం రాత్రంతా ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తూనే ఉన్నామని చెప్పారు.

    అధికారులు రాయబార కార్యాలయం జాబితా అందిన తర్వాత వారిని సంప్రదిస్తామని చెబుతున్నారు.

    ఈ ప్రత్యేక విమానాల కోసం ప్రయాణికులు టికెట్ కొనాల్సి ఉంటుంది. రియాద్ నుంచి దిల్లీకి టికెట్ ధర 1023 సౌదీ రియాల్స్ అంటే దాదాపు 20 వేల రూపాయలు.

    ఐదు విమానాల తేదీలు

    • మే 8న రియాద్-కోజికోడ్
    • మే 10న రియాద్-దిల్లీ
    • మే 12న దమ్మామ్-కోచ్చి
    • మే 13న జెడ్డా-దిల్లీ
    • మే 14న జెడ్డా-కోచ్చి
  3. ముంబయిలో 250 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

    ముంబయిలోని దాదాపు 250 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నగర పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఏఎన్ఐకు చెప్పారు.

    వీటిలో లక్షణాలు కనిపించిన కేసులు చాలా తక్కువ ఉన్నాయని, పాజిటివ్ వచ్చిన వారిలో ఎవరూ ఐసీయూలో లేరని ఆయన చెప్పారు

    మహారాష్ట్రలో మొత్తం 16,758 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 651 మృతిచెందారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. పేద దేశాలకు సాయం అందించండి-ఐక్యరాజ్యసమితి

    పేద దేశాలకు సాయం

    ఫొటో సోర్స్, Getty Images

    బలహీన దేశాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి, లక్షలాది ప్రాణాలు కాపాడ్డానికి మరో 4.7 బిలియన్ డాలర్ల విరాళాలు అందించాలని ఐక్యరాజ్యసమితి దాతలను కోరింది.

    మార్చిలో ప్రపంచ మానవతా ప్రతిస్పందన ప్రణాళిక ప్రారంభించిన ఐక్యరాజ్యసమితి 2 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం కోరింది. అందులో దాదాపు సగం మొత్తాన్ని అందుకుంది.

    ప్రపంచవ్యాప్తంగా నిరుపేద దేశాలపై కరోనా మహమ్మారి ప్రభావం అత్యంత వినాశకరంగా ఉండబోతోందని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ అఫైర్స్ సెక్రటరీ జనరల్ మార్క్ లోకాక్ ఒక ప్రకటనలో తెలిపారు.

    మనం ఇప్పుడే చర్యలు తీసుకోకుంటే, ఆ దేశాల్లో ఘర్షణలు, పేదరికం, ఆకలిలో గణనీయంగా పెరగడం చూసేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకే, అసాధారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అన్నారు.

    50కి పైగా ఉన్న బలహీన దేశాల జాబితాలో కొత్తగా మరో 9 దేశాలను చేర్చారు. ఈ దేశాల్లో కోవిడ్ పరీక్షలకు, రోగులకు చికిత్స అందించే వైద్య పరికరాలు, హాండ్ శానిటైజర్లు, కోవిడ్ ప్రచార కార్యక్రమాలు, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలో ఉన్నవారికి విమానాల్లో మానవతా సాయం అందించడానికి ఈ విరాళాలను ఉపయోగిస్తున్నారు.

    స్వయంగా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న దశాలు, పేద దేశాల కోసం 900 మిలియన్ డాలర్లకు పైగా సాయం చేశాయి, కానీ ఇది మరింత అవసరం అయ్యేలా కనిపిస్తోందని బీబీసీ ప్రతినిధి లీసే డోసెల్ చెప్పారు.

    అత్యంత బలహీనంగా ఉన్న దేశాల్లో మరో మూడు నుంచి ఆరు నెలలకు గానీ ఈ కేసులు తీవ్ర స్థాయికి చేరుకోవని భావిస్తున్నారు.

    దాతలు అందించే విరాళాలతో డిసెంబర్ వరకూ పేద దేశాలకు సాయం అందించాలని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది.

  5. కేరళ నుంచి అబుధాబికి వందేభారత్ మిషన్

    విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇవాళ్టి నుంచి వందేభారత్ మిషన్‌ ప్రారంభిస్తున్నారు.

    ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ IX419 విమానం ఈరోజు కేరళలోని కోచి నుంచి అబుధాబికి వెళ్లనుందని ఏఎన్ఐ చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. బ్రేకింగ్ న్యూస్, ఏపీలో కొత్తగా 56 కేసులు, ఇద్దరి మృతి, విజయనగరం జిల్లాలో 3 కరోనా కేసులు నమోదు

    ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 56 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    ఇప్పటివరకూ కరోనా కేసులు లేకుండా గ్రీన్ జోన్‌గా నిలిచిన విజయనగరం జిల్లాలో కొత్తగా 3 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1833కు చేరింది.

