అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: ఇందులో ఏయే పన్నులు దాగి ఉంటాయి, రాష్ట్రానికో తీరుగా ఎందుకుంటుంది?
పెళ్లి కోసం ఒత్తిడి పెరగడంతో టాక్సీ ఎక్కి పారిపోయిన అఫ్గానీ యువతి, ‘‘ఇక్కడ మా పని అయిపోయినట్లే’’ అని మహిళలు ఎందుకు అంటున్నారు?
నీళ్లు తాగేందుకు వచ్చిన జింకను చుట్టుముట్టిన కుక్కలు..
‘‘నేను ఓడలో నిద్రపోతున్నా, బాంబులు పడటంతో సముద్రంలో దూకేశా’’
ఓ అరగంటసేపు కూర్చోవడం తగ్గిస్తే ఎంత ప్రయోజనమో తెలుసా?
ఐపీఎల్ -2026 : రాజస్థాన్ పోరు సూపరు, ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు
అమెరికా కొత్త గ్రీన్ కార్డు పాలసీ: భారతీయుల కల చెదిరిపోతుందా?
నీళ్లు కావాలంటే ఇలా బావిలోకి దిగాల్సిందే..
"ఇదే మీ కూతురో, మేనకోడలో, కుటుంబ సభ్యురాలో అయితే మీరు సంతోషిస్తారా?" ప్రధానమంత్రికి అత్యాచార బాధితురాలి తల్లి ప్రశ్న
అత్తని 9 కిలోమీటర్లు మోసుకెళ్లిన కోడలు, అలోక్ పుతుల్, బీబీసీ కోసం, రాయ్‌పూర్ నుంచి..

ఫొటో సోర్స్, Kunjbihari Gupta
ఫొటో క్యాప్షన్, అత్తని వీపుపై మోసుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకు తీసుకెళ్లారు కోడలు రుక్మిణియా. ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా, మైన్‌పాట్ ప్రాంతంలోని జంగల్‌పారా గ్రామంలో హృదయవిదారక దృశ్యమొకటి వెలుగులోకి వచ్చింది.
పింఛన్ కోసం ఒక మహిళ 90 ఏళ్లున్న తన అత్తను వీపుపై మోసుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది.
సోమారి బాయి గిరిజన మహిళ. ఆమెకు రావాల్సిన రూ.1500 పెన్షన్ సొమ్ము గత మూడు నెలలుగా రావడం లేదు. దీంతో కోడలు రుక్మిణియా తన అత్తని వీపుపై మోసుకుంటూ రాళ్లురప్పలు, వాగులు దాటుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ బ్యాంకుకు తీసుకెళ్లారు.
వాళ్ల ఊరికి సరైన రోడ్డు మార్గం గానీ, రవాణా సౌకర్యాలు గానీ లేవు.
సోమారి బాయి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆ ఖాతా సేవలు నిలిచిపోయాయని బ్యాంక్ మేనేజర్ అల్తాఫ్ మీర్జా తెలిపారు. ప్రస్తుతం ఆ అకౌంట్‌కు సంబంధించిన కేవైసీ, మొబైల్ నంబర్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది.
ఇకపై బ్యాంక్ మిత్ర ద్వారా పింఛన్ సొమ్ము నేరుగా వృద్ధురాలి ఇంటికే వెళ్లి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ గ్రామానికి చేరుకుని ఆరా తీశారు. సోమారి బాయి పింఛను విత్‌డ్రా చేసే అవకాశం ఆమె కోడలు రుక్మిణియాకు కల్పించనున్నట్లు మైన్‌పాట్ ఎస్డీఎం ఫగేశ్ సిన్హా తెలిపారు.
'రొమ్ముల సర్జరీ తర్వాత నన్ను నేను చూసుకోగానే ఏడుపొచ్చేసింది', వక్షోజాల సైజు తగ్గించుకున్న ఈ మహిళలు ఏమంటున్నారు?
సొరచేప దాడి చేయడంతో వ్యక్తి మృతి
క్యూబా - అమెరికా మధ్య చిచ్చురేపిన విమాన దాడి.. రౌల్ క్యాస్ట్రోపై చార్జ్‌షీట్ వెనుక అసలు కథ
బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్

ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images
టాలీవుడు నటుడు రామ్ చరణ్.. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.
త్వరలో విడుదల కానున్న తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ రామ్ చరణ్ పొరపాటున జస్ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా సంబోధించారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు.
రామ్ చరణ్ శనివారం రాత్రి ఎక్స్‌లో చేసిన పోస్టులో ఇలా రాశారు. "అయ్యో... నేను నిజంగా కొన్నిసార్లు పేర్లు మర్చిపోతుంటాను."
"జస్ప్రీత్ బుమ్రా గారు, జరిగిన పొరపాటుకు నేను క్షమాపణలు చెబుతున్నా. అంతమంది జనంలో, కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమిది."
"నాకు మీరంటే చాలా గౌరవం. మీ ఆటకు పెద్ద అభిమానిని. మీరు నిలకడగా రాణిస్తూ, బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపిస్తున్నప్పుడు ప్రతి భారతీయుడూ గర్వపడతాడు" అని రామ్ చరణ్ రాశారు.
పాకిస్తాన్: క్వెట్టాలో రైల్వే ట్రాక్‌పై పేలుడు, 20 మంది మృతి

