జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సయిజ్ పన్నుల గురించి ఆర్థిక మంత్రి ఏమన్నారు?, జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే గడువు పొడిగింపు
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలకు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసే తేదీని జూన్ 30 వరకు పొడిగించారు. వార్షిక టర్నోవర్ 5 కోట్ల కన్నా తక్కువ ఉన్న కంపెనీలు వడ్డీని, ఆలస్య రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.
అయిదు కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా పెనాల్టీ, లేట్ ఫీజులు చెల్లించనవసరం లేదు. వడ్డీని తగ్గించిన 9 శాతం రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. చివరి తేదీన సర్వర్ మీద భారం పడకుండా చేసేందుకు వివిధ రంగాలకు వేరు వేరు తేదీలను ప్రకటిస్తారు.
కస్టమ్స్-ఎక్సైజ్ సబ్‌కా విశ్వాస్ పథకం కింద వివాదాలను పరిష్కరించుకునే గడువును మార్చి 31 నుంచి 2020 జూన్ 30కి పొడిగించారు. కోటిన్నర కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలపై ఎలాంటి జరిమానాల భారం ఉండదు. లాక్‌డౌన్ వల్ల ఎగుమతిదారులు, దిగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు రాత్రింబవళ్ళు కస్టమ్ క్లియరెన్స్ సేవలు కొనసాగుతాయి.