ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఆడవాళ్ల మెదడు ఎలా పనిచేస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

1. ఆడవాళ్ల మెదడు ఎలా పనిచేస్తుంది?

"స్త్రీలు బయటి నుంచి, లోపలి నుంచి కూడా కళాకృతుల వంటి వారు. నేను న్యూరోసైంటిస్ట్‌ను. లోపలి భాగాలపై దృష్టి పెడతాను. ముఖ్యంగా మహిళల మెదడు మీద."

ఈ మాటలు చెబుతూ, లిసా మాస్కాని తన టెడ్‌టాక్ ప్రారంభించారు.

"మెనోపాజ్ మహిళల మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది?" - ఇదీ ఆమె ప్రసంగం టైటిల్.

మాస్కాని న్యూరోసైన్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్, న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీ వెయిల్ కార్నెల్ మెడికల్ సెంటర్‌లో అల్జీమర్స్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ డైరెక్టర్.

చాలా ఏళ్లుగా ఆమె మనిషి మెదడును అధ్యయనం చేస్తున్నారు. మహిళల మెదడుకు, పురుషుల మెదడుకు మధ్య వ్యత్యాసాలపై పరిశోధన చేస్తున్నారు.

"మెదడుకు లింగపరమైన వ్యత్యాసాలు ఏమీ ఉండవని నేను కచ్చితంగా చెప్పగలను. పింక్, బ్లూ లేదా బార్బీ, లెగోస్.. ఇవన్నీ మానవులు తయారుచేసుకున్న సాధనాలు. మెదడు పనితీరుకూ, వీటికీ ఏ సంబంధం లేదు" అని ఆమె అన్నారు.

బీబీసీ, డాక్టర్ లిసా మాస్కానితో మాట్లాడింది. ఆమె చెప్పిన పరిశోధన వివరాలు ఇవీ.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

అమృత్‌సర్

ఫొటో సోర్స్, F9PHOTOS/GETTY IMAGES

2. అమృత్‌సర్: ఆకలి ఎరుగని నగరం.. సిక్కుల సేవాగుణానికి ఇది ఎలా ఉదాహరణగా నిలుస్తోంది?

అమృత్‌సర్ పేరు చెప్పగానే మొదట అందరికీ స్వర్ణ దేవాలయమే గుర్తుకు వస్తుంది. ఇదొక్కటే కాదు, అమృత్‌సర్‌ అనేక విషయాలకు ప్రసిద్ధి చెందింది.

ఈ నగరానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పసందైన వంటకాలకు పేరు పొందింది. అలాగే సిక్కులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం గోల్డెన్ టెంపుల్ (స్వర్ణ దేవాలయం) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇవన్నీ ఉన్నప్పటికీ, ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలిపే మరో అంశం ఇక్కడ ఉంది.

అదేంటంటే దాతృత్వం. దేవాలయాల నుంచి వీధుల్లోని ప్రజల వరకు ప్రతిచోటా దాతృత్వం కనిపిస్తుంది.

అమృత్‌సర్‌ను 16వ శతాబ్దంలో సిక్కు గురువు స్థాపించారు. సిక్కు మతం ఉద్భవించిన పంజాబ్‌ రాష్ట్రంలో అమృత్‌సర్ ఉంది. ఈ నగర జనాభా 20 లక్షలు.

సిక్కు మతం 'సేవ'కు ప్రసిద్ధి పొందింది. బదులు ఏమీ ఆశించకుండా సిక్కులు స్వచ్ఛందంగా ఇతరుల కోసం సేవ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు గురుద్వారాల్లో సేవ చేస్తారు. చాలా చిన్న చిన్న పనుల్ని వారు స్వచ్ఛందంగా భుజాలకెత్తుకుంటారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

మహాసముద్రాల్లో మునిగిన నౌకల్లోని సంపద వెలికి తీయడం ఎలా

ఫొటో సోర్స్, Getty Images

3. మహాసముద్రాల్లో మునిగిన నౌకల్లోని సంపద వెలికి తీయడం ఎలా?

సముద్రంలో మునిగిపోయిన నౌకలకు చెందిన మూడు కొత్త శిథిలాలను గుర్తించినట్లు యునెస్కో తాజాగా వెల్లడించింది. వీటిలో రెండు శిథిలాలు వేల ఏళ్లనాటివి. అయితే, ఇలాంటివి సముద్రంలో ఎన్ని ఉండొచ్చు?

ఎలియాజ్ స్టాడియాటిస్ ఎప్పటిలానే నీలి రంగు నీటిలో 'స్పాంజ్'గా పిలిచే నాచు మొక్కల కోసం వెతుకుతున్నారు. కాపర్ డైవింగ్ సూట్ వేసుకుని, ఆక్సిజన్ సాయంతో ఆయన నెమ్మదిగా సముద్రం అడుగుకు చేరుకున్నారు.

చిమ్మ చీకటి నడుమ ఆయనకు ఊహించని దృశ్యాలు కనిపించాయి. చుట్టుపక్కల మానవ శరీర భాగాల్లా కనిపిస్తున్న కొన్ని అవశేషాలను ఆయన గుర్తించారు. వెంటనే అక్కడ తనకు పాడైన కొన్ని మృతదేహాలు కనిపించాయని కెప్టెన్‌కు ఆయన వివరించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్

ఫొటో సోర్స్, Getty Images

4. ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?

చివరి నిమిషంలో డ్రైవర్లు క్యాబ్‌లను క్యాన్సిల్ చేయడంతో ఇలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు చాలా మందే ఉంటారు.

తాజాగా హైదరాబాద్‌లోనూ ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గంలో రైడ్‌లను డ్రైవర్లు తీసుకోవడం లేదు. చార్జీలను పెంచాలనే డిమాండ్‌తో ఐదు రోజుల నుంచీ వారు నిరసన తెలుపుతున్నారు.

ఇంతకీ క్యాబ్‌లను డ్రైవర్లు రైడ్స్‌ను ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? ఇలా చేసినప్పుడు ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

అరటి పండు

ఫొటో సోర్స్, Getty Images

5. అరటి పండు తింటే 5 లాభాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలో ఎక్కువగా ఇష్టపడే పండ్లలో అరటి పండు ఒకటి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి.

అరటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం బాగా లభిస్తాయి.

తియ్యదనంతో, పసుపు రంగులో ఉండే అరటిపండ్లు మనకు ఎక్కువగా లభిస్తాయి. ఆకుపచ్చ అరటి పండ్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఆకుపచ్చ అరటి పండ్లను కూరగాయ రూపంలో ఎక్కువగా వినియోగిస్తారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)