    ప్రస్తుతం ఏపీలోని ఆస్పత్రుల్లో 1015 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 780 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    గత 24 గంటల్లో ఇద్దరు మృతిచెందారు. వీరిలో ఒకరు కృష్ణా జిల్లాకు చెందినవారు కాగా, మరొకరు కర్నూలు జిల్లా వారు.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 38కి చేరింది.

    ఏపీలో అత్యధికంగా కర్నూలులో పాజిటివ్ కేసుల సంఖ్య 540కి చేరింది. గుంటూరులో 373, కృష్ణాలో 316 కేసులు నమోదయ్యాయి.

    ఏపీ కరోనా

    ఫొటో సోర్స్, ap i&pr

  7. ఆపరేషన్ సముద్ర సేతు: మాల్దీవులు చేరుకున్న ఐఎన్ఎస్ జలాశ్వ

    విదేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ మాల్దీవులకు చేరుకుంది.

    అక్కడ ఉన్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే సముద్ర సేతు ఆపరేషన్‌ మొదటి దశలో భాగంగా ఇది మాలి తీరానికి చేరుకుందని మాల్దీవుల్లో ఉన్న భారత రాయబార కార్యాలయం చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. దిల్లీలో 11 రోజులకు రెట్టింపు అవుతున్న కరోనా కేసులు

    దిల్లీలో బుధవారం 428 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5532కు పెరిగింది. ప్రస్తుతం 12 మంది రోగులు వెంటిలేటర్ మీద ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.

    దిల్లీలో మొత్తం మృతుల సంఖ్య 65 దగ్గరే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నట్లు మంత్రి చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. భారత్‌లోని పెద్ద నగరాల్లో కరోనా తీవ్రత

    దేశంలో జనసాంధ్రత ఎక్కువగా ఉన్న పెద్ద నగరాల్లో వైరస్ ఎక్కువగా వ్యాపించడం కనిపిస్తోంది.

    దేశానికి ఆర్థికంగా అండగా నిలిచే దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి.

    భారత్‌లో ఇప్పటివరకూ ఎక్కువగా మహారాష్ట్రలో 16,758, గుజరాత్‌లో 6,625, దిల్లీలో 5,532, తమిళనాడులో 4,829, రాజస్థాన్‌లో 3,317 కరోనా కేసులు నమోదయ్యాయి.

  10. కరోనావైరస్ లాక్‌డౌన్‌‌తో భారత్‌లో ఒక్కనెలలోనే నిరుద్యోగులుగా మారిన 12.2 కోట్ల మంది

    నిరుద్యోగం

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్‌లో దేశ వ్యాప్తంగా విధించిన కరోనావైరస్ లాక్ డౌన్‌తో ఒక్క ఏప్రిల్ నెలలోనే 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఒక ప్రైవేట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.

    సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన అంచనాల ప్రకారం భారత్‌లో నిరుద్యోగ రేటు 27.1 శాతంగా నమోదైంది.

    ఈ డేటా ప్రకారం భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య అమెరికా కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉంది.

    నిరుద్యోగం గురించి భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు. కానీ సీఎంఐఈ విడుదల చేసిన వివరాలను ఆమోదయోగ్యమైన సమాచారంగా పరిగణిస్తారు.

    కోవిడ్-19 ఇన్ఫెక్షన్లని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు భారీ సంఖ్యలో 'లే ఆఫ్' అమలు చేశాయి.

  11. విదేశాల నుంచి భారతీయులను తిరిగి తీసుకొచ్చే ఆపరేషన్‌ ఆలస్యం

    విదేశీ ఆపరేషన్

    ఫొటో సోర్స్, Getty Images

    విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్‌ ప్రారంభం ఆలస్యం అవుతోంది. మీడియా కథనాల ప్రకారం చాలామంది పైలెట్లకు ఇంకా కరోనా పరీక్షల ఫలితాలు రాలేదు. రిపోర్టులు వచ్చేవరకూ వారందరూ తిరిగి విధులకు రావడం కుదరదని తెలుస్తోంది.

    ఈ ఆపరేషన్‌లో భాగంగా సింగపూర్‌లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి మొదటి విమానం దిల్లీ నుంచి గురువారం ఉదయం 11 గంటలకు వెళ్లాలి. రెండో విమానం శుక్రవారం ముంబయి నుంచి లండన్ వెళ్లనుంది. మరో వారం రోజులపాటు 12 దేశాల నుంచి 15 వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని భావిస్తున్నారు.