ఫొటో సోర్స్, Banaras KHAN / AFP via Getty Images
పాకిస్తాన్‌లోని క్వెట్టాలో చమన్ గేట్ దగ్గర రైల్వే ట్రాక్‌లపై ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.
పేలుడు కారణంగా రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పగా రెండు బోగీలు బోల్తా పడ్డాయి.
పేలుడు తీవ్రతకు రైల్వే ట్రాక్ దగ్గర నిలిపి ఉంచిన అనేక వాహనాలతో పాటు సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ప్రస్తుతం ఘటనా స్థలంలో సైనిక, పోలీసు బలగాలను మోహరించారు. పేలుడుకు గల కారణం లేదా మృతుల సంఖ్యపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
క్వెట్టాలో జరిగిన పేలుడును రైల్వే మంత్రి మహమ్మద్ హనీఫ్ అబ్బాసి తీవ్రంగా ఖండించారు.
" క్వెట్టా కంటోన్‌మెంట్ నుంచి వస్తున్న షటిల్ రైలు చమన్ గేట్ దగ్గర పేలుడుకు గురైంది" అని రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి తెలిపారు.
పేలుడు కారణంగా ఇంజన్‌తో సహా మూడు కోచ్‌లు పట్టాలు తప్పగా, మరో రెండు కోచ్‌లు బోల్తా పడ్డాయని ఆయన చెప్పారు.
త్విషా శర్మ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, రేపు విచారణ

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP via Getty Images
త్విషా శర్మ మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి రేపు విచారణ జరపాలని నిర్ణయించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం త్విషా శర్మ మృతి కేసును సోమవారం విచారించనుంది.
త్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్ వరకట్నం కోసం ఆమెను వేధించారని, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సమర్థ్ సింగ్ శుక్రవారం జబల్‌పూర్‌లో లొంగిపోగా శనివారం ఆయన్ను ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు.
మరోవైపు త్విషా అత్త గిరిబాలసింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్‌లోని అత్తగారింట్లో త్విషా శర్మ మృతదేహం లభ్యమైంది.
ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన నలుగురు సీనియర్ వైద్యుల బృందం రాష్ట్ర ప్రభుత్వ చార్టర్డ్ విమానంలో శనివారం సాయంత్రం భోపాల్‌కు చేరుకుంది.
ఆ బృందం అత్యాధునిక ఫోరెన్సిక్ పరికరాలను వెంట తెచ్చుకుందని అధికారులు తెలిపారు.
త్విషా శర్మ మృతదేహానికి ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఇవాళ రెండో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో కూడా తీయనున్నారు.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
అబ్దుల్ రహీమ్: మరణశిక్ష తప్పించడానికి రూ.34 కోట్లు సేకరించి ఇచ్చారు, మరి సౌదీ జైలు నుంచి విడుదల ఎప్పుడు?
వైట్ హౌస్ కాల్పుల ఘటన: మనకు ఇంకా తెలియని కీలక విషయాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images
వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిపిన నాసిరే బెస్ట్ ఉద్దేశం ఏంటో ఇంకా తెలియరాలేదు. ఆయన ఏ రకమైన ఆయుధాన్ని ఉపయోగించాడనే దానిపై కూడా ఇంకా ఎటువంటి నిర్ధారణ రాలేదు.
ఈ ఘటనలో తుపాకీ కాల్పులకు గురైన సాధారణ పౌరుడి గురించి కూడా ఇంకా వివరాలు బయటకు రాలేదు. అసలు ఆ వ్యక్తి.. బెస్ట్ జరిపిన కాల్పుల వల్ల గాయపడ్డారా? లేక సీక్రెట్ సర్వీస్ జరిపిన ఎదురుకాల్పుల్లో గాయపడ్డారా తెలియలేదు.
ట్రంప్, కాల్పులు జరిగిన సమయంలో వైట్ హౌస్‌లోనే ఉన్నారని సీక్రెట్ సర్వీస్ ధ్రువీకరించినప్పటికీ, ఈ ఘటనపై ట్రంప్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
‘వ్యవహారం కీలక దశలో ఉంది, అందుకే నా కొడుకు పెళ్లికి కూడా నేను వెళ్లడం లేదు’- ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
