You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: తెలంగాణలో 66 కొత్త కేసులతో 766కు పెరిగిన కోవిడ్ బాధితులు

తెలంగాణలో ఇప్పటివరకు కోవిడ్ వ్యాధి బారిన పడి 18 మంది చనిపోయారు. 186 మంది కోలుకున్నారు. అయితే, శుక్రవారం ఒక్కరోజే 66 కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబయిలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ మహానగరంలో 2,120 మందికి వైరస్ సోకింది, 121 మంది చనిపోయారు.

లైవ్ కవరేజీ

  1. విక్టరీ డే పరేడ్ వాయిదా, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన

    మే 9న నిర్వహించాలనుకున్న విక్టరీ డే పరేడ్‌ను వాయిదావేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.

    గ్రేట్ పేట్రియాటిక్ యుద్ధంలో యూఎస్ఎస్ఆర్ విజయానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ పరేడ్ నిర్వహించాలని రష్యా నిర్ణయించింది. కానీ, కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా దాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

  2. అస్సాం ట్రాఫిక్ పోలీసుల 'బిహు' డాన్స్

    అస్సాంలోని గువాహటిలో ట్రాఫిక్ పోలీసులు బిహు నృత్యం చేశారు. కరోనావైరస్ లాక్ డౌన్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సామాజిక దూరం పాటిస్తూనే ఇలా నృత్యం చేశారు.

    నూతన సంవత్సర ప్రారంభంలో రంగోలి బిహును జరుపుకుంటూ, ఇలా నృత్యం చేయడం ఆ రాష్ట్ర ప్రజల ఆచారం.

  3. కరోనావైరస్‌పై లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం.

    కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్‌డేట్ అవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన సమాచారం..

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 21.5 లక్షలు దాటింది. మృతుల సంఖ్య లక్షా 43 వేలు దాటింది. 5.42 లక్షలకు పైగా రోగులు కోవిడ్-19 బారినుంచి కోలుకున్నారు.

    అమెరికాలో ఇప్పటివరకూ 6.67 లక్షల మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. 32,900 మంది మృతి చెందారు. 54 వేల మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    ఇటలీ, స్పెయిన్‌లలో కూడా వ్యాధి విజృంభిస్తోంది. ఇటలీలో 22వేలమంది చనిపోగా, స్పెయిన్‌లో 19వేలమంది మరణించారు.

    భారత్‌లో కేసుల సంఖ్య 12759. ఇప్పటివరకూ 420 మంది మరణించారు.

    ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 534 కాగా, 14 మంది మరణించారు.

    తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 700కు చేరింది.

    లాక్ డౌన్‌తో కరోనావైరస్ సమస్య అంతం కాదని, వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిష్కారం కనుగొనాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు.

    భారత్ నుంచి 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి అవుతోంది. కరోనావైరస్ చికిత్సకు ఈ ఔషధం కావాలని ప్రపంచ దేశాలు భారత్‌ను అర్థిస్తున్నాయి.

    మే 31 వరకు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మార్చి 13 తర్వాత రోజులకు సేవలు బుక్ చేసుకున్న వారికి డబ్బు రీఫండ్ ఇస్తామని తెలిపింది.