    వీరిని తీసుకురావడం కోసం 60 మందికి పైగా పైలెట్లు విధుల్లోకి వెళ్తారు. ప్రయాణ ఛార్జీలను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. దేశానికి వచ్చిన తర్వాత వారందరినీ క్వారంటైన్లోకి ఉంచుతారు. భారతీయ నావికాదళంకూడా ఈ ఆపరేషన్‌కు సహకరిస్తోంది. భారత్‌లో కరోనా వల్ల మార్చి నుంచి అన్ని అంతర్జాతీయ పర్యటనలను నిలిపివేశారు. భారత్‌లో ప్రస్తుతం 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    మీడియా కథనాల ప్రకారం ఈ విమానాల్లో సుమారు 2 లక్షల మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకురానున్నారు. ఇది విజయవంతం అయితే, 1990 తర్వాత విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి చేర్చే అతిపెద్ద మిషన్ ఇదే అవుతుంది. 1990లో గల్ఫ్ యుద్ధం సమయంలో కువైత్ నుంచి లక్షా 70 వేల మందిని భారత్ స్వదేశానికి తీసుకొచ్చింది.

  12. దక్షిణాసియా కరోనా అప్‌డేట్

    • పాకిస్తాన్‌లో గత 24 గంటల్లో 1049 కొత్త కరోనా కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి.

    వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 23 వేలు దాటింది. పాక్‌లో ఇప్పటివరకూ 564 మంది చనిపోయారు.

    పాకిస్తాన్‌లో మే 10 నుంచి రైలు సర్వీసులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దానికోసం రైల్వే సిబ్బందిని కూడా విధులకు పిలిపించారు అని స్థానిక మీడియా చెప్పింది.

    • బంగ్లాదేశ్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఇవి 11 వేలు దాటాయి. రోజువారీ కేసుల సంఖ్య కూడా 790కి పెరిగింది. ఇక్కడ మొత్తం 186 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటివరకూ ఇదే అత్యధికం.
    • నేపాల్‌లో లాక్‌డౌన్‌ను మరో పది రోజులు అంటే మే 18 వరకూ పొడిగించారు. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82కు చేరింది.
    • శ్రీలంకలో ఉన్న 548 యాక్టివ్ కరోనా కేసుల్లో 300 నావికాదళానికి చెందినవే అని ఆ దేశ అధికారులు ప్రకటించినట్లు స్థానిక మీడియా చెప్పింది. శ్రీలంకలో మొత్తం 700 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 8 మంది చనిపోయారు.
  13. బుద్ధుడి బోధనలు మానవ సేవ పట్ల మన నిబద్ధతను బలోపేతం చేస్తాయి-ప్రధాని

    బుద్ధపూర్ణిమ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

    కరోనా సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు దుఃఖం, నైరాశ్యం ఎక్కువగా ఉంటుంది.

    అప్పుడు బుద్ధుడి బోదనలు, మరింత సందర్భోచితం అవుతాయి. ఈ పరిస్థితుల్లో బుద్ధుడి బోధనలు మనోధైర్యం అందిస్తాయి.

    ఇప్పుడు మనం కఠిన పరిస్థితిని నుంచి బయటపడ్డానికి నిరంతరం కలిసి ప్రయత్నిస్తున్నాం.

    ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధుడు చూపించిన దయ, కరుణ, సుఖదుఃఖాల సమదృష్టి, ఎవరు ఎలా ఉంటారో వారిని అలాగే స్వీకరించడం అనే నాలుగు సత్యాలు నిరంతరం భారత భూమికి ప్రేరణగా నిలుస్తాయి.

    భారత్ నిస్వార్థ భావనతో ఎలాంటి బేధభావాలు లేకుండా దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలో నిలిచిన వారందరికీ పూర్తి అండగా నిలుస్తోంది.

    ఈ సంక్షోభ సమయంలో మీకు వీలైనంత సాయం చేయడానికి మీ చేయి అందించండి. అందుకే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ కష్ట సమయంలో భారత్‌ను గుర్తు చేసుకుంటున్నాయి. భారత్ కూడా అవసరమైన ప్రతి ఒక్కరికీ తన సాయం అందించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు.

    దేశం ఇప్పుడు ప్రతి భారతీయుడి జీవితం కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో తన అంతర్జాతీయ బాధ్యతను కూడా తీవ్రంగా పాటిస్తోంది.

