అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
నమస్తే...
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నేను, బీబీసీ కరస్పాండెంట్ శారద మియాపురం, మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.
మా పేజీలోని కొన్ని ముఖ్యమైన వార్తలను చదవడానికి కింది లింక్‌లపై క్లిక్ చేయండి.
- కాక్రోచ్ జనతా పార్టీ: దీనిని స్థాపించిన అభిజిత్ దీపక్ నుంచి ఆయన తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు?
- తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. 12 ఫోటోల్లో..
- ‘‘నా పిల్లలు అన్నం అడుగుతున్నారు, వారిని అమ్మేయడం తప్ప వేరే దారి లేదు’’
- తిమింగలాలను తినేసే వింత సముద్ర జీవులివి..
వైట్‌హౌస్ పరిసరాల్లో భారీగా సీక్రెట్ సర్వీస్ బలగాలు, టామ్ బెన్నెట్, వాషింగ్టన్ డీసీ నుంచి

ఫొటో సోర్స్, AFP via Getty Images
వైట్‌హౌస్ సమీపంలోని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై ఒక సాయుధుడు కాల్పులు జరిపి కొన్ని గంటలు గడిచినప్పటికీ, అక్కడ ఇంకా పోలీసు బలగాల మోహరింపు భారీగా ఉంది.
అధ్యక్షుడు ట్రంప్ అధికారిక నివాసానికి దారితీసే వీధుల వద్ద భారీగా గస్తీ ఏర్పాటు చేశారు. రోడ్లపై నిలిపి ఉన్న అనేక పోలీసు వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ వీధుల సమీపంలో చాలామంది జర్నలిస్టులు గుమిగూడారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగుతున్నందున బహుశా ఈ వీధులను రాత్రంతా మూసి ఉంచొచ్చని అక్కడ ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు నాతో చెప్పారు.
అయితే, నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించలేదు. మాకు కేవలం కొన్ని బ్లాకుల దూరంలోనే ఉన్న రెస్టారెంట్లు, బార్లలో ప్రజలు తమ వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
(నోట్: భారత్ కంటే అమెరికా కాలమానం 10:30 గంటలు వెనుక ఉంటుంది)
కాక్రోచ్ జనతా పార్టీ: దీనిని స్థాపించిన అభిజిత్ దీపక్ నుంచి ఆయన తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు?
కాల్పులు జరిపింది 21 ఏళ్ల యువకుడిగా గుర్తింపు

ఫొటో సోర్స్, AFP via Getty Images
వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరిపి, భద్రతా సర్వీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన అనుమానితుడు ఎవరో పోలీసులు గుర్తించినట్లు బీబీసీ భాగస్వామి మీడియా సంస్థ సీబీఎస్ తెలిపింది.
21 ఏళ్ల నాసిరే బెస్ట్ ఆ కాల్పులు జరిపినట్లు ఇన్వెస్టిగేషన్‌తో సంబంధమున్న ఒక వ్యక్తిని ఉటంకిస్తూ సీబీఎస్ రిపోర్ట్ చేసింది.
‘నిందితుడు 2025 జులైలో వైట్‌హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు అమెరికా సీక్రెట్ సర్వీస్ అతన్ని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా అతన్ని సైకియాట్రిక్ వార్డ్‌కు పంపించారు’ అని సదరు వ్యక్తిని చెప్పినట్లు సీబీఎస్ తెలిపింది.
వైట్‌హౌస్ సమీపంలో ‘15 నుంచి 30 రౌండ్ల పాటు’ కాల్పులు

ఫొటో సోర్స్, AFP via Getty Images
అమెరికా వైట్ హౌస్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది.
స్థానిక సమయం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో వైట్ హౌస్ వద్ద ఉన్న పలువురు జర్నలిస్టులు తమకు ఒక్కసారిగా తుపాకీకాల్పుల శబ్దం వినిపించినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే వారిని భవనం లోపలికి, ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఆపై వైట్ హౌస్‌ను లాక్‌డౌన్ చేశారు.
సుమారు 15 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు బీబీసీ భాగస్వామి సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఒకే ఒక్క సాయుధుడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల వైపు దూసుకువచ్చి వారిపై కాల్పులు జరిపాడని, ఆ తర్వాత సదరు ఏజెంట్లు ఎదురుకాల్పులు జరిపినట్లు సీబీఎస్ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో ఒక సాయుధుడు తన బ్యాగ్ నుంచి ఆయుధం తీసి కాల్పులు మొదలుపెట్టినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రకటించింది.
‘సీక్రెట్ సర్వీస్ పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడికి గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతడు మరణించినట్లు ప్రకటించారు. ఈ కాల్పుల సమయంలో అక్కడ ఉన్న ఒక సాధారణ పౌరుడు కూడా గాయపడ్డారు.
అధికారులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు వైట్ హౌస్‌లోనే ఉన్నారు’ అని తన ప్రకటనలో పేర్కొంది.
ట్రంప్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద ఒక సాయుధుడు కాల్పులు జరిపిన నెల రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.
సమ్మరీ పాయింట్స్
'1200 ఏళ్లుగా మండుతున్న అఖండ జ్వాల' ఉన్న ఆలయం కాలిపోయింది..
తిమింగలాలను తినేసే వింత సముద్ర జీవులివి..
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. 12 ఫోటోల్లో..
చైనా బొగ్గు గనిలో భారీ పేలుడు, 90 మందికి పైగా మృతి
"భారత్‌కు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఇవ్వడానికి మేం రెడీ", అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యల ఆంతర్యమేంటి?
‘‘నా పిల్లలు అన్నం అడుగుతున్నారు, వారిని అమ్మేయడం తప్ప వేరే దారి లేదు’’
మోసగాళ్లకు చెక్ పెడతామంటున్న డేటింగ్ స్టార్టప్స్, ఎలాగంటే..
పత్రికా స్వేచ్ఛకు కొలమానాలేంటి, భారత్‌లో మీడియా స్వేచ్ఛపై వివాదం దేనికి?
వెజ్ బిర్యానిలో చికెన్ ముక్కలు, స్విగ్గీ యజమానికి నాన్ బెయిలబుల్ వారంట్
హమ్జా బుర్హాన్: ‘టెర్రరిస్ట్’గా భారత్ ప్రకటించిన ఈయన్ను ముజఫరాబాద్‌లో కాల్చి చంపారు.. అసలెవరీయన?
పెళ్లికి ఒప్పుకోలేదని బాలిక రొమ్మును గాయపరిచిన యువకుడు
భారత్‌లో జరగాల్సిన ‘ఇండియా - ఆఫ్రికా సదస్సు’ ఎబోలా కారణంగా వాయిదా
గనేరియా, సిఫిలిస్ కేసులు యూరప్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయి - ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