    బుద్ధుడి ప్రతి బోధన, ప్రతి ఉపదేశం మానవ సేవ పట్ల భారతదేశానికి ఉన్న నిబద్ధతను బలోపేతం చేస్తాయి. భారత బోధనలకు, భారత ఆత్మబోధనలకు బుద్ధుడు ప్రతీక.

    ఇదే ఆత్మబోధనతో భారత్ నిరంతరం మానవాళి కోసం, ప్రపంచహితం కోసం పనిచేస్తుంది, పనిచేస్తూనే ఉంటుంది. భారత్ ప్రగతి ఎప్పుడూ విశ్వ ప్రగతికి అండగా నిలిచేలా ఉంటుంది.

    నిరంతరం మానవసేవ చేసేవారే బుద్ధుడి బాటలో నడిచే అసలైన అనుచరులు.

    ఈ కష్టకాలంలో మీరు, మీ కుటుంబం ఏ దేశంలో ఉన్నా సురక్షితంగా ఉండండి. వీలైనంత వరకూ ఇతరులకు సేవ చేయండి. మీ ఆరోగ్యం కాపాడుకోండి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. బ్రేకింగ్ న్యూస్, భారత్‌లో 50 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

    దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చెప్పింది.

    వీటిలో 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1783కు చేరింది.

    ఇప్పటివరకూ 15,266 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. రాజస్థాన్ సరిహద్దులు మూసివేత-సీఎం ఆదేశం

    అనధికారికంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ లోపలికి రాకుండా రాజస్థాన్‌తో ఉన్న అంతర్ రాష్ట్ర సరిహద్దులను వెంటనే మూసివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఆదేశించారు.

    రాజస్థాన్‌లో మొత్తం 3158 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకూ 89 మంది చనిపోయారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. కరోనావైరస్-ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది

    కరోనా ప్రపంచం

    ఫొటో సోర్స్, Getty Images

    వచ్చే వారం నుంచి లాక్‌డౌన్‌లో మినహాయింపులు-బ్రిటన్

    ఆదివారం నుంచి లాక్‌డౌన్‌లో మినహాయింపులు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. రాబోవు రోజుల్లో కొత్త ప్రమాణాలు పాటించబోతున్నామని ఆయన చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ మొదటిసారి పార్లమెంటులో మాట్లాడారు. “ప్రతి ఒక్కరి మృతి విషాదం కలిగించిందని, పాజిటివ్ కేసుల సంఖ్య భయపెడుతోందని” అన్నారు.

    హఠాత్తుగా లాక్‌డౌన్ ఎత్తేయడం క్షమించరాని తప్పిదమే - స్పెయిన్

    స్పెయిన్‌లో 8 వారాల నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను హఠాత్తుగా ఎత్తివేయడం క్షమించరాని తప్పిదం అవుతుందని ఆ దేశ ప్రధాని పెడ్రో శాంచెజ్ అన్నారు. పార్లమెంటులో మాట్లాడిన ఆయన లాక్‌డౌన్ కొనసాగించేందుకు ఆమోదముద్ర వేయాలన్నారు. ప్రధాని నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

    అమెరికా వాదన కొట్టిపారేసిన చైనా

    కోవిడ్-19 ఎక్కడనుంచి ప్రారంభమైంది అనే అంశంపై పరిశీలనకు వచ్చే అంతర్జాతీయ నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించబోమని అమెరికాలోని చైనా రాయబారి అన్నారు. ఈ అంశంపై చైనా, అమెరికా మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. కరోనావైరస్ చైనాలోని ల్యాబ్‌లో తయారైందన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో వాదన పూర్తిగా అవాస్తవం అని చైనా విదేశాంగ మంత్రి అన్నారు.

    స్వీడన్‌లో 3 వేలకు చేరువైన కరోనా మృతుల సంఖ్య

    స్వీడన్‌లో కరోనా మృతుల సంఖ్య 3 వేలకు చేరువ అయ్యిందని ఆ దేశ నిపుణుడు ఆండర్స్ టెగ్నెల్ చెప్పారు. ఆ దేశ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ నివేదిక ప్రకారం స్వీడన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,918కి చేరింది. మృతుల సంఖ్య 2,941కిపెరిగింది. బుధవారం ఒక్కరోజే 87 చనిపోయారు. స్వీడన్ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడం లేదు. అక్కడ చాలా పరిశ్రమలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. ప్రజలే సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం కోరింది.

  17. కరోనావైరస్: భారత్‌లో పరిస్థితి ఎలా ఉంది?

    కరోనా అప్ డేట్స్

    ఫొటో సోర్స్, AFP

    కరోనావైరస్ వల్ల భారత్‌లో ఇప్పటివరకూ 1694 మంది చనిపోయారు

    దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వీరిలో 14,183 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

    కేంద్ర ప్రభుత్వం ఆల్కహాలు ఉపయోగించే హ్యాండ్ శానిటైజర్ ఎగుమతులపై నిషేధం విధించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    కేరళలో చిక్కుకుపోయిన వలస కార్మికులను బీహార్ తీసుకొస్తున్న ప్రత్యేక రైలు 1189 మంది కూలీలతో కోజికోడ్ నుంచి బయల్దేరింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    మధ్యప్రదేశ్‌లో 85 ఏళ్ల క్యాన్సర్ రోగి డాక్టర్ నరేంద్ర మహాదిక్ కరోనావైరస్ నుంచి కోలుకున్నారు.

    డాక్టర్ మహాదిక్ బయోలేటరల్ న్యుమోనియా కూడా ఉంది. కానీ ఆయన వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చేసింది.

    ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్యం, పెట్రోల్, డీజిల్ మీద పన్నులు పెంచింది.

  18. ఇరాన్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

    ఇరాన్ కరోనా

    ఫొటో సోర్స్, Getty Images

    ఇరాన్‌లో కరోనా కేసులు హఠాత్తుగా పెరిగాయి.

    దేశంలో కరోనా నియంత్రణలో ఉందని భావిస్తున్న సమయంలో బుధవారం ఒక్కసారిగా 1,680 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

    ఏప్రిల్ 11 తర్వాత ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇవి అత్యధికం. వీటితో కలిపి ఇరాన్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటాయి.

    ఇరాన్‌లో కరోనా మళ్లీ విజృంభించిందని భావిస్తున్నారు. గత నాలుగు రోజులుగా కరనా కేసులు వరుసగా పెరుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో కరోనావైరస్ వల్ల అత్యంత ప్రభావితమైన దేశం ఇరాన్.

    దీనిని ఇరాన్‌లో వైరస్ సెకండ్ వేవ్‌గా చెప్పుకుంటున్నారు.

    "గత మూడు నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం మేం చూస్తున్నాం. దేశంలో అనవసర పర్యటనల వల్ల ఈ కేసులు పెరిగి ఉండవచ్చు" అని ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి చెప్పారు.

    ఇరాన్‌లో ఏప్రిల్ 11 నుంచి లాక్‌డౌన్‌లో చాలా మినహాయింపులు ఇచ్చారు. తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మసీదులు కూడా తెరిచారు.

    గత 24 గంటల్లో ఇరాన్‌లో కరోనా వల్ల 78 మంది చనిపోయారు. వీరితో కలిపి దేశంలో మొత్తం మృతుల సంఖ్య 6418కి చేరింది.

  19. రష్యాలో కొత్త కేసులు, అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు

    రష్యా పుతిన్

    ఫొటో సోర్స్, EPA

    రష్యాలో కొత్త కరోనా కేసులు పెరుగుతుండడంతో అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

    గత నాలుగు రోజులుగా రష్యాలో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య చాలా పెరుగుతున్నాయి.

    ఇప్పటివరకూ రష్యాలోని కరోనా కేసుల సంఖ్య లక్షా 65 వేలు దాటింది. దేశంలో ఇప్పటివరకూ 1537 మంది చనిపోయారు.

    కానీ దేశంలో త్వరలో రాకపోకలపై ఆంక్షలు తొలగించబోతున్నారు.

    వరసగా నాలుగో రోజు కూడా కరోనా కేసులు పెరగడంతో అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు.

    రాబోవు రోజుల్లో రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ప్రజలు తక్కువగా తిరగాల్సి ఉంటుందని చెప్పారు.

  20. అమెరికాపై అత్యంత భయానకమైన దాడి ఇదే-డోనల్డ్ ట్రంప్

    కరోనా దాడి

    ఫొటో సోర్స్, Getty Images

    ఇప్పటివరకూ అమెరికాపై జరిగిన అత్యంత భయంకరమైన దాడి కరోనావైరస్ వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

    చైనా సమయానికి చర్యలు చేపట్టి ఉంటే ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి మహమ్మారిగా మారుండేది కాదన్నారు.

    ట్రంప్ కరోనావైరస్‌ను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పెర్ల్ హార్బర్ ద్వీపంపై జరిగిన జపాన్ బాంబు దాడులతో పోల్చారు.

    చైనాను నిందితుడుగా నిలిపే తన ప్రయత్నాలను ఇక ముందు కూడా కొనసాగిస్తానని ట్రంప్ చెప్పారు.